say
-
జాన్ సే డైరెక్టర్ తో " చిట్ చాట్ "
-
ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌కు క్షమాపణ చెప్పాలి
ఉద్యమనేతపై నిందలు వేస్తే తరిమికొడతాం పురుషోత్తమ్‌రెడ్డి పై టీఆర్ఎస్వీ ఫైర్ హన్మకొండ చౌరస్తా : నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పై అర్ధరహిత నిందారోపణలు చేసిన చైతన్య విద్యా సంస్థల చైర్మ¯ŒS సీ.పురుషోత్తమ్‌రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ వాసుదేవరెడ్డి హెచ్చరిం చారు. హన్మకొండ నయింనగర్‌లోని టీఆర్ఎస్ అర్బ¯ŒS పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే పురుషోత్తమ్‌రెడ్డిని ఎప్పుడు డబ్బులు అడిగాడో ఆధారాలుంటే బయట పెట్టాలన్నారు. అక్రమంగా నాలాలపై నిర్మాణాలు చేయడమే కాకుండా నిరాధారమైన నిందలు వేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. మరోసారి ఇలాం టివి వేస్తే నగరంలో ఉండకుండా తరిమికొడతామన్నారు. నాడు తెలం గాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో సైతం పురుషోత్తమ్‌రెడ్డి కలిసి రాకుండా సీఎం కేసీఆర్ పై వ్యంగస్త్రాలు వేశాడని మండిపడ్డారు. ఉద్యమానికి మద్దతుగా కళాశాల బంద్ పాటించాలని కోరినందుకు విద్యార్థి నేతలపై అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఆయన నిర్మాణాలు సక్రమమైతే ప్రజలు, అధికారుల ముందు ఆధారాలు ఉంచాలని సూచించారు. హైదరాబాద్ మాదిరిగానే వరంగల్‌లో సైతం నాలాల ఆక్రమణతో సంభవించిన నష్టం రూ.50 కోట్ల పైనే ఉంటుందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్వీ నేతలు వీరేందర్, రాజగోపాల్, ప్రశాంత్, రంజిత్, దామోదర్, విష్ణు, చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
సల్మాన్ పెళ్లి పై అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే..
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రియురాలు లులియాతో పెళ్లికి సై అన్నాడనే టాక్ హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై సల్మాన్ సోదరుడు,నటుడు అర్బాజ్ ఖాన్ మీడియా ప్రశ్నించినపుడు సమాధానం దాట వేశాడు. అటు అన్న పెళ్లి వార్తను ఖండించకుండా, ధృవీకరించకుండా చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఇటీవల గుప్పుమన్న సల్మాన్ పెళ్లి వార్తలపై ప్రశ్నించినపుడు అర్బాజ్ ఖాన్ తెలివిగా తప్పించుకున్నాడు. అంతేకాదు.. వెల్.. లిజన్...ఇది సందర్భంకాదు.. అయినా దీనికి సమాధానం చెబుతానని మీరు భావించారా అంటూ అక్కడనుంచి జారుకున్నారు. బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న సల్మాన్ ఖాన్ త్వరలోనే పెళ్లిచేసుకోనున్నాడనే వార్తలు ఇప్పటివి కావు. కానీ ఇటీవల ప్రీతిజింటా వివాహ విందులో సల్మాన్, లులియా సందడి చేయడం విశేషంగా మారింది. దీంతో స్మాలన్ 51వ పుట్టినరోజైన డిసెంబర్ 27నే పెళ్లి చేసుకోవడం ఖాయం మనే గుసగుసలు మరింత జోరుగా వినిపిస్తున్నాయి. కాగా బాలీవుడ్ బాడీగార్డ్ సల్మాన్ కి, రొమానియన్ విశ్వవిద్యాలయంనుంచి న్యాయ శాస్త్రంలో పట్టాపొందిన రొమేనియన్ మోడల్ లులియా వంతూర్ తో 2013లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రణయంగా మారడం, ఎన్నో కార్యక్రమాల్లో సల్మాన్, లులియాలు కలిసి హల్ చల్ చేయడం, ఇటీవల ముంబైలో లియా సైతం సల్మాన్ తల్లి చేతిని పట్టుకుని నడిపిస్తున్న ఫోటోలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.