IPL 2023, CSK Vs RR: అదే మా ఓటమిని శాసించింది.. ఆ విషయం నాకు నిజంగా తెలియదు: ధోని | CSK MS Dhoni Says I Didn't Know It Was My 200th As CSK Captain - Sakshi
Sakshi News home page

IPL 2023: అదే మా ఓటమిని శాసించింది.. ఆ విషయం నాకు నిజంగా తెలియదు: ధోని

Published Thu, Apr 13 2023 8:04 AM | Last Updated on Thu, Apr 13 2023 10:41 AM

Didnt Know it Was My 200th as CSK Captain says Ms Dhoni - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో గత నాలుగు మ్యాచ్‌లు అభిమానులకు అసలు సిసలైన క్రికెట్‌ మజాను అందించాయి. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా బుధవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన ఉత్కంఠ పోరు కూడా క్రికెట్‌ ప్రియులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం సాధించింది.

ఆఖరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. కెప్టెన్‌ ధోని రెండు సిక్స్‌లు బాది అందరిలో ఉత్కంఠ రేకెత్తించాడు. అయితే ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సిన నేపథ్యంలో.. ధోని కేవలం ఒక్క సింగిల్‌ మాత్రమే చేయడంతో సీఎస్‌కే 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం సీఎస్‌కే కెప్టెన్‌ ధోని స్పందించాడు. మిడిల్‌ ఓవర్లలో పరుగులు చేయడంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని, అందుకే ఓడిపోయాం ధోని తెలిపాడు.

పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో ధోని మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు అద్భుతంగా పోరాడం. అయితే మిడిల్ ఓవర్లలో మేము స్ట్రైక్ రొటేషన్ చేయడంలో విఫలమయ్యాం. పిచ్‌కు స్పిన్‌కు అంతగా అనుకూలించినప్పటికీ.. ఆ జట్టులో చహల్‌, అశ్విన్‌ వంటి అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఉన్నారు. వారిని ఎదుర్కొవడానికి మా బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. బ్యాటింగ్‌లో విఫలమకావడంతోనే ఓటమి చెందాము. ఈ లక్ష్యం చేధించడం పెద్ద కష్టమేమి కాదు. నేను జడ్డూ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ఫినిష్‌ చేయాలి అనుకున్నాం.

కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు. అయితే లక్ష్యానికి సమీపంగా రావడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ టోర్నీ ఆఖరి దశలో నెట్‌రన్‌రేట్‌ చాలా కీలకమవుతుంది. అదే విధంగా బ్యాటర్లు కూడా ఫీల్డ్‌ సెటప్‌కు తగ్గట్టు ఆడాలి. ప్రత్యర్ధి బౌలర్‌ను ఒత్తిడిలోకి నెట్టాలి. వాళ్లు మంచిగా బౌలింగ్‌ చేస్తే వారి అదృష్టం. లేదంటే బంతిని స్టాండ్స్‌కు పంపడం మన పని.

నేను కూడా  నేను దాని కోసమే ఎదురు చూశాను. నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఏ ఆటగాడైనా అటువంటి సమయాల్లో తన బలాన్ని నమ్మాలి. స్ట్రైట్‌గా హిట్‌ చేయడం నా బలం. మంచు ప్రభావం కూడా ఎక్కువగా ఉండడంతో పిచ్‌ నెమ్మదిగా బ్యాటింగ్‌కు అనుకూలించింది. ఇక ఈ మ్యాచ్‌లో మా బౌలర్ల ప్రదర్శన పట్ల  నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది కెప్టెన్‌గా నాకు 200 మ్యాచ్ అనే విషయం తెలియదు. నాకు వ్యక్తిగత మైలురాళ్లు ముఖ్యం కావు. మనవంతు 100 శాతం ఎఫెక్ట్  పెట్టడమే ముఖ్యం" అని పేర్కొన్నాడు.
చదవండి#MS DHONI: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధోని.. ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement