
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం గెయిల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై– సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 131 శాతం దూసుకెళ్లి రూ. 2,863 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,240 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 57 శాతం పురోగమించి రూ. 21,515 కోట్లకు చేరింది. నేచురల్ గ్యాస్ అమ్మకాలు టర్న్‌అరౌండ్ కావడం ఫలితాల మెరుగుకు దోహదపడింది. ఈ విభాగం రూ. 1,079 కోట్ల పన్నుకు ముందు లాభం సాధించింది. అంతక్రితం క్యూ2లో రూ. 364 కోట్ల పన్నుకుముందు నష్టం ప్రకటించింది. గ్యాస్ పంపిణీ పన్నుకు ముందు లాభం సైతం రెట్టింపై రూ. 363 కోట్లను అధిగమించింది. గ్యాస్ పంపిణీ 107.66 ఎంఎంఎస్‌సీఎండీ నుంచి 114.32 ఎంఎంఎస్‌సీఎండీకి పెరిగింది.
ఫలితాల నేపథ్యంలో గెయిల్ ఇండియా షేరు బీఎస్‌ఈలో
1.2 శాతం బలపడి రూ. 149 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment