Jaiprakash Associates Ltd
-
జేపీ అసోసియేట్స్ రూ. 4,258 కోట్ల డిఫాల్ట్
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న జేపీ గ్రూప్‌లో ప్రధాన కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్ (జేఏఎల్) రూ. 4,258 కోట్ల రుణాల (అసలు, వడ్డీ) చెల్లింపులో డిఫాల్ట్ అయ్యింది. అసలు కింద రూ. 1,733 కోట్లు, వడ్డీ కింద రూ. 2,525 కోట్ల మొత్తాన్ని అక్టోబర్ 31న చెల్లించాల్సి ఉండగా, చెల్లించలేకపోయినట్లు నియంత్రణ సంస్థకు తెలియజేసింది. నిర్వహణ మూలధనం, టర్మ్ లోన్లు, విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ రూపంలో ఈ మొత్తాన్ని కంపెనీ సేకరించింది. 2037 కల్లా రూ. 29,272 కోట్ల రుణాలు (వడ్డీ సహా) చెల్లించాల్సి ఉండగా, 2023 అక్టోబర్ 31 నాటికి రూ. 4,258 కోట్లను గడువులోగా చెల్లించలేకపోవడంతో బాకీ పడినట్లు సంస్థ వివరించింది. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా రూ. 18,682 కోట్ల మొత్తాన్ని ప్రతిపాదిత స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)కి బదలాయించనుండటంతో ఆ మేరకు భారం తగ్గనుంది. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జేఏఎల్ పేర్కొంది. -
రూ.5 వేల కోట్ల డీల్: అదానీ చేతికి మరో సిమెంట్ కంపెనీ!
సాక్షి, ముంబై: బిలియనీర్, ప్రపంచ మూడో అతిపెద్ద కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూపు మరో సిమెంట్ కంపెనీనీ కొనుగోలు చేసినట్టు సమాచారం. సిమెంట్ పరిశ్రమలో తమ ఆధిపత్యాన్ని చాటుకునేలా తాజా డీల్ చేసుకున్నారని మార్కట్ వర్గాలు భావిస్తున్నాయి. అప్పుల భారంతో ఉన్న జైప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సిమెంట్ యూనిట్‌ను కొనుగోలుకు ఎడ్వాన్స్డ్ చర్చలు జరుపుతోంది. ఈ డీల్ విలువ సుమారు 5 వేల కోట్ల రూపాయలని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ డీల్చర్చలు సక్సెస్ అయితే త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడనుందని భావిస్తున్నారు. (ఓలా దివాలీ గిఫ్ట్: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, అతిచౌక ధరలో) రుణ సంక్షోభంలో ఉన్న జైప్రకాష్ అసోసియేట్స్ అనుబంధ సంస్థ జైప్రకాష్ సిమెంట్ గ్రౌండింగ్ ప్లాంట్ ఇతర ఆస్తులను కొనుగోలు చేయనుందట. సోమవారం నాటి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో బోర్డు రుణాన్ని తగ్గించుకునే క్రమంలో సిమెంట్ వ్యాపారాన్ని విక్రయించాలని భావిస్తున్నట్టు జైప్రకాష్ అసోసియేట్స్ వెల్లడించింది. జైప్రకాష్ పవర్ వెంచర్స్ సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్, అలాగే ఇతర నాన్-కోర్ ఆస్తులను విక్రయానికి, కొనుగోలుదారులను అన్వేషిస్తోందని ప్రకటించడం ఈ వార్తలు బలాన్నిస్తోంది. అయితే తాజా నివేదికలపై వ్యాఖ్యానించేందుకు అదానీ గ్రూప్, జైప్రకాష్ అసోసియేట్స్ ప్రతినిధులు అందుబాటులో లేరు. (WhatsApp update: అదిరిపోయే అప్డేట్,అడ్మిన్లకు ఫుల్ జోష్) సిమెంట్ వ్యాపారం పై దృష్టిపెట్టిన అదానీ గ్రూపు మేలో స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ లిమిటెడ్ నుండి అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ , ఏసీసీ లిమిటెడ్‌లను కొనుగోలు చేసిన తరువాత ఏటా 67.5 మిలియన్ టన్నుల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో దాదాపు భారతదేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా అవతరించింది. సిమెంట్ పరిశ్రమలో 200 బిలియన్ రూపాయల పెట్టుబడులు పెట్టాలని, రానున్న ఐదేళ్లలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మిలియన్ టన్నులకు పెంచాలని లక్క్ష్యంగా పెట్టుకున్నట్టు గత నెలలో అదానీ ప్రకటించిన సంగతి విదితమే. ఇదీ చదవండి: బిలియనీర్ గౌతమ్ అదానీ విదేశీ నిధులపై కన్ను: భారీ కసరత్తు -
రూ.200 కోట్లు కట్టండి!
