
టాలీవుడ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ కొన్ని గంటలుగా ఒక వార్త నెట్టింట ప్రచారం జరుగుతుంది. దీనిని బేస్ చేసుకుని కొన్న ప్రధాన వెబ్ సైట్లు కూడా వాటిని ప్రచురించడం ప్రారంభించాయి. అక్కినేని నాగచైతన్య- నటి శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ ఈ రోజు జరగనుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

అతికొద్ది మంది సమక్షంలో నేడు (ఆగష్టు 8) ఈ కార్యక్రమం జరగనుందని వైరల్ అవుతుంది. ఈ విషయంపై అధికారికంగా అక్కినేని వారి కుటుంబంతో పాటు శోభితా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

2017లో నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య. అయితే, వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలో నటి శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య లవ్‌లో పడ్డారని చాలారోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందుకు సంబంధించిన మొదటి అడుగు నేడు పడుతుందని కొందరు చెబుతున్నారు.

నాగచైతన్య- నటి శోభితా ధూళిపాళ్ల ప్రేమలో ఉన్నారని ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చినా వాటిని వారిద్దరూ ఖండించలేదు. దీంతో అభిమానుల్లో కూడా నిజమే ఉంటుంది అనే భావన కలిగింది.

ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ జరగనుందని వార్తలు వస్తున్నాయి. నేడు ఈ కాకర్యక్రమం పూర్తి అయిన తర్వాత నాగార్జునే అధికారికంగా ఈ విషయాన్ని తెలుపుతారని సమాచారం.

శోభితా ధూళిపాళ్ల పొన్నియిన్ సెల్వన్ ,ది నైట్ మేనేజర్ 2, గూఢాచారి,మేజర్,కురుప్ వంటి చిత్రాల్లో మెప్పించింది.

కల్కి చిత్రంలో దీపికా పదుకొణ్‌కు తెలుగు డబ్బింగ్ కూడా చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన ఈ బ్యూటీ ముంబై యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్‌లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది.

2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది.










