న్యూఢిల్లీ: గెయిల్ ఇండియా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.1,262 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో సాధించిన నికర లాభం(రూ.983 కోట్లు)తో పోల్చితే 28 శాతం వృద్ధి సాధించామని గెయిల్ ఇండియా తెలిపింది. గ్యాస్ మార్కెటింగ్, ప్రసార వ్యాపారం మంచి మార్జిన్‌లు సాధించడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ బి.సి. త్రిపాఠి చెప్పారు.
ప్రతి మూడు షేర్లకు ఒక షేర్‌ను ఉచితంగా(బోనస్ 1:3) ఇవ్వడానికి తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించారు. ఆదాయం 17 శాతం వృద్ధి చెంది రూ.14,717 కోట్లకు, స్థూల మార్జిన్ 14 శాతం వృద్ధితో రూ.2,273 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. పెట్రోకెమికల్ విభాగం అమ్మకాలు 21 శాతం, ఎల్‌పీజీ విభాగం అమ్మకాలు 10 శాతం చొప్పున వృద్ధి చెందాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment