ముగిసిన తైక్వాండో వేసవి శిక్షణ శిబిరం
Published Thu, Jun 1 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM
కాకినాడ సిటీ :
స్పోర్ట్స్ అ«థారిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆండాళ్లమ్మ కళాశాలలో నిర్వహించిన తైక్వాండో వేసవి శిక్షణా శిబిరం బుధవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. నెల రోజులపాటు కొనసాగిన శిక్షణ శిబిరంలో సుమారు 130 మంది బాలబాలికలు పాల్గొన్నారని తైక్వాండో అసోసియేషన్ జిల్లా సెక్రటరీ బి.అర్జున్‌రావు తెలిపారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చుండ్రు గోవిందరాజులు, తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎ.మధుసూదనరావు, ఆండాళ్లమ్మ కళాశాల ప్రిన్సిపాల్ ఏవీఎస్ సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ కె.సుధాకరరావు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తైక్వాండో జాయింట్ సెక్రటరీ కె.అప్పారావు, డి.సత్యనారాయణ, కోచ్‌లు పి.తేజ, ఎన్‌పీ. రాఘవేంద్రస్వామి, డాక్టర్ అబ్రహమ్ పాల్గొన్నారు.
Advertisement