పుణె ఓనర్‌పై ధోని ఫ్యాన్స్ సెటైర్లు..
హైదరాబాద్: ఈ ఐపీఎల్ సీజన్లో రైజింగ్ పుణె యజమాని సోదరుడు హర్ష గోయంకాకు ధోని అభిమానుల మధ్య ట్వీటర్ వార్ నడుస్తుంది. గతంలో ధోనిపై అవాకు చేవాకులు పేల్చిన హర్షగోయంకాకు ధోని అభిమానులు ట్వీటర్ వేదికగా గట్టిగా బుద్ది చెప్పారు. అయితే తాజాగా ఆదివారం జరిగిన ఉత్కంఠకర ఫైనల్లో పుణె విజయం ముంగిట చతికిలబడటంతో గోయంకా పై ధోని అభిమానులు విరుచుకు పడ్డారు. విజయం ఖాయం అనుకున్న సంధర్భంలో ముంబై బౌలర్ల అద్భత ప్రదర్శనకు పుణే ఒక్క పరుగు తేడాతో ఓడి టైటిల్ ను దూరం చేసుకుంది. అయితే ఈ ఓటమికి బాద్యుడు గోయంకానే అని ధోని అభిమానులు విమర్శిస్తున్నారు.
గోయంకా పై వరుస వ్యంగ్య ట్వీట్‌లతో విరుచుకు పడుతున్నారు. ఎవరిని కించపరిచేలా మాట్లడవద్దు.. అలా మాట్లడితే ఇలా కర్మ సిద్దాంతం పనిచేస్తుందని ఒకరు.. అడవి రాజు ఏమి చేశాడని మరొకరు.. ఇప్పుడు అడవి రాజు ఎవరో అర్ధమైందా అని వ్యంగ్య ట్వీట్ లతో విరుచుకు పడ్డారు. గతంలో గోయంకా అడవి రాజు ఎవరో తెలిసిందా..అని స్మిత్‌ను పొగడ్తూ ధోనిని కించపరిచేలా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.. మరొకసారి స్ట్రైక్‌రేట్‌లను పోస్ట్ చేస్తూ ధోనిని తక్కువ చేసేలా ట్వీట్ చేశాడు. దీంతో అప్పట్లోనే గోయంకా పై అతని అభిమానులు ధోని భార్య సాక్షి సింగ్ ట్వీట్ లతో సమాధానం చెప్పారు.