న్యూఢిల్లీ: దివాలా చట్ట ప్రకారం జేబీఎఫ్ పెట్రోకెమికల్స్‌ను యుటిలిటీ రంగ పీఎస్‌యూ గెయిల్ ఇండియా చేజిక్కించుకుంది. ఇందుకు వీలుగా ప్రైవేట్ రంగ సాల్వెంట్ కంపెనీ జేబీఎఫ్‌లో రూ. 2,101 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తద్వారా ఈ జూన్ 1 నుంచి సొంత అనుబంధ సంస్థగా మార్చుకుంది. జేబీఎఫ్‌ను కొనుగోలు చేసేందుకు మార్చిలో దివా లా చట్ట సంబంధ కోర్టు గెయిల్‌ను అనుమతించిన సంగతి తెలిసిందే. రుణ పరిష్కార ప్రణాళిక ప్రకా రం జేబీఎఫ్‌కు ఈక్విటీ రూపేణా రూ. 625 కోట్లు, రుణాలుగా రూ. 1,476 కోట్లు అందించినట్లు గెయిల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తాజాగా వెల్లడించింది. కాగా.. జేబీఎఫ్ కొనుగోలుకి ఇతర పీఎస్ యూ దిగ్గజాలు ఐవోసీ, ఓఎన్‌జీసీలతో పోటీపడి గెయిల్ బిడ్ చేసింది. రూ. 5,628 కోట్ల బకాయిల రికవరీకిగాను ఐడీబీఐ బ్యాంక్ దివాలా ప్రక్రియను చేపట్టింది.
కంపెనీ బ్యాక్‌గ్రౌండ్
జేబీఎఫ్ పెట్రోకెమికల్స్ 2008లో ఏర్పాటైంది. మంగళూరు సెజ్‌లో 1.25 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్యూరిఫైడ్ టెరిప్తాలిక్ యాసిడ్(పీటీఏ) ప్లాంటును నెలకొల్పేందుకు కంపెనీకి ఐడీబీఐసహా ఇతర బ్యాంకులు రుణాలందించాయి. బీపీ సాంకేతిక మద్దతుతోపాటు 60.38 కోట్ల డాలర్ల రుణాలను మంజూరు చేశాయి. అంతేకాకుండా ము డిసరుకుగా నెలకు 50,000 టన్నుల పారాగ్జిలీన్‌ను సరఫరా చేసేందుకు ప్రభుత్వ రంగ కెమికల్ సంస్థ ఓఎంపీఎల్ సైతం అంగీకరించింది.
ప్రధానంగా జేబీఎఫ్ ఇండస్ట్రీస్ పాలియస్టర్ ప్లాంట్లకు అవసరమైన ముడిసరుకును రూపొందించేందుకు ఈ సంస్థ ఏర్పాటైంది. 2017లో కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలంకావడంతో అదే ఏడాది మూతపడింది. వెరసి కార్పొరేట్ దివా లా ప్రక్రియకు లోనైంది. కాగా.. గెయిల్ యూపీలో ని పటాలో వార్షికంగా 8,10,000 టన్నుల సా మర్థ్యంతో పెట్రోకెమికల్ ప్లాంటును కలిగి ఉంది. వ చ్చే ఏడాదికల్లా మహారాష్ట్రలోని ఉసార్‌లో ప్రొ పేన్ డీహైడ్రోజనేషన్ ప్లాంటును నిర్మించే లక్ష్యంతో ఉంది. తద్వారా ఏడాదికి 5,00,000 టన్నుల పాలీప్రొపిలీన్‌ను రూపొందించాలని ప్రణాళికలు వేసింది.
ఈ వార్తల నేపథ్యంలో గెయిల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.6 శాతం నీరసించి రూ. 105 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment