న్యూఢిల్లీ: డీబీ పవర్‌కి చెందిన బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్లను అదానీ గ్రూపునకు చెందిన అదానీ పవర్ కొనుగోలు చేయడానికి సంబంధించిన రూ. 7,017 కోట్ల డీల్ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. ఒప్పందంపై సంతకాలు చేయకుండానే.. లావాదేవీకి నిర్దేశించుకున్న గడువు తీరిపోవడం ఇందుకు కారణం. 2022 ఆగస్టు 18 నాటి అవగాహన ఒప్పందం గడువు తీరిపోయిందని స్టాక్ ఎక్స్ఛేంచంజీలకు అదానీ పవర్ తెలిపింది.
తేదీలను పొడిగించారా లేక ఒప్పందంపై మళ్లీ చర్చలు జరుపుతున్నారా వంటి వివరాలేమీ వెల్లడించలేదు. గడువు తేదీ ముగియడంతో ప్రస్తుతానికి ఈ డీల్‌ను పక్కన పెట్టినట్లే భావించాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రాథమికంగా గతేడాది ఎంవోయూ కుదుర్చుకున్న తర్వాత తుది గడువు నాలుగు సార్లు పొడిగించారు. నాలుగో గడువు ఫిబ్రవరి 15తో ముగిసింది. ఖాతాలు, షేర్ల ధరల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు, పరిణామాలు దీనికి నేపథ్యం.
Comments
Please login to add a commentAdd a comment