PC: IPL.com
ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో ఓటమి చవిచూసింది. చెపాక్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో సీఎస్‌కే పరాజయం పాలైంది. కెప్టెన్ ఎంఎస్ ధోని ఆఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ.. విజయం మాత్రం రాజస్తాన్‌నే వరించింది. సీఎస్‌కే విజయానికి చివరి బంతికి 5 పరుగులు అవసరమవ్వగా.. మిస్టర్ కూల్ బంతిని బౌండరీకి తరలించడంలో విఫలమయ్యాడు.
ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న తలైవా.. ఒక్క ఫోర్, 3 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ అనంతరం సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేసిన వాఖ్యలు.. ఆ జట్టు అభిమానులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కెప్టెన్ ఎంఎస్ ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నాడని ఫ్లెమింగ్ తెలిపాడు.
ధోనికి గాయం..
"ధోని ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఎంఎస్ ఫీల్డ్‌లో కూడా పరుగు తీసేందుకు కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అందుకే అతడు రెండు పరుగుల రావల్సిన సందర్భాల్లో కేవలం సింగిల్ మాత్రమే తీయగలిగాడు. ప్రస్తుతం అతడు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. మా తర్వాతి మ్యాచ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది కాబట్టి.. ధోని కోలుకోంటాడని ఆశిస్తున్నాము.
ఇక ధోని ఎల్లప్పుడూ ఫిట్‌నెస్‌గా ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ఈ టోర్నీ ప్రారంభానికి ఒక నెల ముందే జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ను మొదలపెట్టాడు. అతడిలో ఇప్పటికీ కొంచెం కూడా జోరు తగ్గలేదు. అతడు అద్భుతమైన ఆటగాడు అని ఫ్లెమింగ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. ఇక సీఎస్‌కే తమ తదుపురి మ్యాచ్‌లో ఏప్రిల్ 17న ఆర్సీబీతో తలపడనుంది.
చదవండి: IPL 2023: అదే మా ఓటమిని శాసించింది.. ఆ విషయం నాకు నిజంగా తెలియదు: ధోని
𝑽𝒊𝒏𝒕𝒂𝒈𝒆 𝑴𝒂𝒉𝒊 🤩
— JioCinema (@JioCinema) April 12, 2023
Rewind Dhoni's late blitz from #CSKvRR & keep watching #IPLJioCinema 🙌#TATAIPL #IPL2023 | @msdhoni pic.twitter.com/k09CU93AC5
Comments
Please login to add a commentAdd a comment