చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఒకే జట్టుకు 200 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన తొలి కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు కెప్టెన్ హోదాలో మైదానంలో అడుగుపెట్టిన మిస్టర్ కూల్ ఈ ఘనతను సాధించాడు.
చెన్నై జట్టుపై రెండేళ్లపాటు నిషేధం విధించిన సమయంలో ధోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు తరఫున రెండు సీజన్‌లు (2016, 2017) ఆడాడు. ఓవరాల్‌గా ధోని ఇప్పటి వరకు ఈ టోర్నీలో 214 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో పుణె సూపర్‌జెయింట్‌కు 14 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు.
చెన్నై జట్టుకు 200 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించాడు.అతడి కెప్టెన్సీలో సీఎస్‌కే 121 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ధోని తర్వాత ఒక ఐపీఎల్ జట్టుకు అత్యధిక మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన ఘనత రోహిత్ శర్మ పేరిట ఉంది.
ఇప్పటివరకు ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రోహిత్ ముంబై ఇండియన్స్‌కు 146 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించాడు. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు ధోనిని చెన్నై ఫ్రాంచైజీ యజమాని శ్రీనివాసన్ సన్మానించారు. అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో 238 మ్యాచ్‌లతో ధోని తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో సీఎస్‌కే ఓటమి పాలైంది. ధోని(17 బంతుల్లో 32) ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికీ విజయం మాత్రం రాజస్తాన్‌కే వరించింది.
చదవండి: IPL 2023: ధోని మెరుపులు వృధా.. సీఎస్‌కేపై రాజస్తాన్ విజయం
Comments
Please login to add a commentAdd a comment