న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న జేపీ గ్రూప్‌లో ప్రధాన కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్ (జేఏఎల్) రూ. 4,258 కోట్ల రుణాల (అసలు, వడ్డీ) చెల్లింపులో డిఫాల్ట్ అయ్యింది. అసలు కింద రూ. 1,733 కోట్లు, వడ్డీ కింద రూ. 2,525 కోట్ల మొత్తాన్ని అక్టోబర్ 31న చెల్లించాల్సి ఉండగా, చెల్లించలేకపోయినట్లు నియంత్రణ సంస్థకు తెలియజేసింది. నిర్వహణ మూలధనం, టర్మ్ లోన్‌లు, విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ రూపంలో ఈ మొత్తాన్ని కంపెనీ సేకరించింది.
2037 కల్లా రూ. 29,272 కోట్ల రుణాలు (వడ్డీ సహా) చెల్లించాల్సి ఉండగా, 2023 అక్టోబర్ 31 నాటికి రూ. 4,258 కోట్లను గడువులోగా చెల్లించలేకపోవడంతో బాకీ పడినట్లు సంస్థ వివరించింది. రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా రూ. 18,682 కోట్ల మొత్తాన్ని ప్రతిపాదిత స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ)కి బదలాయించనుండటంతో ఆ మేరకు భారం తగ్గనుంది. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జేఏఎల్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment