హైదరాబాద్: భారతీయ సంస్కృతి, సంప్రదాయం ఈతరం పిల్లలకు తెలియజెప్పి.. వారిలోని సృజనాత్మతను వెలికి తీసేందుకు ఇస్కాన్ ఆధ్వర్యంలో గీతా వేసవి శిక్షణ శిబిరం’ నిర్వహిస్తున్నట్టు కూకట్‌పల్లి ఇస్కాన్ సెంటర్ డెరైక్టర్ మహా శృంగదాస తెలిపారు. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు కూకట్‌పల్లిలోని ఇస్కాన్ సెంటర్‌లో శిక్షణ ఉంటుందన్నారు. ప్రస్తుత యువత ఎక్కువ సమయం టీవీలు, కంప్యూటర్‌తో గడుపుతున్నారని, ఈ ధోరణి మానసిక, భౌతిక రుగ్మతలకు కారణమవుతుందన్నారు.
ఈ శిబిరంలో సంస్కృత శ్లోక పఠనం, వైదిక కథలు, డ్రామాలు, డాన్స్, ఆటలతో పాటు ఎగ్ రహిత కేకులు, బిస్కెట్స్, కుకీన్ లాంటివి తయారీ నేర్పుతామన్నారు. శిబిరంలో పాల్గొనే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్నట్టు చెప్పారు. వివరాలకు 8008924201, 9866340588 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఇస్కాన్‌లో ‘భగవద్గీత’పై శిక్షణ శిబిరం
Published Wed, May 13 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM
Advertisement
Advertisement