
సాక్షి,ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజ ఇంధన కంపెనీ అదానీ గ్యాస్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎస్‌ఏ గ్యాస్ పంపిణీ సంస్థ అదానీ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. కంపెనీలో 37.4 శాతం వాటా కొనుగోలుకి ఇంధన రంగ ఫ్రాన్స్ దిగ్గజం టోటల్ ఎస్‌ఏ అంగీకరించింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ సోమవారం ప్రకటించింది. అయితే ఈ ఒప్పందం మొత్తం విలువను వెల్లడించలేదు. ఈ మేరకు సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ సమాచారం అందించడంతో అదానీ గ్యాస్ లిమిటెడ్ కౌంటర్లో కొనుగోళ్ల జోరందుకుంది. 10శాతం లాభంతో 151 వద్ద ముగిసింది.
కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశం భారీగా ఖర్చు చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఈ డీల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. బీపీ, పీఎల్‌సి, షెల్ తరువాత దేశీయ గ్యాస్ రంగంలోకి ప్రవేశించిన మూడవ విదేశీ చమురు మేజర్ టోటల్ ఎస్‌ఏ. పబ్లిక్ షేర్ హోల్డర్లకు 25.2 శాతం ఈక్విటీ షేర్లను అదానీ నుండి కొనుగోలు చేయడానికి ముందు టెండర్ ఆఫర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే 10 సంవత్సరాలలో గ్యాస్ పంపిణీని భారతీయ జనాభాలో 7.5 శాతం, పారిశ్రామిక, వాణిజ్య, దేశీయ వినియోగదారులకు మార్కెట్ చేస్తుంది, 6 మిలియన్ల గృహాలను లక్ష్యంగా చేసుకుని 1,500 రిటైల్ అవుట్లెట్ల ద్వారా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది.
భారతదేశంలో సహజవాయువు మార్కెట్ బలమైన వృద్ధిని నమోదు చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ధ్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జి) ప్లేయర్ టోటల్, భారతదేశంలో అతిపెద్ద ఇంధన, మౌలిక సదుపాయాల సమ్మేళనం అదానీ గ్రూపుతో తన భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు టోటల్ చైర్మన్ , సీఈవో సిఇఒ పాట్రిక్ పౌయన్నే ఒక ప్రకటనలో చెప్పారు. ఈ భాగస్వామ్యం దేశంలో తమ అభివృద్ధి వ్యూహానికి మూలస్తంభం లాంటిదన్నారు. 2030 నాటికి దేశ ఇంధన వినియోగంలో నేచురల్ గ్యాస్ వాటాను 15 శాతానికి పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నసంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment