సల్మాన్ పెళ్లి పై అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే.. | Salman-Iulia getting hitched this year? Here's what Arbaaz has to say | Sakshi
Sakshi News home page

సల్మాన్ పెళ్లి పై అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే..

Published Fri, May 20 2016 11:59 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

సల్మాన్  పెళ్లి పై అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే..

సల్మాన్ పెళ్లి పై అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే..

ముంబై:  బాలీవుడ్  సూపర్ స్టార్  సల్మాన్ ఖాన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు ఇపుడు  హాట్ టాపిక్ గా మారాయి. ప్రియురాలు లులియాతో పెళ్లికి  సై అన్నాడనే  టాక్   హల్ చల్ చేస్తోంది. ఈ   నేపథ్యంలో  దీనిపై  సల్మాన్ సోదరుడు,నటుడు  అర్బాజ్ ఖాన్  మీడియా ప్రశ్నించినపుడు సమాధానం దాట వేశాడు. అటు  అన్న పెళ్లి వార్తను ఖండించకుండా, ధృవీకరించకుండా చాకచక్యంగా తప్పించుకున్నాడు.

ఇటీవల గుప్పుమన్న సల్మాన్ పెళ్లి వార్తలపై ప్రశ్నించినపుడు అర్బాజ్ ఖాన్ తెలివిగా తప్పించుకున్నాడు.  అంతేకాదు.. వెల్.. లిజన్...ఇది  సందర్భంకాదు.. అయినా దీనికి సమాధానం చెబుతానని  మీరు భావించారా అంటూ అక్కడనుంచి జారుకున్నారు.  బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న సల్మాన్ ఖాన్ త్వరలోనే పెళ్లిచేసుకోనున్నాడనే వార్తలు ఇప్పటివి కావు. కానీ ఇటీవల ప్రీతిజింటా వివాహ విందులో  సల్మాన్, లులియా సందడి చేయడం  విశేషంగా మారింది. దీంతో   స్మాలన్ 51వ  పుట్టినరోజైన డిసెంబర్ 27నే పెళ్లి చేసుకోవడం ఖాయం మనే గుసగుసలు  మరింత జోరుగా  వినిపిస్తున్నాయి.  
కాగా  బాలీవుడ్ బాడీగార్డ్  సల్మాన్ కి,  రొమానియన్ విశ్వవిద్యాలయంనుంచి న్యాయ శాస్త్రంలో పట్టాపొందిన రొమేనియన్  మోడల్  లులియా వంతూర్ తో  2013లో పరిచయమైంది.  ఆ పరిచయం కాస్తా ప్రణయంగా మారడం, ఎన్నో కార్యక్రమాల్లో సల్మాన్, లులియాలు కలిసి హల్ చల్  చేయడం, ఇటీవల ముంబైలో లియా సైతం సల్మాన్ తల్లి చేతిని పట్టుకుని నడిపిస్తున్న ఫోటోలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.  
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement