సాక్షి, ముంబై: ఫ్లాట్ల అమ్మకాల్లో అక్రమ పద్దతులు పాటించిన జై ప్రకాశ్ అసోసియేట్స్‌కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. రూ. 200 కోట్లను కోర్టుకు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మే10 నాటికి చెల్లింపు చేయాలని ఆదేశించింది. అలాగే రిఫండ్ అడుగుతున్న గృహకొనుగోలు దారుల జాబితా సమర్పించాలని సంస్థను కోరింది.
మే 10 నాటికి రెండు వాయిదాలలో రూ. 200 కోట్లను డిపాజిట్ చేయాలని చీఫ్ జస్టిస్ దీపాక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జెఎల్ఎ)ను ఆదేశించింది. ఏప్రిల్ 6 నాటికి రూ. 100 కోట్లు, మిగిలిన సొమ్ము మే10వ తేదీలోపు డిపాజిట్ చేయాలని కోరింది. దీంతోపాటు చెల్లింపులు చేయాలంటూ గృహ-కొనుగోలుదారులకు ఎటువంటి నోటీసులను పంపించకూడదని స్పష్టం చేసింది. అలాగే గృహ-కొనుగోలుదారుల ప్రాజెక్ట్ వారీగా చార్ట్‌ను సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment