ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్– రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆదివారం చెపాక్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించారు. ఈ పోటీని చూడడానికి ఢిల్లీ నుండి చెన్నైకి వచ్చిన గౌరవ్ (19) అనే యువకుడు.. చెన్నై సూపర్‌స్టార్ మహేంద్ర సింగ్ ధోనీని వ్యక్తిగతంగా చూసిన తరువాతనే ఢిల్లీకి వెళ్తానంటూ అభిమానాన్ని చాటుకున్నాడు.
ధోనీకి వీరాభిమాని అయిన గౌరవ్ తలాను కలిసేందుకు సైకిల్‌పై 23 రోజుల పాటు ప్రయాణించి ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చాడు. దాదాపు 2100 కిలో మీటర్ల ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనా లెక్కచేయక చెన్నై చేరుకున్నాడు. స్నేహితులు ఇచ్చిన టికెట్‌తో రాజస్తాన్ రాయల్స్, చెన్నై మధ్య మ్యాచ్‌ను చూశాడు.
ఈ క్రమంలో ధోనిని వ్యక్తిగతంగా కలిసిన తర్వాత ఢిల్లీకి తిరిగి వెళుతానంటూ చేపాక్కం మైదానం 9వ గేట్ ప్రవేశ ప్రాంతంలో గుడారం వేసుకున్నాడు. తానూ క్రీడాకారుడిగా ఎదగాలనుకుంటున్నానని.. ధోని అంటే అభిమానం ఉన్నందు వల్లే ఈ సాహసం చేశానని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్‌కే సోషల్ మీడియాలో షేర్ చేసింది.
From Delhi to Den! Yellove has no boundaries 🫶
A tale of sheer passion and unconditional love that transcends distance and time!🥹💛#WhistlePodu #Yellove pic.twitter.com/YtrG96yHXp— Chennai Super Kings (@ChennaiIPL) May 14, 2024
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో చెన్నై రాజస్తాన్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సంజూ శాంసన్ సేనను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసిన రుతురాజ్ గైక్వాడ్ బృందం ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకొంది.
ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని అభిమానులకు అభివాదం చేస్తూ స్టేడియమంతా తిరుగుతూ ఉత్సాహపరిచిన విషయం తెలిసిందే. కాగా.. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా చెన్నై జట్టు ఆర్సీబీతో తలపడనుంది. బెంగళూరు వేదికగా మే 18న ఈ మ్యాచ్ జరుగనుంది.
చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు: ధోని ఫ్యాన్స్‌పై సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment