కానిస్టేబుల్ పరీక్ష కోసం ఉచిత శిక్షణ
Published Sat, Aug 6 2016 11:32 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని బీసీ, ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుతో పాటు కులాదాయ, పాస్‌పోర్టు సైజ్ ఫొటో ఈనెల 12వ తేదీ లోగా ఆనంద గజపతి ఆడిటోరియం ఎదురుగా మహారాజా సంస్కృత కళాశాల వద్దనున్న స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందించాలన్నారు.
అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించి ఉండరాదని స్పష్టం చేశారు. అభ్యర్థికి ఇంటర్ అర్హత ఉండాలన్నారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు సై్టపెండ్ ఇస్తామని, స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ 08922–231795, 8985492802నంబర్లను సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement