exile
-
షేక్ హసీనా.. నియంతగా మారిన ప్రజాస్వామ్య ప్రతీక!
బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌హసీనా ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో అక్కడే ముగిసింది. ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్యస్థాపన కోసం సైనికపాలకులతో పోరాడిన నాయకురాలు.. నేడు నియంత అనే పేరు మూటగట్టుకుని దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం నడిపిన షేక్ముజిబుర్ రెహ్మాన్ వారసత్వంతో దేశ రాజకీయాల్లోకి వచ్చిన హసీనా 1975లో దేశం మిలిటరీ పాలనలోకి వెళ్లిన తర్వాత యూరప్‌తో పాటు భారత్‌లో ఆశ్రయం పొందారు. 1981లో ఇండియా నుంచే బంగ్లాదేశ్ తిరిగి వెళ్లి ప్రత్యర్థి ఖలీదా జియాతో కలిసి దేశంలో ప్రజాస్వామ్య పోరాటం నడిపారు. తర్వాతి పరిణామాల్లో తిరుగులేని నాయకురాలిగా ఎదిగి ఐదుసార్లు అధికారాన్ని చేపట్టారు. తాజాగా తన ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలపై దేశంలో చెలరేగిన ఆందోళనలు, హింసకు తలొగ్గి దేశం విడిచి తిరిగి భారత్‌కే వచ్చారన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం.పోరాటం నుంచి తిరుగులేని అధికారం వైపు.. మిలిటరీ పాలనపై పోరాడేందుకు హసీనా 1981లో ప్రవాసం వీడి బంగ్లాదేశ్‌కు వచ్చారు. రాజకీయ ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బీఎన్పీ)చీఫ్ ఖలీదా జియాతో చేతులు కలపి దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడారు. 1990లో ఈ పోరాటంలో విజయం సాధించి సైనిక నియంత హుస్సేన్ మహమ్మద్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించారు. అనంతరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్, బీఎన్పీ సంకీర్ణ ప్రభుత్వం నడిపాయి. కాకపోతే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో బీఎన్పీపై విజయం సాధించి షేక్‌హసీనా తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టారు. కానీ ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ చేతిలో హసీనా తిరిగి ఓటమి చవిచూశారు. సైనిక తిరుగుబాటు తదనంతర పరిణామాల తర్వాత మళ్లీ 2007లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన హసీనా అప్పటి నుంచి ఇప్పటివరకు అధికారంలోనే ఉండి బంగ్లాదేశ్‌కు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ వచ్చారు.ప్రతిపక్షమే లేకుండా అణిచివేశారు..2007లో రెండోసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత హసీనా అసలు స్వరూపం బయటపడింది. నియంతృత్వ విధానాలు అమలు చేయడం మొదలు పెట్టారు. రాజకీయ ప్రత్యర్థులు, ప్రజాసంఘాల నేతల మూకుమ్మడి అరెస్టులకు పాల్పడ్డారు. ఒక్కోసారి కొందరు నేతలు ఉన్నట్టుండి అదృశ్యమయ్యేవారు. వారి మిస్సింగ్ మిస్టరీగానే మిగిలింది. ఇంతే కాకుండా హసీనా పాలనలో ఫేక్ ఎన్కౌంటర్లు సర్వసాధారణమైపోయాయి. ఆమె హయాంలో ఐదుగురు ముస్లిం అగ్రనేతలను యుద్ధనేరాల్లో ఉరితీశారు. హసీనా నాయకత్వంలో దేశంలో ఎన్నికలు జరిగితే ప్రతిపక్షం వాటిని బహిష్కరించి పోటీకి దూరంగా ఉందంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ప్రజాస్వామ్యం ముసుగులో నియంతగా ఎలా మారారన్నదానికి హసీనా రాజకీయ జీవితం ఒక ఉదాహరణ అని ఢాకా యూనివర్సిటీ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ నజ్రుల్ అన్నారు.15 ఏళ్ల హసీనా పాలనలో పాజిటివ్ కోణం.. షేక్ హసీనా వరుస 15 ఏళ్ల పాలనలో బంగ్లాదేశ్ ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందిందని చెబుతారు. వస్త్ర తయారీ రంగంలో మహిళలకు అత్యధికంగా ఉద్యోగాలు కల్పించడం వల్లే ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి సాధ్యమైందన్న వాదన ఉంది. హసీనా పాలనలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం భారత్ కంటే ముందుకు వెళ్లింది. హసీనా పాలనలో దేశంలో పేదిరికం తగ్గడంతో పాటు దేశంలోని 17 కోట్ల మంది ప్రజల్లో 95 శాతంమందికి కరెంటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు దేశం ఎందుకు వీడాల్సి వచ్చింది..ప్రభుత్వ ఉద్యోగాల్లో 1971 యుద్ధంలో పాల్గొన్న వారి వారసులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. తొలుత ప్రభుత్వం తీసుకున్న ఈ కోటా నిర్ణయాన్ని తర్వాత ఆ దేశ సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కోటాకు వ్యతిరేకంగా చెలరేగిన ఈ హింసలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో హసీనా ప్రభుత్వం దిగివచ్చి కోటా విధానంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ ఆందోళనలు ఆగలేదు. హసీనా గద్దె దిగాల్సిందేనని, ఆమె ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు తీవ్రమయ్యాయి. చివరకు ప్రధాని అధికార నివాసాన్ని ఉద్యమకారులు చుట్టుముట్టడం.. సైన్యం హెచ్చరికల నేపథ్యంలో.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సోదరితో కలిసి హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. -
స్వదేశానికి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.! పాకిస్థాన్ కొత్త చట్టం..
పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మళ్లీ తన సొంత దేశానికి రావడానికి మార్గం సుగమం అయింది! చట్టసభ్యుల అనర్హతపై కాలపరిమితిని నిర్ణయిస్తూ పాక్ కేంద్ర అసెంబ్లీ చట్టం తీసుకువచ్చింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ పాకిస్థాన్‌కు తిరిగి రావాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్న కొన్ని రోజుల తర్వాత ఈ మేరకు చట్టం తీసుకురావడం గమనార్హం. చట్ట సభ్యులపై ఐదేళ్లకు మించి అనర్హత వేటు వేయడానికి అవకాశం లేనివిధంగా చట్టాన్ని సవరించినట్లు పాక్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఈ సవరణపై తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సిద్ధికీ సంజ్రాణి సంతకం కూడా చేసి ఆమోదించినట్లు స్పష్టం చేశారు. అయితే.. హజ్ యాత్రలో ఉన్న అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వీ లేని సమయంలో ఈ చట్టం తీసుకురావడం గమనార్హం. ఇదీ చదవండి: హజ్‌యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే.. బ్రిటన్‌లో నవాజ్ షరీఫ్.. అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ తీర్పును వెల్లడించింది. అయితే.. 2019లో ఆరోగ్య రీత్యా బెయిల్‌పై విడుదలయిన నవాజ్ షరీఫ్.. బ్రిటన్‌కు పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. పాక్ రాజకీయాలను బ్రిటన్ నుంచే తెరవెనక ఉండి శాసిస్తున్నాడని కొందరు విశ్వసిస్తారు. మళ్లీ రాజకీయాల్లోకి.. గతేడాది విశ్వాస పరీక్షలో ఓడి ఇమ్రాన్ ఖాన్ పదవీత్యుడయ్యాక.. నవాజ్ షరీఫ్ సోదరుడు సెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మాజీ ప్రధాని, తన సోదరున్ని స్వదేశానికి తీసుకురావాలని సెహబాజ్ ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించాడు. నవాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని పదవి చేపట్టాలని అధికార PML-N పార్టీ కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నవాజ్ షరీఫ్ రాజకీయంలోకి వస్తే పార్టీ బలోపేతం అవుతుందని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: నవాజ్ పాక్ తిరిగొచ్చి, నాలుగోసారి ప్రధాని అవ్వాలి: షెహబాజ్ షరీఫ్ -
బుష్ Vs ట్రంప్: ప్రవాసం నుంచి పోరాటంలోకి
వాషింగ్టన్: సొంత శిబిరరమే శత్రువుగా భావిస్తోన్న డోనాల్డ్ ట్రంప్ నానాటికీ బలం పుంజుకుంటున్నాడు. అతని ప్రచండ వేగానికి తాళలేక రిపబ్లికన్ అభ్యర్థిత్వ రేసు నుంచి ఒక్కొక్కరు అస్త్ర సన్యాసం చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటితే ట్రంప్ నే తమ అభ్యర్థిగా ప్రకటించాల్సిన పరిస్థితి. అలా జరగకూడదంటే ట్రంప్ పై బ్రహ్మాస్త్రాన్ని సంధించాలి. తద్వారా అస్మదీయులను ఆదుకోవాలి. ఆ తరుపుముక్క మరెవరోకాదు యూఎస్ మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్. ఏడేళ్లుగా తనకుతాను విధించుకున్న ప్రవాసం నుంచి నిన్ననే బయటికి వచ్చిన జార్జ్ బుష్.. ట్రంప్ పై పోరాటానికి సిద్ధమయ్యారు. రిపబ్లికన్ సెనెటర్ల కోసం నిధుల సేకరణకు నడుం కట్టారు. రిపబ్లికన్ పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. పలు అంశాల్లో విద్వేషపూరితంగా వ్యవహరించే ట్రంప్ ను తన అభ్యర్థిగా అంగీకరించేదిలేదని తేల్చిచెప్పిన పార్టీ.. అసలు ఎన్నికల్లో ట్రంప్ కు అడ్డుకట్టవేసేలా ప్రణాలికలు రచిస్తోంది. దశాబ్ధాలుగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన బుష్ కుటుంబాన్ని, వారి పలుకుబడిని ఉపయోగించుకోవడం ద్వారా సెనెటర్లకు నిధులు సమకూర్చుకోవాలనుకుంటోంది. ఆ క్రమంలోనే తిరిగి పార్టీకోసం పనిచేయాలంటూ జార్జ్ బుష్ ను కొందరు సీనియర్ నేతలు సంప్రదించారు. రెండు దఫాలు అధ్యక్షుడిగా పనిచేసి, గడిచిన ఏడు సంవత్సరాలుగా ప్రవాసంలో గడుపుతున్న బుష్.. ఎట్టకేలకు పార్టీ అభ్యర్థనను మన్నిచారు. ఫండ్ రైజింగ్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సరేనన్నారు. 100మంది సభ్యుల అమెరికా సెనేట్ లో ప్రస్తుతం రిపబ్లికన్ల సంఖ్య 54. వీరిలో అత్యధికులు బలపరిచే వ్యక్తే రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి అవుతాడు. అలా జరగొద్దంటే పార్టీ పెద్దలు సెనెటర్లను ట్రంప్ బారి నుంచి కాపాడుకోవాలి. వీలైనన్ని ఎక్కువ నిధులు సేకరించడం ద్వారా సెనెటర్లు ట్రంప్ వైపునకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు. మాజీ అధ్యక్షుడిగా బుష్ తనకున్న పరిచయాల ద్వారా సెనెటర్ల కోసం నిధులు సేకరిస్తారు. ఆరిజోనా సెనెటర్ జాన్ మెక్ కెయిన్, న్యూ హాంప్ షైర్, ఒహియో, విస్కాన్సిస్, మిస్సౌరీల సెనెటర్లు కెల్లీ అయోట్, రాబ్ పోర్ట్ మెన్, ర్యాన్ జాన్సన్, రాయ్ బ్లంట్ ల తరఫున బుష్ ఫండ్ రైజింగ్ కార్యక్రమ షెడ్యూల్ కూడా ఖరారయినట్లు సమాచారం. కాగా, ట్రంప్.. తనకు వ్యతిరేకంగా జరుగుతోన్న కుట్రలను ఖండించారు. అభ్యర్థి ఎవరైనాసరే, ఎన్నికల్లో సహకరిస్తానని బుష్ గతంలో మాటిచ్చారని, ఇప్పుడా వాగ్ధానాన్ని భంగం చేస్తున్నారని విమర్శించారు. కండోలిజా రైస్ కు కీలక పదవి? జార్జి బుష్ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన కండోలిజా రైస్ ను ఉపాధ్యక్షురాలిగా ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ప్రెసిడెంట్ అయితే రైస్ వైస్ ప్రెసిడెంట్ కావడం ఖాయమని వైట్ హౌస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తోన్న రైస్ మాత్రం.. తనకు ఉపాధ్యక్ష పదవి చేపట్టే ఆసక్తి లేదని, పాఠాలు చెప్పడంలోనే ఆనందం ఉందని పేర్కొన్నారు. -
సిరియా సమస్యలు, పౌరజీవనం పైనే దృష్టి..
అంతర్యుద్ధంతో రగిలిపోయిన సిరియాలోని విశేషాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి అందించిన ప్రవాస మీడియా సంస్థలు ఇప్పుడు మెల్లగా టర్కీ చేరుకుంటున్నాయి. యుద్ధ వాతావరణం, స్థానిక ప్రజల జీవన స్థితిగతులపై ప్రత్యక్ష ప్రసారాలు చూపించిన పాత్రికేయులు ఇకపై స్థానిక సమస్యలపైనే దృష్టి సారించేందుకు సిద్ధమౌతున్నారు. దీంతో ఇప్పటిదాకా సిరియా నుంచి పుష్కలంగా బయటకు వచ్చే అన్నిరకాల వార్తలు ఇక తగ్గే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ వార్తలపై ఇకమీద తాము ఆసక్తి చూపేది లేదని, సగటు పౌరజీవనం, ఆహార లోపం, స్థానిక సమస్యల వంటివాటిపైనే దృష్టి సారిస్తామని ఆయా వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ది లావంత్' (ISIL) కవరేజ్ లో ఎక్కువశాతం వలసలు, అంతర్జాతీయ, ప్రాంతీయ విశేషాలతోపాటు, సిరియా యుద్ధం, ఇతర దేశాలపై దాని ప్రభావం వంటి అనేక విషయాలను మీడియా సంస్థలు ప్రధానంగా వెలువరించేవి. అయితే ఇకపై సిరియన్ అంతర్యుద్ధం సృష్టించిన ఘోర సంక్షోభంపై దృష్టి సారించనున్నాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న దేశ పరిస్థితిని, స్థానిక సమస్యలను ప్రతిబింబించేందుకు పాత్రికేయులు సన్నద్ధమౌతున్నారు. సిరియా ప్రజల తిరుగుబాటుతో ఏం జరిగిందో... కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు ప్రత్యక్షంగా చూపించాలనుకుంటున్నారు. సిరియాలో ఉదయం ప్రసారాల్లో ప్రజలకు పనికొచ్చే తాజా సమాచారాన్ని అందించనున్నారు. అందులో భాగంగా యుద్ధ వాతావరణం నుంచి బయటపడుతూ ఇక్కట్లు పడుతున్న జనానికి ధరలు, అందుబాటులో దొరికే పదార్థాలు, వస్తువుల గుచించి ఎప్పటికప్పుడు తెలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే రాత్రిళ్లు.. సాధారణ విషయాలతో పాటు దాడుల్లో మరణించిన పిల్లలు, ప్రజల వివరాలను కూడా చెబుతున్నారు. కొన్నాళ్లుగా సిరియా అంతర్యుద్ధాన్ని ప్రత్యక్షంగా చిత్రిస్తూ... ఐఎస్ఐఎల్లో కఠిన జీవితాన్ని ఎదుర్కొన్న కొన్ని సిరియన్ మీడియా సంస్థలు ఇప్పుడు దక్షిణ టర్కీలోని గేసియెంట్స్, సాన్ లోర్ఫా పట్టణాల్లో తమ కార్యాలయాలను ఏర్పాటుచేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పటిదాకా సిరియా నుంచి ప్రపంచానికి వార్తలను తెలియజేసిన పాత్రికేయులు... ఇకపై ప్రపంచంలోని విషయాలను సిరియన్లుకు అందించేందుకు కృషి చేస్తున్నారు.