Power Adani
-
శ్రీలంక పవర్ ప్రాజెక్టుల నుంచి అదానీ బయటకు
న్యూఢిల్లీ: శ్రీలంకలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం టారిఫ్‌లను పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడ తలపెట్టిన రెండు పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) వైదొలిగింది. అయితే, శ్రీలంకలో పెట్టుబడులకు తమ సంస్థ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ప్రభుత్వం కోరుకుంటే తప్పకుండా కలిసి పని చేస్తామని సంస్థ తెలిపింది.వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంకలోని మన్నార్, పూనెరిన్ ప్రాంతాల్లో దాదాపు 740 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏజీఈఎల్ 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సి ఉంది. 2026 మధ్య నాటికి ఇవి పూర్తి కావాలి. అయితే, వీటితో పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటూ పర్యావరణవేత్తల ఆందోళనలు చేపట్టి, లీగల్ కేసులు వేయడంతో ఈ ప్రాజెక్టులకు ప్రారంభం నుంచే అడ్డంకులు ఎదురయ్యాయి. ఇక గత ప్రభుత్వం ప్రతిపాదిత అదానీ విండ్ పవర్ ప్లాంటు నుంచి యూనిట్‌కు 0.0826 డాలర్ల ధరకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. కానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు రేటును యూనిట్‌కు 0.06 స్థాయికి తగ్గించేలా టారిఫ్‌లను పునఃసమీక్షించాలని జనవరిలో నిర్ణయించింది. ఇది ఆమోదయోగ్యమైన ధర కాకపోవడంతో ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాలని ఏజీఈఎల్ నిర్ణయం తీసుకుంది. అయితే, అదానీ గ్రూప్ 700 మిలియన్ డాలర్లతో కొలంబోలో తలపెట్టిన పోర్టు అభివృద్ధి పనులు యథాప్రకారం సాగనున్నాయి. ఇదీ చదవండి: హోండా, నిస్సాన్ పొత్తు లేనట్టే!యూపీఎమ్‌కు టీసీఎస్ సేవలుఐటీ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ఏఐ మద్దతున్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఫిన్లాండ్ సంస్థ యూపీఎమ్తో ఐటీ ట్రాన్స్ఫార్మేషన్ సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రీసైక్లబుల్ ప్రొడక్టులను రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన యూపీఎమ్ పునరుత్పాదక ఇంధన మెటీరియల్స్‌ను ముడిసరుకులుగా వినియోగిస్తోంది. 11 దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ 10.3 బిలియన్ యూరోల టర్నోవర్‌ను కలిగి ఉంది. యూపీఎమ్ వృద్ధికి డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సహకరించనున్నట్లు ఒప్పందం సందర్భంగా టీసీఎస్ పేర్కొంది. తద్వారా ఏఐ ఫస్ట్ ఆపరేటింగ్ మోడల్‌ను అందిపుచ్చుకోనున్నట్లు తెలియజేసింది. అయితే ఒప్పందం(కాంట్రాక్ట్) విలువను వెల్లడించలేదు. యూపీఎమ్ ఎంటర్ప్రైజ్ ఐటీ వేల్యూ చైన్‌ను పటిష్టపరిచే బాటలో ఏఐ ఆధారిత అటానమస్ ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫామ్ ఇగ్నియోను వినియోగించనున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. అంతేకాకుండా యూపీఎమ్‌కు చెందిన 15,800 మంది ఉద్యోగులు, మెషీన్ల మధ్య మరింత భాగస్వామ్యానికి ఏఐ ద్వారా మద్దతివ్వనుంది. -
అదానీ గ్రీన్ ఒప్పందంపై శ్రీలంక పునఃసమీక్ష
అదానీ గ్రీన్ ఎనర్జీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పునఃసమీక్షించే యోచనలో ఉన్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు కోసం కిలోవాట్‌కు 8.2 యూఎస్ సెంట్ల చొప్పున గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ విద్యుత్ ధరను యూనిట్‌కు 6 సెంట్ల దిగువకు తీసుకురావాలని కొత్త యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.స్థానిక బిడ్డర్లు తక్కువ యూనిట్ ధరలకు ఆఫర్ చేయడం.. ఇరవై ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అధిక రేటుకు కుదుర్చుకోవాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారితీసింది. అధ్యక్షుడు అనురా కుమార దిస్సానాయకే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం వారి ప్రస్తుత ప్రాధాన్యతలు, ఇంధన విధానాలకు అనుగుణంగా నిబంధనలను సమీక్షించాలని నిర్ణయించింది. అయితే అదానీ గ్రూప్, శ్రీలంక ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరి ప్రాజెక్ట్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటన రావాల్సి ఉంది.ఇదీ చదవండి: పట్టణ వినియోగ పెంపునకు బ్లూప్రింట్మే 2024లో ఆమోదించిన టారిఫ్‌ను పునఃసమీక్షించాలని శ్రీలంక కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రామాణిక సమీక్షా ప్రక్రియలో భాగమని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నియమించిన కమిటీ మొత్తం ప్రాజెక్టును సమీక్షించనుంది. అదానీ గ్రూప్ శ్రీలంక గ్రీన్ ఎనర్జీ రంగంలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్ట్ రద్దయినట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. నిబంధనలు ప్రస్తుత లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి పునరాలోచనలో ఉన్నట్లు పేర్కొంది. శ్రీలంకలో పునరుత్పాదక ఇంధనం, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపింది. -
అదానీ పవర్-డీబీ పవర్ డీల్ వెనక్కి.. సంతకాలు చేయకుండానే..!
న్యూఢిల్లీ: డీబీ పవర్‌కి చెందిన బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్లను అదానీ గ్రూపునకు చెందిన అదానీ పవర్ కొనుగోలు చేయడానికి సంబంధించిన రూ. 7,017 కోట్ల డీల్ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. ఒప్పందంపై సంతకాలు చేయకుండానే.. లావాదేవీకి నిర్దేశించుకున్న గడువు తీరిపోవడం ఇందుకు కారణం. 2022 ఆగస్టు 18 నాటి అవగాహన ఒప్పందం గడువు తీరిపోయిందని స్టాక్ ఎక్స్ఛేంచంజీలకు అదానీ పవర్ తెలిపింది. తేదీలను పొడిగించారా లేక ఒప్పందంపై మళ్లీ చర్చలు జరుపుతున్నారా వంటి వివరాలేమీ వెల్లడించలేదు. గడువు తేదీ ముగియడంతో ప్రస్తుతానికి ఈ డీల్‌ను పక్కన పెట్టినట్లే భావించాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రాథమికంగా గతేడాది ఎంవోయూ కుదుర్చుకున్న తర్వాత తుది గడువు నాలుగు సార్లు పొడిగించారు. నాలుగో గడువు ఫిబ్రవరి 15తో ముగిసింది. ఖాతాలు, షేర్ల ధరల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు, పరిణామాలు దీనికి నేపథ్యం. -
టాటా, అదానీ పవర్లకు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: నష్టపరిహార టారిఫ్ కేసులో టాటా పవర్, అదానీ పవర్లకు సుప్రీం షాక్ ఇచ్చింది. అదు రాష్ట్రాల్లో నష్టపరిహారం చెల్లించాలంటూ గత ఏడాది అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సుప్రీం మంగళవారం పక్కన పెట్టింది. విద్యుత్ చార్జీలను పెంచేందుకు అనుమతించమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. టాటా పవర్, అదానీ పవర్ కంపెనీలు ఐదు రాష్ట్రాల్లో వినియోగదారులపై భారం మోపడానికి వీల్లేదని ఆదేశించింది. తద్వారా గుజరాత్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లో విద్యుత్ బిల్లులు పెరగకుండా అడ్డుకుంది. దీంతో టాటా, అదానీ పవర్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అదానీ పవర్ 15 శాతం టాటా పవర్ 5.2 శాతం నష్టపోయాయి. అయితే సుప్రీం తీర్పుపై అదానీ పవర్ స్పందించింది. దేశీయ బొగ్గు సరఫరా కొరత కారణంగా తమకు ఖర్చులు పెరగడంతో గతంలో తమకు ఈ ఊరట లభించినట్టు పేర్కొంది. కాగా 2010లో ఇండోనేషియా చట్టాల ప్రకారం కోల్ ధరలు పెరిగినకారణంగా చార్జీలు పెంచాలని రెండు కంపెనీలు కోరాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ దీనికి సమ్మతించింది. అలాగే గత ఏడాది ఏప్రిల్ లో ఈకేసులో టాటా,అదానీలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని అప్పిలేట్ ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది. దీని ప్రకారం సంస్థలు డిసెంబర్ లో ఎక్కువ చార్జీ వసూలు చేయటానికి అనుమతించింది. అయితే ఈనిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఇండోనేషియానుంచి ముడిబొగ్గును దిగుమతి చేసుకునే రెండు కంపెనీలు ఐదు రాష్ట్రాల్లో 8620 మెగావాట్ల ఉత్పత్తిని చేస్తున్నాయి.