సాక్షి, ముంబై: బిలియనీర్, ప్రపంచ మూడో అతిపెద్ద కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూపు మరో సిమెంట్ కంపెనీనీ కొనుగోలు చేసినట్టు సమాచారం. సిమెంట్ పరిశ్రమలో తమ ఆధిపత్యాన్ని చాటుకునేలా తాజా డీల్ చేసుకున్నారని మార్కట్ వర్గాలు భావిస్తున్నాయి. అప్పుల భారంతో ఉన్న జైప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సిమెంట్ యూనిట్‌ను కొనుగోలుకు ఎడ్వాన్స్‌డ్ చర్చలు జరుపుతోంది. ఈ డీల్ విలువ సుమారు 5 వేల కోట్ల రూపాయలని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ డీల్‌చర్చలు సక్సెస్ అయితే త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడనుందని భావిస్తున్నారు. (ఓలా దివాలీ గిఫ్ట్: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, అతిచౌక ధరలో)
రుణ సంక్షోభంలో ఉన్న జైప్రకాష్ అసోసియేట్స్ అనుబంధ సంస్థ జైప్రకాష్ సిమెంట్ గ్రౌండింగ్ ప్లాంట్ ఇతర ఆస్తులను కొనుగోలు చేయనుందట. సోమవారం నాటి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో బోర్డు రుణాన్ని తగ్గించుకునే క్రమంలో సిమెంట్ వ్యాపారాన్ని విక్రయించాలని భావిస్తున్నట్టు జైప్రకాష్ అసోసియేట్స్ వెల్లడించింది. జైప్రకాష్ పవర్ వెంచర్స్ సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్, అలాగే ఇతర నాన్-కోర్ ఆస్తులను విక్రయానికి, కొనుగోలుదారులను అన్వేషిస్తోందని ప్రకటించడం ఈ వార్తలు బలాన్నిస్తోంది. అయితే తాజా నివేదికలపై వ్యాఖ్యానించేందుకు అదానీ గ్రూప్, జైప్రకాష్ అసోసియేట్స్ ప్రతినిధులు అందుబాటులో లేరు. (WhatsApp update: అదిరిపోయే అప్‌డేట్,అడ్మిన్‌లకు ఫుల్ జోష్)
సిమెంట్ వ్యాపారం పై దృష్టిపెట్టిన అదానీ గ్రూపు మేలో స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ లిమిటెడ్ నుండి అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ , ఏసీసీ లిమిటెడ్‌లను కొనుగోలు చేసిన తరువాత ఏటా 67.5 మిలియన్ టన్నుల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో దాదాపు భారతదేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా అవతరించింది. సిమెంట్ పరిశ్రమలో 200 బిలియన్ రూపాయల పెట్టుబడులు పెట్టాలని, రానున్న ఐదేళ్లలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మిలియన్ టన్నులకు పెంచాలని లక్క్ష్యంగా పెట్టుకున్నట్టు గత నెలలో అదానీ ప్రకటించిన సంగతి విదితమే.
ఇదీ చదవండి: బిలియనీర్ గౌతమ్ అదానీ విదేశీ నిధులపై కన్ను: భారీ కసరత్తు
Comments
Please login to add a commentAdd a comment