New expressway: బెంగళూరు- మంగళూరు మధ్య తగ్గనున్న ప్రయాణ దూరం | 8 New Bengaluru Mangaluru Expressway To Cut Travel Time | Sakshi
Sakshi News home page

New expressway: బెంగళూరు- మంగళూరు మధ్య తగ్గనున్న ప్రయాణ దూరం

Published Mon, Feb 24 2025 1:22 PM | Last Updated on Mon, Feb 24 2025 1:24 PM

8 New Bengaluru Mangaluru Expressway To Cut Travel Time

కర్నాటక ప్రజలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది.  రాష్ట్రంలోని రెండు మెగా నగరాలైన బెంగళూరు- మంగళూరులను అనుసంధానిస్తూ త్వరలో ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(Ministry of Road Transport and Highways) ప్రకటించింది. ఈ నగరాలను హసన్ ప్రాంతం మీదుగా అనుసంధానిస్తామని తెలిపింది.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఈ రెండు నగరాల ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందించడమే కాకుండా, ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం ఏడు నుండి  ఎనిమిది గంటలు వరకూ తగ్గే అవకాశం ఉందని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ), కర్ణాటక ప్రజా పనుల శాఖ(Karnataka Public Works Department) సంయుక్తంగా చేపట్టనున్నాయని తెలిపింది.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే  ప్రధాన లక్ష్యం బెంగళూరు వెలుపలి ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే 335 కి.మీ. దూరం ఉంటుంది, నాలుగు నుండి ఆరు లేన్‌లుగా దీనిని నిర్మించనున్నారు. ఈ బెంగళూరు-మంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే(Bengaluru-Mangalore Expressway) నిర్మాణం 2028లో ప్రారంభం కానుంది . ఇది రాష్ట్ర రవాణా రంగానికి గేమ్ ఛేంజర్‌గా మారనుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి చాలా సమయం పడుతోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ మార్గంలో ప్రయాణించాలంటే పలు ఇబ్బందులు ఎదువుతుంటాయ. ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్  మాట్లాడుతూ బెంగళూరు ట్రాఫిక్ రద్దీ సమస్యను రాబోయే రెండు,మూడు ఏళ్లలోపు పరిష్కరించడం అసాధ్యమని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తా జీతమెంత? కేజ్రీవాల్‌ పింఛనెంత?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement