మీ డబ్బు మీకొస్తుంది.. సుప్రీం భరోసా
మీ డబ్బు మీకొస్తుంది.. సుప్రీం భరోసా
Published Tue, Sep 19 2017 8:59 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
సాక్షి, న్యూఢిల్లీ : జేపీ ఇన్‌ఫ్రాటెక్ గృహ వినియోగదారులకు సుప్రీంకోర్టులో మరోసారి భారీ ఊరట కల్పించింది. గృహవినియోగదారులు చెల్లించిన నగదు తిరిగి వారికి వెనక్కి ఇప్పిస్తామంటూ ఉన్నత న్యాయస్థానం భరోసా కల్పించింది. ఈ క్రమంలోనే జయ ప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్(జేఏఎల్)ను రూ.10వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లను డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జేఏఎల్, జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు హోల్డింగ్ కంపెనీ. రూ.2000 కోట్లను అక్టోబర్ 27 వరకు డిపాజిట్ చేయాలంటూ సెప్టెంబర్ 11న కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాక తాత్కాలిక పరిష్కార ప్రొఫెషనల్(ఐఆర్‌పీ)ను ఏర్పాటుచేయాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు కూడా ఆదేశాలు జారీచేసింది. మేనేజ్‌మెంట్‌ను టేకోవర్ చేసుకోవాలని తెలిపింది.
బ్యాంకుల రక్షణను మాత్రమే కాక, గృహ వినియోగదారుల ప్రయోజనాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుందని తెలిపింది. గృహవినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సుప్రీంకోర్టు అన్ని విధాల భరోసా కల్పిస్తున్నట్టు సీజేఐ దీపక్ మిశ్రా హామీ ఇచ్చారు. ఒకవేళ రూ.10వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో అవసరం అయితే, ఇంకా ఎక్కువ డిపాజిట్ చేయమని కూడా కోరవచ్చని చెప్పారు. గృహవినియోగదారుల నగదు, తిరిగి వెనక్కి వచ్చేస్తోంది. ఇంకేమి కావాలి? మీకు అంటూ ప్రశ్నించారు.
Advertisement