పెళ్ళిపీటలు ఎక్కనున్న దివ్యాంకా త్రిపాఠీ | Divyanka Tripathi is getting married in July | Sakshi
Sakshi News home page

పెళ్ళిపీటలు ఎక్కనున్న దివ్యాంకా త్రిపాఠీ

Published Thu, Apr 21 2016 9:12 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

పెళ్ళిపీటలు ఎక్కనున్న దివ్యాంకా త్రిపాఠీ

పెళ్ళిపీటలు ఎక్కనున్న దివ్యాంకా త్రిపాఠీ

ఏహై మొహబ్బత్ ఫేమ్ దివ్యాంకా త్రిపాఠీ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కనున్నట్లు తాజా వార్తలనుబట్టి తెలుస్తోంది. అయితే దివ్యాంకా ట్విట్టర్లో పోస్ట్ చేసిన వ్యాసం కూడ అదే విషయాన్ని నిర్థారిస్తోంది. ఆమెకు  చాలాకాలం పాటు బాయ్ ఫ్రెండ్ గా ఉన్న నటుడు, ప్రియుడు శరద్ మల్హోత్రా తో విడిపోయిన తర్వాత కొంతకాలంపాటు తన సహ నటుడు వివేక్ దహియా తో దివ్యాంకా డేటింగ్ కొనసాగించింది. ఇప్పుడు అతడినే జూలై నెలలో వివాహం చేసుకునేందుకు ముందుగా హష్- హష్ వేడుకగా జరిపే నిశ్చితార్థ కార్యక్రమాన్ని కూడ నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది.

ఇరు కుటుబ సభ్యుల అంగీకారంతో నిశ్చయమైన తమ వివాహానికి జూలై నెలలో తేదీని ఖరారు చేస్తారని దివ్యాంకా స్వయంగా పోస్టు చేసిన వ్యాసాన్ని బట్టి తెలుస్తోంది. వివేక్, దివ్యాంకాలు అమితమైన ప్రేమలో మునిగి తేలుతున్నట్లు కూడ ఆమె పంచుకున్న ఆనందాన్నిబట్టి అర్థమౌతోంది. అయితే  శరద్ మల్హోత్రాతో విడిపోయిన విషయం ప్రచార సాధనాల ఉచ్చులో పడలేదని చెప్తోంది.  విడిపోవడం భవిష్యత్తులో తనకు మరింత ఆనందాన్ని కలిగించాలని కూడ దివ్యాంకా కోరుకుంటోంది.  

ఛండీగఢ్, లేదా భోపాల్ లలో వివాహ కార్యక్రమం జరగనున్నట్లు దివ్యాంకా పోస్టును బట్టి తెలుస్తోంది. వివేక్ స్వస్థలం చండీగఢ్ లో గాని, దివ్యాంక స్వస్థలం భోపాల్ లో గాని వివాహం జరిగిన అనంతరం ముంబైలో భారీ రిసెప్షన్ వేడుకను నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement