MS Dhoni Fans
-
కొత్త వ్యాపారంలోకి ధోనీ...
-
ఇద్దరు చిన్నారులకు బాల్ గిప్ట్గా ఇచ్చిన ధోని.. వీడియో వైరల్
Ms Dhoni Gifts The Match ball to Two Young Fans: మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ అనంతరం ధోనీ మ్యాచ్ బాల్‌పై సంతకం చేశాడు. అయితే ఆ బంతిని స్టాండ్స్‌లో ఉన్న ఇద్దరు చిన్నారులకు ధోని గిప్ట్గా ఇచ్చాడు. దీంతో ఆ చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో ధోని 6 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 18 పరుగులు చేసి జట్టును తొమ్మిదోసారి ఫైనల్‌కు చేర్చాడు. చదవండి: Virat Kohli: సీట్లోంచి లేచి ఎగిరి గంతేశాను.. గ్రేటెస్ట్ ఫినిషర్.. ధోనిపై ప్రశంసల జల్లు Dhoni's gift to his littles big hearted Fans pic.twitter.com/zbxcPvb9aW — Ashok Rana (@AshokRa72671545) October 10, 2021 -
అగరబత్తుల సంస్థకు ధోని యాడ్ క్యాంపెయిన్
ముంబై: ప్రముఖ అగరబత్తుల సంస్థ జెడ్ బ్లాక్ తన బ్రాండ్ అంబాసిడర్ అయిన క్రికెటర్ మహీంద్రా సింగ్ ధోనితో నూతన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ధోని ప్రచారంతో బ్రాండ్ ప్రజలకు మరింత చేరువ అవుతుందని కంపెనీ ఎండీపీహెచ్ (జెడ్ బ్లాక్ గ్రూప్) డైరెక్టర్ అంకిత్ అభిప్రాయపడ్డారు. ‘దేశంలో టాప్–3 బ్రాండ్లలో జెడ్ బ్లాక్ ఒకటి. కంపెనీ వినూత్న ఆవిష్కరణలు, సాధించిన విజయాలు నన్ను సంస్థకు అంబాసిడర్‌గా పనిచేసేందుకు ప్రోత్సాహానిచ్చాయి’’ అని ధోని తెలిపారు. -
ధోని కాళ్లు మోక్కిన అభిమాని
-
ధోనికి ఇలా జరగడం తొలిసారేంకాదు..
ఐపీఎల్లో చెన్నై జట్టుకు చాలా క్రేజ్ ఉంది. అందులో ధోనికి అభిమానులు ఎక్కువ. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే చెన్నై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సురేష్రైనా అవుట్ అయినా తర్వాత మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఆ సమయంలో ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వచ్చి ధోని కాళ్లపై వాలిపోయాడు. అప్పడు ధోని ఆ అభిమాని చేయిపట్టుకుని మాట్లాడుకుంటూ ముందుకు వచ్చాడు. దాంతో అతను ఆనందంతో పరవశించిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మైదానంలోకి ఓ అభిమాని ధోని వద్దకు రావడం ఇది మొదటిసారేమి కాదు. గత సంవత్సరం డిసెంబర్లో కూడా ఈ విధమైన ఘటన జరిగింది. శ్రీలంక- ఇండియా మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఓ అభిమాని ధోని వద్దకు వచ్చి పాదాలపై పడాడు. ఇటీవల ధోని అవార్డుల ప్రధానోత్స కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆ కార్యక్రమంలో అవార్డు తీసుకోవడానికి వేదికపైకి వచ్చిన యువకుడు ధోని పాదాలకు మొక్కాడు. ధోనికి ఉన్న క్రేజు అలాంటిది.. ధోని పేరు వింటే అభిమానుల్లో తెలియని జోష్ వస్తుంది. దేశానికి ప్రపంచకప్, టీ-20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోపిలను అందించిన ఘనత ధోనికి సొంతం. కావేరి జల వివాదంతో చెన్నైలో జరగాల్సిన మ్యాచ్‌లను పుణేకు మార్చిన విషయం విదితమే. ఈ మ్యాచ్‌లను వీక్షించడానికి అభిమానుల కోసం చెన్నై- పుణెకు ప్రత్యేక రైలు కూడా ఏర్పాటు చేశారు. ఆ ట్రైన్ పేరును ‘విజిల్‌పోడు ఎక్స్‌ప్రెస్’. అని పెట్టారు. -
పుణె ఓనర్‌పై ధోని ఫ్యాన్స్ సెటైర్లు..
హైదరాబాద్: ఈ ఐపీఎల్ సీజన్లో రైజింగ్ పుణె యజమాని సోదరుడు హర్ష గోయంకాకు ధోని అభిమానుల మధ్య ట్వీటర్ వార్ నడుస్తుంది. గతంలో ధోనిపై అవాకు చేవాకులు పేల్చిన హర్షగోయంకాకు ధోని అభిమానులు ట్వీటర్ వేదికగా గట్టిగా బుద్ది చెప్పారు. అయితే తాజాగా ఆదివారం జరిగిన ఉత్కంఠకర ఫైనల్లో పుణె విజయం ముంగిట చతికిలబడటంతో గోయంకా పై ధోని అభిమానులు విరుచుకు పడ్డారు. విజయం ఖాయం అనుకున్న సంధర్భంలో ముంబై బౌలర్ల అద్భత ప్రదర్శనకు పుణే ఒక్క పరుగు తేడాతో ఓడి టైటిల్ ను దూరం చేసుకుంది. అయితే ఈ ఓటమికి బాద్యుడు గోయంకానే అని ధోని అభిమానులు విమర్శిస్తున్నారు. గోయంకా పై వరుస వ్యంగ్య ట్వీట్లతో విరుచుకు పడుతున్నారు. ఎవరిని కించపరిచేలా మాట్లడవద్దు.. అలా మాట్లడితే ఇలా కర్మ సిద్దాంతం పనిచేస్తుందని ఒకరు.. అడవి రాజు ఏమి చేశాడని మరొకరు.. ఇప్పుడు అడవి రాజు ఎవరో అర్ధమైందా అని వ్యంగ్య ట్వీట్ లతో విరుచుకు పడ్డారు. గతంలో గోయంకా అడవి రాజు ఎవరో తెలిసిందా..అని స్మిత్‌ను పొగడ్తూ ధోనిని కించపరిచేలా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.. మరొకసారి స్ట్రైక్రేట్లను పోస్ట్ చేస్తూ ధోనిని తక్కువ చేసేలా ట్వీట్ చేశాడు. దీంతో అప్పట్లోనే గోయంకా పై అతని అభిమానులు ధోని భార్య సాక్షి సింగ్ ట్వీట్ లతో సమాధానం చెప్పారు.