అంతర్యుద్ధంతో రగిలిపోయిన సిరియాలోని విశేషాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి అందించిన ప్రవాస మీడియా సంస్థలు ఇప్పుడు మెల్లగా టర్కీ చేరుకుంటున్నాయి. యుద్ధ వాతావరణం, స్థానిక ప్రజల జీవన స్థితిగతులపై ప్రత్యక్ష ప్రసారాలు చూపించిన పాత్రికేయులు ఇకపై స్థానిక సమస్యలపైనే దృష్టి సారించేందుకు సిద్ధమౌతున్నారు. దీంతో ఇప్పటిదాకా సిరియా నుంచి పుష్కలంగా బయటకు వచ్చే అన్నిరకాల వార్తలు ఇక తగ్గే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ వార్తలపై ఇకమీద తాము ఆసక్తి చూపేది లేదని, సగటు పౌరజీవనం, ఆహార లోపం, స్థానిక సమస్యల వంటివాటిపైనే దృష్టి సారిస్తామని ఆయా వార్తా సంస్థలు చెబుతున్నాయి.
ఇప్పటిదాకా 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ది లావంత్' (ISIL) కవరేజ్ లో ఎక్కువశాతం వలసలు, అంతర్జాతీయ, ప్రాంతీయ విశేషాలతోపాటు, సిరియా యుద్ధం, ఇతర దేశాలపై దాని ప్రభావం వంటి అనేక విషయాలను మీడియా సంస్థలు ప్రధానంగా వెలువరించేవి. అయితే ఇకపై సిరియన్ అంతర్యుద్ధం సృష్టించిన ఘోర సంక్షోభంపై దృష్టి సారించనున్నాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న దేశ పరిస్థితిని, స్థానిక సమస్యలను ప్రతిబింబించేందుకు పాత్రికేయులు సన్నద్ధమౌతున్నారు. సిరియా ప్రజల తిరుగుబాటుతో ఏం జరిగిందో... కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు ప్రత్యక్షంగా చూపించాలనుకుంటున్నారు.
సిరియాలో ఉదయం ప్రసారాల్లో ప్రజలకు పనికొచ్చే తాజా సమాచారాన్ని అందించనున్నారు. అందులో భాగంగా యుద్ధ వాతావరణం నుంచి బయటపడుతూ ఇక్కట్లు పడుతున్న జనానికి ధరలు, అందుబాటులో దొరికే పదార్థాలు, వస్తువుల గుచించి ఎప్పటికప్పుడు తెలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే రాత్రిళ్లు.. సాధారణ విషయాలతో పాటు దాడుల్లో మరణించిన పిల్లలు, ప్రజల వివరాలను కూడా చెబుతున్నారు. కొన్నాళ్లుగా సిరియా అంతర్యుద్ధాన్ని ప్రత్యక్షంగా చిత్రిస్తూ... ఐఎస్ఐఎల్‌లో కఠిన జీవితాన్ని ఎదుర్కొన్న కొన్ని సిరియన్ మీడియా సంస్థలు ఇప్పుడు దక్షిణ టర్కీలోని గేసియెంట్స్, సాన్ లోర్ఫా పట్టణాల్లో తమ కార్యాలయాలను ఏర్పాటుచేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పటిదాకా సిరియా నుంచి ప్రపంచానికి వార్తలను తెలియజేసిన పాత్రికేయులు... ఇకపై ప్రపంచంలోని విషయాలను సిరియన్లుకు అందించేందుకు కృషి చేస్తున్నారు.
సిరియా సమస్యలు, పౌరజీవనం పైనే దృష్టి..
Published Tue, Feb 16 2016 4:47 PM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM
Advertisement