pic credit: IPL Twitter
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మహేంద్రుడు ఎవరికీ సాధ్యంకాని ఓ రికార్డును ఇవాళ (ఏప్రిల్ 12) తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఇవాళ జరిగే మ్యాచ్ సీఎస్‌కే కెప్టెన్‌గా ధోనికి 200వ మ్యాచ్. ఐపీఎల్ చర్రితలో ఇప్పటివరకు ఏ కెప్టెన్ ఇన్ని మ్యాచ్‌ల్లో ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీకి సారధ్యం వహించలేదు.
ఐపీఎల్ కెరీర్‌లో ఓవరాల్‌గా 237 మ్యాచ్‌లు ఆడిన ధోని 200 మ్యాచ్‌ల్లో సీఎస్‌కేకే సారధ్యం వహించడం విశేషం. 2016, 2017 సీజన్లలో మినహా ధోని తన ఐపీఎల్ కెరీర్ మొత్తం సీఎస్‌కేకే అంకితం చేశాడు. సీఎస్‌కేపై బ్యాన్ ఉండటంతో ధోని 2016, 2017 సీజన్లలో రైజింగ్ పూణే జెయింట్స్‌కు ఆడాడు. ఆ ఫ్రాంచైజీకి కూడా ధోనినే సారధ్యం వహించాడు.
గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు మినహాయించి ధోని తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో కెప్టెన్‌గానే వ్యవహరించాడు. అతని సారధ్యంలో సీఎస్‌కే 2010, 2011, 2018, 2021 సీజన్ల టైటిళ్లు గెలిచింది. ఐపీఎల్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (5) తర్వాత ధోని (4)నే అత్యంత విజయవంతమైన కెప్టెన్. విన్నింగ్ పర్సంటేజ్ విషయంలోనూ రోహిత్ (1), ధోని (2) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ధోని 207 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసి 123 మ్యాచ్‌ల్లో తన జట్లను విజయపథంలో నడిపించాడు. 83 మ్యాచ్‌ల్లో అతను సారధ్యం వహించిన జట్లు ఓటమిపాలయ్యాయి. అలాగే ధోని తన సారధ్యంలో సీఎస్‌కేను 9 సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చాడు. లీగ్ చరిత్రలో ఏ కెప్టెన్ ఓ జట్టును ఇన్ని సార్లు ఫైనల్‌కు చేర్చలేదు. ఐపీఎల్ కెప్టెన్ కమ్ బ్యాటర్‌గా ధోనికి మరో రికార్డు కూడా ఉంది. విరాట్ కోహ్లి తర్వాత కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఖాతాలో 4881 పరుగులు ఉండగా.. ధోని 4482 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment