IPL 2023: Digital viewership skyrockets to 2.2 crore during MS Dhoni's batting - Sakshi
Sakshi News home page

IPL 2023: కొట్టింది 3 సిక్స్‌లే.. దెబ్బకు ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు! అట్లుంటది ధోనీతో

Published Thu, Apr 13 2023 9:43 AM | Last Updated on Thu, Apr 13 2023 10:23 AM

Digital viewership skyrockets to 22 crore during MS Dhonis batting  - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మాత్రం అభిమానులను అలరించాడు. తలైవా ట్రెడ్‌మార్క్‌ షాట్లకు చెపాక్‌ మైదానం దద్దరిల్లిపోయింది. ధోని ఆఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్‌లో సీఎస్‌కే 21 పరుగులు అవసరమవ్వగా.. ధోని రెండు సిక్స్‌లు బాదినప్పటికీ విజయం మాత్రం రాజస్తాన్‌ వైపే నిలిచింది.

ఈ మ్యాచ్‌లో కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మిస్టర్‌ కూల్‌.. ఒక్క ఫోర్‌, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ధోనీ బ్యాటింగ్‌కు రాగానే డిజిటల్‌ బ్రాడ్‌ కాస్టర్‌ జియో సినిమా వ్యూస్ రూ. 2 కోట్ల మార్క్‌ను ధాటింది. ఆఖరి ఓవర్ రెండు సిక్స్‌లు బాదిన అనంతరం ఈ సంఖ్య 2.2 కోట్లకు చేరింది.

ఇదే జియో సినిమాకు ఆల్‌టైమ్ రికార్డు కావడం గమనార్హం. అంతకుముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని కొట్టిన రెండు సిక్సర్లను లైవ్‌లో ఏకకాలంలో 1.7 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో ఈ రికార్డు బద్దలు అయింది.
చదవండి: IPL 2023: ఏంటి అశ్విన్‌ ప్రతీసారి ఇలా.. రహానే కూడా తక్కువ కాదు! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement