న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2023–24) వివిధ రకాల వాహనాల థర్డ్–పార్టీ మోటార్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి కేంద్రం కొత్త బేస్ ప్రీమియం రేట్లను ప్రతిపాదించింది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐతో సంప్రదించిన మీదట 1,000 సీసీ సామర్థ్యం లోపు గల ప్రైవేట్ కార్లకు రూ. 2,094, 1000–1,500 సీసీ కార్లకు రూ. 3,416, అంతకు మించిన వాటికి రూ. 7,897 బేస్ ప్రీమియంను సూచించింది. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ఈ మేరకు ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. పరిశ్రమ వర్గాలు 30 రోజుల్లోగా దీనిపై అభిప్రాయాలు చెప్పాలి. నోటిఫికేషన్ ప్రకారం..
- 75 సీసీ లోపు సామర్ధ్యమున్న టూ–వీలర్లకు రేటు రూ. 538గాను, అంతకు మించి 350 సీసీ వరకు రూ. 714–2,804 శ్రేణిలోనూ బేస్ ప్రీమియం ఉండనుంది.
- గూడ్స్ రవాణా చేసే వాణిజ్య వాహనాలకు సంబంధించి (త్రిచక్ర వాహనాలు కాకుండా) 7,500 కేజీలలోపు వైతే రూ. 16,049, అది దాటి 40,000 కేజీలు.. అంతకు పైన వాటికి రూ. 27,186–44,242 శ్రేణిలో బేస్ ప్రీమియం రేటు ఉంటుంది.
- ఈ–కార్టులు మినహా మోటార్ త్రీ–వీలర్లకు బేస్ ప్రీమియంను రూ. 4,492గా ప్రతిపాదించారు.
- అటు ప్రైవేట్ ఈ–కార్ల విషయానికొస్తే.. 30 కిలోవాట్ సామర్థ్యం ఉన్న వాటికి రూ. 1,780, అంతకు మించి 65 కేడబ్ల్యూ వరకు రూ. 2,904, దాన్ని దాటితే రూ. 6,712 గాను బేస్ ప్రీమియం ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment