gail india
-
గెయిల్ చేతికి జేబీఎఫ్ కెమ్
న్యూఢిల్లీ: దివాలా చట్ట ప్రకారం జేబీఎఫ్ పెట్రోకెమికల్స్‌ను యుటిలిటీ రంగ పీఎస్‌యూ గెయిల్ ఇండియా చేజిక్కించుకుంది. ఇందుకు వీలుగా ప్రైవేట్ రంగ సాల్వెంట్ కంపెనీ జేబీఎఫ్లో రూ. 2,101 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తద్వారా ఈ జూన్ 1 నుంచి సొంత అనుబంధ సంస్థగా మార్చుకుంది. జేబీఎఫ్‌ను కొనుగోలు చేసేందుకు మార్చిలో దివా లా చట్ట సంబంధ కోర్టు గెయిల్‌ను అనుమతించిన సంగతి తెలిసిందే. రుణ పరిష్కార ప్రణాళిక ప్రకా రం జేబీఎఫ్కు ఈక్విటీ రూపేణా రూ. 625 కోట్లు, రుణాలుగా రూ. 1,476 కోట్లు అందించినట్లు గెయిల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తాజాగా వెల్లడించింది. కాగా.. జేబీఎఫ్ కొనుగోలుకి ఇతర పీఎస్ యూ దిగ్గజాలు ఐవోసీ, ఓఎన్‌జీసీలతో పోటీపడి గెయిల్ బిడ్ చేసింది. రూ. 5,628 కోట్ల బకాయిల రికవరీకిగాను ఐడీబీఐ బ్యాంక్ దివాలా ప్రక్రియను చేపట్టింది. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్ 2008లో ఏర్పాటైంది. మంగళూరు సెజ్‌లో 1.25 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్యూరిఫైడ్ టెరిప్తాలిక్ యాసిడ్(పీటీఏ) ప్లాంటును నెలకొల్పేందుకు కంపెనీకి ఐడీబీఐసహా ఇతర బ్యాంకులు రుణాలందించాయి. బీపీ సాంకేతిక మద్దతుతోపాటు 60.38 కోట్ల డాలర్ల రుణాలను మంజూరు చేశాయి. అంతేకాకుండా ము డిసరుకుగా నెలకు 50,000 టన్నుల పారాగ్జిలీన్ను సరఫరా చేసేందుకు ప్రభుత్వ రంగ కెమికల్ సంస్థ ఓఎంపీఎల్ సైతం అంగీకరించింది. ప్రధానంగా జేబీఎఫ్ ఇండస్ట్రీస్ పాలియస్టర్ ప్లాంట్లకు అవసరమైన ముడిసరుకును రూపొందించేందుకు ఈ సంస్థ ఏర్పాటైంది. 2017లో కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలంకావడంతో అదే ఏడాది మూతపడింది. వెరసి కార్పొరేట్ దివా లా ప్రక్రియకు లోనైంది. కాగా.. గెయిల్ యూపీలో ని పటాలో వార్షికంగా 8,10,000 టన్నుల సా మర్థ్యంతో పెట్రోకెమికల్ ప్లాంటును కలిగి ఉంది. వ చ్చే ఏడాదికల్లా మహారాష్ట్రలోని ఉసార్‌లో ప్రొ పేన్ డీహైడ్రోజనేషన్ ప్లాంటును నిర్మించే లక్ష్యంతో ఉంది. తద్వారా ఏడాదికి 5,00,000 టన్నుల పాలీప్రొపిలీన్‌ను రూపొందించాలని ప్రణాళికలు వేసింది. ఈ వార్తల నేపథ్యంలో గెయిల్ షేరు ఎన్ఎస్ఈలో 0.6 శాతం నీరసించి రూ. 105 వద్ద ముగిసింది. -
గెయిల్ బైబ్యాక్ బాట
న్యూఢిల్లీ: యుటిలిటీ పీఎస్‌యూ దిగ్గజం గెయిల్ ఇండియా బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గురువారం(31న) సమావేశమైన బోర్డు పెయిడప్ ఈక్విటీలో 2.5 శాతం వాటాను బైబ్యాక్ చేసేందుకు ఆమోదముద్ర వేసినట్లు గెయిల్ పేర్కొంది. షేరుకి రూ. 190 ధర మించకుండా 5.7 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 1,083 కోట్లవరకూ వెచ్చించనుంది. ప్రస్తుత బైబ్యాక్ ధర ఎన్ఎస్ఈలో బుధవారం(30న) ముగింపు ధరతో పోలిస్తే 24% అధికంకావడం గమనార్హం! గతంలోనూ..: గెయిల్ 2020–21 లోనూ షేరుకి రూ. 150 ధరలో రూ. 1,046 కోట్లతో షేర్ల బైబ్యాక్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 51.8% వాటా ఉంది. దీంతో ప్రభుత్వం సైతం బైబ్యాక్‌లో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. గత బైబ్యాక్‌లో ప్రభుత్వ వాటాకు రూ. 747 కోట్లు లభించిన సంగతి తెలిసిందే. కాగా.. 2021–22లో కంపెనీ మధ్యంతర డివిడెండ్ కింద రికార్డ్ సృష్టిస్తూ రూ. 3,996 కోట్లు(90 శాతం) చెల్లించింది. ఇక 2009, 2017, 2018 లతోపాటు 2020లోనూ వాటాదారులకు బోనస్ షేర్లను సైతం జారీ చేసింది. ఎన్ఎస్ఈలో గెయిల్ షేరు 2 శాతం పుంజుకుని రూ. 156 వద్ద ముగిసింది. -
సస్పెన్షన్‌లో రంగనాథన్: గెయిల్
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసిన సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ రంగనాథన్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వ రంగ గ్యాస్ యుటిలిటీ సంస్థ– గెయిల్ (ఇండియా) ధ్రువీకరించింది. ప్రైవేటు కంపెనీలకు పెట్రోకెమికల్ ప్రొడక్టుల అమ్మకాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తూ లంచాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రంగనాథన్‌ను రెండు రోజుల క్రితం సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో ఆరుగురిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. రంగనాథన్సహా పలువురి నివాసాలపై జరిగిన సీబీఐ దాడుల్లో దాదాపు రూ.1.25 కోట్లు డబ్బు, అంతే మొత్తం విలువైన ఆభరణాలు, కొన్ని కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ‘గెయిల్ ఎంప్లాయీస్ (కాండక్ట్ డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్, 1986లోని రూల్ 25 ప్రకారం దాఖలైన అధికారాలను అమలు చేస్తూ ఈఎస్ రంగనాథన్‌ను 2022 జనవరి 18వ తేదీ నుంచి అమలయ్యేలా సస్పెండ్‌చేస్తూ భారత్ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు’’ అని గెయిల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. -
గెయిల్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం గెయిల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై– సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 131 శాతం దూసుకెళ్లి రూ. 2,863 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,240 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 57 శాతం పురోగమించి రూ. 21,515 కోట్లకు చేరింది. నేచురల్ గ్యాస్ అమ్మకాలు టర్న్అరౌండ్ కావడం ఫలితాల మెరుగుకు దోహదపడింది. ఈ విభాగం రూ. 1,079 కోట్ల పన్నుకు ముందు లాభం సాధించింది. అంతక్రితం క్యూ2లో రూ. 364 కోట్ల పన్నుకుముందు నష్టం ప్రకటించింది. గ్యాస్ పంపిణీ పన్నుకు ముందు లాభం సైతం రెట్టింపై రూ. 363 కోట్లను అధిగమించింది. గ్యాస్ పంపిణీ 107.66 ఎంఎంఎస్‌సీఎండీ నుంచి 114.32 ఎంఎంఎస్‌సీఎండీకి పెరిగింది. ఫలితాల నేపథ్యంలో గెయిల్ ఇండియా షేరు బీఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ. 149 వద్ద ముగిసింది. -
రూ. 1.72 లక్షల కోట్ల బకాయిలు కట్టండి
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సర్వీస్ లైసెన్సు (ఐఎస్పీ) ఫీజులు తదితర బాకీలకు సంబంధించి ఏకంగా రూ. 1.72 లక్షల కోట్లు కట్టాలంటూ ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియాకు టెలికం విభాగం లేఖ పంపింది. ఐపీ–1, ఐపీ–2, ఐఎస్పీ లైసెన్సు ఫీజుల బకాయిల కింద రూ. 1,72,655 కోట్లు చెల్లించాలని ఇందులో సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పటికే కట్టాల్సినదంతా కట్టేశామని.. ఇక చెల్లించాల్సిన బాకీలం టూ ఏమీ లేవని గెయిల్ ప్రత్యుత్తరంలో పేర్కొన్నట్లు వివరించాయి. 2002లో తీసుకున్న ఐఎస్పీ లైసెన్సు గడువు 2017తో తీరిపోయిందని గెయిల్ తెలిపింది. అసలు దీనితో వ్యాపారమేమీ చేయనందున ఆదాయార్జన ప్రసక్తే లేదని పేర్కొంది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ కేటగిరీ 1, 2 కింద తీసుకున్న లైసెన్సులపై 2001–02 నుంచి రూ. 35 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని.. టెలికం విభాగం చెబుతున్నట్లుగా రూ. 2,49,788 కోట్లు కాదని స్పష్టం చేసింది. మరోవైపు, టెలికం విభాగం అడుగుతున్న మొత్తం .. గెయిల్ కంపెనీ విలువకు ఏకంగా మూడు రెట్లు ఉంటుందని సంస్థ వర్గాలు వ్యాఖ్యానించాయి. టెలికంయేతర వ్యాపా రాల ద్వారా వచ్చిన రెవెన్యూను కూడా ఆదాయం కిందే లెక్కించి, దాన్ని బట్టి లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీలను కట్టాలంటూ టెల్కోలను ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించింది. తాజాగా ఇదే ప్రాతిపదికన బాకీలు కట్టాలంటూ గెయిల్‌ను టెలికం విభాగం ఆదేశించింది. -
గెయిల్ 1:3 బోనస్
న్యూఢిల్లీ: గెయిల్ ఇండియా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.1,262 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో సాధించిన నికర లాభం(రూ.983 కోట్లు)తో పోల్చితే 28 శాతం వృద్ధి సాధించామని గెయిల్ ఇండియా తెలిపింది. గ్యాస్ మార్కెటింగ్, ప్రసార వ్యాపారం మంచి మార్జిన్లు సాధించడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ బి.సి. త్రిపాఠి చెప్పారు. ప్రతి మూడు షేర్లకు ఒక షేర్‌ను ఉచితంగా(బోనస్ 1:3) ఇవ్వడానికి తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించారు. ఆదాయం 17 శాతం వృద్ధి చెంది రూ.14,717 కోట్లకు, స్థూల మార్జిన్ 14 శాతం వృద్ధితో రూ.2,273 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. పెట్రోకెమికల్ విభాగం అమ్మకాలు 21 శాతం, ఎల్పీజీ విభాగం అమ్మకాలు 10 శాతం చొప్పున వృద్ధి చెందాయని తెలిపారు. -
ఉద్యోగ అవకాశాలు
గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో 106 ఖాళీలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, టెలికాం, హెచ్ఆర్, సెక్యూరిటీ, కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్, స్టోర్స అండ్ పర్చేస్ తదితర విభాగాల్లో సీనియర్ ఇంజనీర్, ఫోర్మన్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్, అకౌంట్స్ అసిస్టెంట్ మొదలైన ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 22 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు తదితర పూర్తి వివరాలకు www.gailonline.com వెబ్సైట్ చూడొచ్చు. ఎన్ఐఏసీఎల్లో మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ది న్యూ ఇండియా అస్యూరెన్స కంపెనీ లిమిటెడ్(ఎన్ఐఏసీఎల్) 17 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి 21 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న వారు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 4 నుంచి 14 మధ్య ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.newindia.co.in వెబ్సైట్ చూడొచ్చు. ఐఐటీ బాంబేలో స్టాఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బాంబే, మూడేళ్ల కాలపరిమితికి కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ట్రైన్డ గ్రాడ్యుయేట్ టీచర్, పార్ట టైం డెంటల్ టెక్నీషియన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ మెకానిక్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 5లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు తదితర పూర్తి వివరాలకు www.iitb.ac.in వెబ్సైట్ చూడొచ్చు. ఐసీఎస్ఐలో 27 ఖాళీలు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) వివిధ విభాగాల్లో 27 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డీన్, జాయింట్ సెక్రటరీ, డెరెక్టర్, డిప్యూటీ డెరైక్టర్, రీసెర్చ అసోసియేట్, అసిస్టెంట్ డెరైక్టర్, అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులను భర్తీ చేస్తారు. సెప్టెంబర్ 20 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలకు www.icsi.eduవెబ్సైట్ చూడొచ్చు.