సాక్షి, ముంబై: ఫ్లాట్ల అమ్మకాల్లో అక్రమ పద్దతులు పాటించిన జై ప్రకాశ్ అసోసియేట్స్‌కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. రూ. 200 కోట్లను కోర్టుకు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మే10 నాటికి చెల్లింపు చేయాలని ఆదేశించింది. అలాగే రిఫండ్ అడుగుతున్న గృహకొనుగోలు దారుల జాబితా సమర్పించాలని సంస్థను కోరింది. మే 10 నాటికి రెండు వాయిదాలలో రూ. 200 కోట్లను డిపాజిట్ చేయాలని చీఫ్ జస్టిస్ దీపాక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జెఎల్ఎ)ను ఆదేశించింది. ఏప్రిల్ 6 నాటికి రూ. 100 కోట్లు, మిగిలిన సొమ్ము మే10వ తేదీలోపు డిపాజిట్ చేయాలని కోరింది. దీంతోపాటు చెల్లింపులు చేయాలంటూ గృహ-కొనుగోలుదారులకు ఎటువంటి నోటీసులను పంపించకూడదని స్పష్టం చేసింది. అలాగే గృహ-కొనుగోలుదారుల ప్రాజెక్ట్ వారీగా చార్ట్‌ను సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. -
మీ డబ్బు మీకొస్తుంది.. సుప్రీం భరోసా
-
మీ డబ్బు మీకొస్తుంది.. సుప్రీం భరోసా
సాక్షి, న్యూఢిల్లీ : జేపీ ఇన్ఫ్రాటెక్ గృహ వినియోగదారులకు సుప్రీంకోర్టులో మరోసారి భారీ ఊరట కల్పించింది. గృహవినియోగదారులు చెల్లించిన నగదు తిరిగి వారికి వెనక్కి ఇప్పిస్తామంటూ ఉన్నత న్యాయస్థానం భరోసా కల్పించింది. ఈ క్రమంలోనే జయ ప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్(జేఏఎల్)ను రూ.10వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లను డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జేఏఎల్, జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు హోల్డింగ్ కంపెనీ. రూ.2000 కోట్లను అక్టోబర్ 27 వరకు డిపాజిట్ చేయాలంటూ సెప్టెంబర్ 11న కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాక తాత్కాలిక పరిష్కార ప్రొఫెషనల్(ఐఆర్పీ)ను ఏర్పాటుచేయాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు కూడా ఆదేశాలు జారీచేసింది. మేనేజ్మెంట్ను టేకోవర్ చేసుకోవాలని తెలిపింది. బ్యాంకుల రక్షణను మాత్రమే కాక, గృహ వినియోగదారుల ప్రయోజనాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుందని తెలిపింది. గృహవినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సుప్రీంకోర్టు అన్ని విధాల భరోసా కల్పిస్తున్నట్టు సీజేఐ దీపక్ మిశ్రా హామీ ఇచ్చారు. ఒకవేళ రూ.10వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో అవసరం అయితే, ఇంకా ఎక్కువ డిపాజిట్ చేయమని కూడా కోరవచ్చని చెప్పారు. గృహవినియోగదారుల నగదు, తిరిగి వెనక్కి వచ్చేస్తోంది. ఇంకేమి కావాలి? మీకు అంటూ ప్రశ్నించారు.