ministry of road transport and highways
-
ఏటీఎస్‌లలో ఫిట్నెస్ పరీక్షల గడువు పెంపు
న్యూఢిల్లీ: భారీ సరుకు వాహనాలు, ప్రయాణికుల కోసం ఉపయోగించే భారీ వాహనాలకు నమోదిత ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) ద్వారా తప్పనిసరి ఫిట్నెస్ పరీక్ష తేదీని ప్రభుత్వం 18 నెలల పాటు పొడిగించింది. ఈ నిబంధన 2024 అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుందని రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ మినిస్ట్రీ వెల్లడించింది. వాస్తవానికి ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. మధ్యస్థాయి, తేలికపాటి సరుకు రవాణా వాహనాలు, మధ్యస్థాయి ప్యాసింజర్ వెహికిల్స్‌కు 2024 జూన్ 1 నుంచి తప్పనిసరి చేయాలని గతంలో నిర్ణయించారు. తాజా ప్రకటన ప్రకారం ఈ వాహనాలకు అన్నిటికీ సామర్థ్య పరీక్షలు 2024 అక్టోబర్ 1 నుంచి ఏటీఎస్ ద్వారా తప్పనిసరిగా జరపాల్సి ఉంటుంది. రవాణాయేతర వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమయంలో (వాహనం కొన్న 15 ఏళ్లకు) ఫిట్నెస్ పరీక్షలు చేపడతారు. -
బీహెచ్ నెంబర్ ప్లేట్ గురించి తెలుసా? రిజిస్ట్రేషన్ ఎలా?
సాక్షి,ముంబై: దేశంలో మోటారు వాహన చట్టం ప్రకారం భారత్(BH) అనే నంబరు ప్లేట్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బీహెచ్ సిరీస్ నంబరు ప్లేట్‌ను వాహన వినియోగదారులందరూ వాడుకోవచ్చా? ఈ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ వల్ల లాభాలేంటి? ఆగస్టు 26, 2021 ప్రతిపాదించి, సెప్టెంబర్ 15, 2021 నుంచి అమలులోకి వచ్చిన ఈ విధానంలో ఎవరు బీహెచ్ సిరీస్ నెంబర్ ప్లేట్లకు అర్హులు, తదితర విషయాలను ఒకసారి చూద్దాం! భారతదేశంలోని రక్షణ సిబ్బంది ,ప్రభుత్వ ఉద్యోగుల సౌలభ్యం కోసం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా వాహనాల కోసం భారత్ (BH) రిజిస్ట్రేషన్ సిరీస్‌ను ప్రవేశపెట్టారు. జీఎస్ఆర్594(E) ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ రిజిస్ట్రేషన్ విధానానికి అర్హులు. అలాగే నాలుగు కంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో తిరిగే ప్రైవేటు ఉద్యోగులు తమ వ్యక్తిగత కార్ల కోసం BH రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సాధాణంగా వాహన వినియోగదారులు ఎన్ని స్టేట్స్ మారితే అన్నిసార్లు రిజిస్ట్రేషన్, నో అబ్జెక్షన్, ఇలాంటి తప్పనిసరిగా చేయించుకోవాలి. అయితే మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లాంటి బాదరబందీ లేకుండా బీహెచ్ రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతుంది. తద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏ ప్రైవేటు వాహనమైనా ప్రాంతం మారినప్పుడు రీరిజిస్ట్రేషన్ కోసం ఎన్ఓసీ అవసరం లేకుండానే నేరుగా వాహనదారుడే అప్లై చేసు కోవచ్చు. తద్వారా వారి సమయం, డబ్బు రెండూ సేవ్ అవుతాయన్నమాట. అలాగే బీహెచ్ విధానంలో రెండేళ్ల కొకసారి ఆ స్టేట్ విధానాల ప్రకారం రోడ్ ట్యాక్స్ చెల్లించాలి. (ఇదీ చదవండి: ChatGPT రెసిపీ వైరల్..ఏలియన్స్ కంటే ఏఐ చాలా డేంజర్ బ్రో!) ఎక్కడ, ఎలా అప్లై చేసుకోవాలి? ఆర్టీవో కార్యాలయంలో లేదా వాహన్ పోర్టల్ లో ఈ బీహెచ్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కొనుగోలుదారు తరపున, డీలర్ వాహన పోర్టల్‌లో ఆన్లైన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి. ప్రభుత్వ సంస్థ ఉద్యోగి గుర్తింపు, ఇతర అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఇతర వివరాలను పూరించడంతో పాటు, డీలర్ సరైన రుసుము లేదా పన్ను చెల్లించాలి. అలాగే సంబంధిత ప్రూఫ్స్ సమర్పించి ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరోవైపు సాధారణ నంబరు ప్లేట్లా కాకుండా ఈ బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్లో మొదట సంవత్సరం, తర్వాత బీహెచ్ అని, ఆ తర్వాత వాహన రిజిస్ట్రేషన్ డిజిట్స్ ఉండటం విశేషం. (భారీగా లిథియం నిక్షేపాలు: ఇక భవిష్యత్తంతాఅద్భుతమే! ఆనంద్ మహీంద్ర) -
టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!
టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సాంప్రదాయ టోల్ వసూళ్ల విషయంలో కేంద్రం మార్పులు చేయాలని భావిస్తోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలపై నంబర్ ప్లేట్లను గుర్తించేలా కెమెరా ఎయిడెడ్ టోల్ కలెక్షన్ సిస్టమ సాంకేతికతను ఉపయోగించనుంది. ఇందుకోసం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్పీఆర్) కెమెరాలను అమర్చనుంది. నిరీక్షణ తప్పనుంది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్టీహెచ్) శాఖ టోల్ ప్లాజాల వద్ద చెల్లింపుల కోసం వాహనాలు నిరీక్షించే సమయాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. మరి ఫాస్టాగ్ ప్రస్తుతం, దేశం అంతటా దాదాపు 97 శాతం టోల్ వసూలు ఫాస్టాగ్ ద్వారా జరుగుతున్నాయి. అయినప్పటికీ టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, వాహనాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంఓఆర్టీహెచ్ తెలిపింది. ఈ ఏఎన్పీఆర్ కెమెరాలను సెటప్ చేయడం వల్ల టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించవచ్చు’ అని సూచించింది. ఏఎన్పీఆర్ ఎలా పనిచేస్తుంది? కేంద్ర హైవే రవాణా శాఖ వివరాల ప్రకారం..దేశంలో జాతీయ ప్రధాన రహదారుల్లో ఉన్న టోల్ గెట్లను తొలగించి...వాటి స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీ ఏఎన్పీఆర్ కెమెరాల్ని ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ సాంకేతికత వాహనం నంబర్ ప్లేట్ మీద నెంబర్‌ను చదివి, సదరు వాహన యజమాని లింక్ ఫోన్ నెంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్‌కు చెల్లించాల్సిన అమౌంట్‌ను డిడక్ట్ చేస్తుంది. వాహనాల నంబర్ ప్లేట్ల ఫోటోను క్యాప్చర్ చేయడానికి సిస్టమ్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏఎన్పీఆర్ కెమెరాలతో సన్నద్ధం చేస్తుంది. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు కెమెరా వాహనదారుడి బ్యాంక్ ఖాతా నుండి టోల్ మొత్తాన్ని వసూలు చేసేలా సిస్టమ్‌కు సిగ్నల్ ఇస్తుంది. ఏఎన్పీఆర్ సమర్థవంతంగా పనిచేస్తుందా? ఏఎన్‌పీఆర్‌తో టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గిస్తామని కేంద్రం చెబుతున్నప్పటికీ..దీనిపై అనేక సందేహాలు వ్యక్త మవుతున్నాయి. ఈ పద్దతిలో 2019 తర్వాత కేటాయించిన నెంబర్ ప్లేట్లను మాత్రమే గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే, భారత ప్రభుత్వం 2019లో ప్రయాణీకుల వాహనాలకు ఓఈఎం (Original Manufacturer Number ) నెంబర్‌ను అమలు చేసింది. కెమెరాలు ఈ కంపెనీ అమర్చిన నంబర్ ప్లేట్లను మాత్రమే చదవగలవు. దీంతో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్పీఆర్ ) కెమెరాలు నంబర్ ప్లేట్ తొమ్మిది అంకెల రిజిస్ట్రేషన్ నంబర్‌ను మించి ఉన్నప్పుడు చదవడం సవాలుగా మారనుంది. దేశంలో చాలా మంది వాహన యజమానులు నంబర్ ప్లేట్‌పై పేర్లు రాస్తుంటారు. దీని వల్ల సదరు నెంబర్ ప్లేట్లను గుర్తించడం కష్టం నెంబరు ప్లేట్లు మురికిగా ఉంటే వాటిని గుర్తించలేం. అలాంటి వాహనాలకు టోల్ వసూలు చేయడం చాలా కష్టం. అలాగే, ఏఎన్పీఆర్ కింద టోల్ చెల్లించకుండా టోల్ ప్లాజాలను దాటేందుకు ప్రయత్నించే వాహన యజమానులకు జరిమానా విధించే నిబంధన లేదు. -
వెహికల్ నెంబర్ ప్లేట్ నిబంధనలకు కేంద్రం సవరణలు
న్యూఢిల్లీ: భారత్ సిరీస్ (బీహెచ్) వాహన రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత విస్తరించేందుకు వీలుగా నిబంధనల్లో సవరణలను కేంద్ర రవాణా, రహదారుల శాఖ ప్రతిపాదించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల పరిధిలో రిజిస్టర్ అయిన వాహనాలను భారత్ సిరీస్ కిందకు మార్చేందుకు అనుమతించనుంది. ప్రస్తుతం కొత్త వాహనాలే బీహెచ్ సిరీస్ కింద నమోదుకు అవకాశం ఉంది. బీహెచ్ సిరీస్ నిబంధనల్లో సవరణలతో కూడిన ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్ర రవాణా, రహదారుల శాఖ విడుదల చేసింది. బీహెచ్ సిరీస్ కింద నమోదైన వాహనాన్ని ఒక వ్యక్తి మరో వ్యక్తికి విక్రయించినప్పుడు.. ఇదే సిరీస్ కింద అర్హత ఉన్నా, లేకపోయినా కొనుగోలుదారు పేరిట వాహన రిజిస్ట్రేషన్ సాఫీ బదిలీకి అనుమతించే నిబంధనను కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రెగ్యులర్ రిజిస్ట్రేషన్ కింద ఉన్న వాహనాలు పన్ను చెల్లించడం ద్వారా బీహెచ్ సిరీస్‌కు మారొచ్చు. చట్టంలోని 48వ నిబంధనకు సవరణను ప్రతిపాదించారు. బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం నివాసం ఉండే చోట లేదంటే పనిచేసే ప్రాంతం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ రాష్ట్రాల పరిధిలో వాహన రిజిస్ట్రేషన్ల సాఫీ బదిలీకి, ఉద్యోగ రీత్యా వివిధ రాష్ట్రాల మధ్య మారే వారు.. వాహనాల రిజిస్ట్రేషన్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా బీహెచ్ సిరీస్‌ను గతేడాది సెప్టెంబర్‌లో బీహెచ్ సిరీస్‌ను కేంద్ర రవాణా శాఖ తీసుకురావడం గమనార్హం. చదవండి👉 'ఫాస్టాగ్' కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
ప్రమాదకర వస్తు రవాణాకు ట్రాకింగ్ ఉండాల్సిందే
న్యూఢిల్లీ: ప్రమాదకరమైన సరుకులను, ముడిపదార్థాలను రవాణా చేసే వాహనాలు లొకేషన్ ట్రాకింగ్ పరికరాలను అమర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ఇది తప్పనిసరిగా అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర రవాణా, రహదారుల శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జాతీయ పర్మిట్ (అనుమతులు) పరిధిలోకి రాని వాహనాలు ప్రమాదకర వాయువులు, వస్తువులను రవాణా చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. 2022 సెప్టెంబర్ 1 తర్వాత కేటగిరీ ఎన్2, ఎన్3 వాహనాలకు తయారీ దశలోనే పరికరాలు అమర్చాల్సి ఉంటుంది. -
‘జంపింగ్’ బాబులు జడుసుకునే వార్త
న్యూఢిల్లీ: రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా సిగ్నల్ జంప్ చేసే వాహనదారులు అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. జంపింగ్ బాబులు జడుసుకునే వార్త కేంద్రం తాజాగా వెల్లడించింది. రెడ్‌లైట్ జంపింగ్ కారణంగా రోడ్డు ప్రమాద మరణాలు 2019తో పోలిస్తే 2020లో 79 శాతం పెరిగాయని తాజా నివేదికలో పేర్కొంది. 'భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు - 2020' నివేదికను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ వల్ల 2020లో 919 ప్రమాదాలు సంభవించగా.. 476 మంది మృతి చెందారు. 2019లో 266 మంది దుర్మరణం పాలయ్యారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ కారణంగా 2020లో 3,099 మంది ప్రాణాలు కోల్పోగా.. 2019లో 2,726 మంది మృత్యువాత పడ్డారు. మద్యం మత్తులో ప్రమాదాలకు గురై 2020లో 1862 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019లో 2376 మరణాలు నమోదయ్యాయి. మితిమీరిన వేగమే అత్యధిక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. 2020 క్యాలెండర్ సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 3,66,138 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 1,31,714 మంది మరణించగా.. 3,48,279 మంది క్షతగాత్రులయ్యారు. అయితే 2019తో పోలిస్తే ప్రమాదాల సంఖ్య 18 శాతం, మరణాల రేటు 12.8 శాతం తగ్గింది. రోడ్డు ప్రమాద బాధితుల్లో 18-45 ఏళ్ల వయస్సు గల యువకులే 69 శాతం మంది ఉండగా.. మొత్తం మరణాల్లో 18 నుంచి 60 ఏళ్లలోపు వర్కింగ్ వయసులో ఉన్నవారు 87.4 శాతం మంది ఉండడం ఆందోళన కలిగించే అంశం. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020లో ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గడానికి కోవిడ్-19 లాక్డౌన్ కారణమని నివేదిక వెల్లడించింది. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ, కొత్త మోటారు వాహన చట్టం అమలు చేయడం వల్ల కూడా దుర్ఘటనలు తగ్గినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనదేశంలో 11 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రహదారి దుర్ఘటనల్లో మరణించిన ప్రతి 10 మందిలో ఒకరు మనదేశానికి చెందినవారు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. (క్లిక్: బడికెళ్లాలంటే కాలి నడకే శరణ్యం) 2018లో స్వల్పంగా(0.46 శాతం) పెరగడం మినహా 2016 నుంచి రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే విషయం. వరుసగా రెండో ఏడాది ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గడం కొంతలో కొంత ఊరట. అదేవిధంగా, గాయపడిన వారి సంఖ్య కూడా 2015 నుండి తగ్గుతూ వస్తోంది. (క్లిక్: లడఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు జవాన్లు మృతి) -
థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం పైపైకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం పెరగనుంది. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సవరించిన ధరల ప్రకారం.. 1,000 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ప్రైవేట్ కార్లకు ప్రీమియం రూ.2,094గా నిర్ణయించారు. 2019–20లో ఇది రూ.2,072 వసూలు చేశారు. 1,500 సీసీ వరకు రూ.3,416 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.3,221 వసూలు చేశారు. 1,500 సీసీ కంటే అధిక సామర్థ్యం ఉన్న కార్లకు ప్రీమియం రూ.7,897 నుంచి రూ.7,890కు వచ్చి చేరింది. 150–350 సీసీ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలకు రూ.1,366, అలాగే 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉంటే రూ.2,804 ఉంది. ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లకు 30 కిలోవాట్ అవర్ లోపు రూ.1,780, అలాగే 30–65 కిలోవాట్ అవర్ సామర్థ్యం ఉంటే రూ.2,904 చెల్లించాలి. ప్రీమియంలో 15 శాతం డిస్కౌంట్ ఉంటుంది. 12–30 వేల కిలోలు మోయగల సామర్థ్యం ఉన్న సరుకు రవాణా వాణిజ్య వాహనాలకు ప్రీమియం రూ.33,414 నుంచి రూ.35,313కి చేరింది. 40 వేలకుపైగా కిలోల సామర్థ్యం గల వాహనాలకు రూ.41,561 నుంచి రూ.44,242కు సవరించారు. సాధారణంగా థర్డ్ పార్టీ రేట్లను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ప్రకటించేది. ఐఆర్‌డీఏఐతో సంప్రదింపుల అనంతరం తొలిసారిగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ ధరలను నోటిఫై చేసింది. -
ఆరేళ్ల ప్రాజెక్టు.. యాక్సిడెంట్లు తగ్గేట్టు
సాక్షి, హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం ఆరేళ్ల ప్రాజెక్టును అమలు చేయబోతోంది. దేశవ్యాప్తంగా ఈ ఆరేళ్లలో రూ. 7,270 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో 50 శాతం మొత్తాన్ని కేంద్ర రహదారుల శాఖ కేటాయించనుండగా, 25 శాతం ప్రపంచ బ్యాంకు, మిగతా మొత్తాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అందించనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రాలకు మొత్తంగా రూ.6,725 కోట్లను కేంద్రం ఇవ్వబోతోంది. ఇందులో రాష్ట్రానికి రూ. 320 కోట్లు రానున్నాయి. రోడ్లు భవనాల శాఖతోపాటు రవాణా, హోం, వైద్యారోగ్య, విద్య, పట్టణాభివృద్ధి శాఖలను కలుపుకొని ప్రాజెక్టును కేంద్రం అమలు చేయబోతోంది. 2019 నాటి ప్రమాదాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. వాహనాల సంఖ్య బాగా పెరుగుతుండటం, అందుకు తగ్గట్టు డ్రైవింగ్ నైపుణ్యం అభివృద్ధి చెందకపోవటం, ప్రమాణాలతో రోడ్లు అందుబాటులో లేకపోవటంతో యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు చర్యలు చేపట్టకుంటే పరిస్థితి క్రమంగా భయానకంగా మారుతుందని గుర్తించిన కేంద్రం కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రజల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచితే తప్ప పరిస్థితి మారదని నిర్ణయించి చర్యలు తీసుకోబోతోంది. 2019లో జరిగిన ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టింది. ఆ సంవత్సరం మన రాష్ట్రంలో 21,588 ప్రమాదాలు జరిగాయి. వీటన్నింటిలో కలిపి 6,800 మంది మృతి చెందగా 22,265 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదాల తీవ్రత, రోడ్ నెట్వర్క్ విస్తీర్ణం ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు కేటాయించింది. మార్కులేస్తూ.. డబ్బులిస్తూ.. ప్రాజెక్టులో భాగంగా 14 రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రాజెక్టు ప్రమాణాలను రూపొందించి కచ్చితంగా పాటించేలా గైడ్‌లైన్స్ రూపొందించింది. వాటి అమలు ఆధారంగా రాష్ట్రాలకు మార్కులు ఇవ్వనుంది. అలా వచ్చిన మార్కుల ఆధారంగా ఏటా నిధులను విడుదల చేయనుంది. వచ్చే ఆరేళ్లలో ప్రమాదాల సంఖ్యలో కనీసం 30 శాతం తగ్గాలని, ముఖ్యంగా మృతుల సంఖ్య అంతమేర తగ్గిపోవాల్సి ఉంటుందని కేంద్రం లక్ష్యంగా విధించింది. తొలి ఏడాది 3% మేర మృతుల సంఖ్య తగ్గాలని, ఆ తర్వాతి ఐదేళ్లలో వరుసగా 7.5%, 13.5%, 19.5%, 25.5%, 30 % వరకు తగ్గిపోవాలని చెప్పింది. ప్రమాదాల నివారణకు కేంద్రం మార్గదర్శకాలు.. ►రోడ్డు ప్రమాదాలపై డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ సంబంధిత అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. ►రోడ్లపై నిర్ధారిత వేగాన్ని మించకుండా పరికరాలు సమకూర్చుకోవాలి. ►రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే పాఠ్యాంశాలు రూపొందించాలి. ►ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి లోపాలను సరిదిద్దాలి. ►వాహనాల ఫిట్నెస్ పరీక్షలను కఠినంగా అమలు చేయాలి. ►నిబంధనలు పాటించని వాహనదారులకు పెనాల్టీలు విధించాలి. ►ప్రమాదాలు జరిగితే వెంటనే క్షతగాత్రులకు వైద్యం అందేలా అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ►అంబులెన్సులు సమకూర్చుకోవాలి. వాటి నిర్వహణ పక్కాగా ఉండాలి. ►ప్రధాన రోడ్లపై ద్విచక్ర వాహనాలకు విడిగా మార్కింగ్ ఉండాలి. -
బీహెచ్ ట్యాగ్: ఇక కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ అక్కర్లేదు
వ్యక్తిగత వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారత్ సిరీస్(బీహెచ్) కొత్త వాహనాలను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తీసుకెళ్లినప్పుడు..రిజిస్ట్రేషన్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంతకు ముందు వాహనాలు తీసుకెళ్లినప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ అవసరం ఉండేది. అయితే బీహెచ్ సిరీస్ ట్యాగ్ ఉన్న వాహనాలకు ఇకపై ఆ అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తాజా నొటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. రక్షణ సిబ్బంది, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలకు (PSU), నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న ప్రైవేట్ సెక్టార్ కంపెనీలకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్వచ్చందంగా వర్తించనుంది. ఈ పథకం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వ్యక్తిగత వాహనాల తరలింపునకు బీహెచ్ ట్యాగ్ దోహదపడుతుందని కేంద్రం చెబుతోంది. పద్నాలుగేళ్ల కాలపరిమితి తర్వాత మాత్రం.. క్రితం కంటే వసూలు చేసిన మోటర్ వెహికిల్ ట్యాక్స్‌లో సగం చొప్పున ప్రతీ ఏడాది వసూలు చేయనున్నట్లు నొటిఫికేషన్‌లో పేర్కొంది. చదవండి : మీరు పాత కారు కొనాలనుకుంటున్నారా ?! -
వాహనదారులకు అదిరిపోయే శుభవార్త!
న్యూఢిల్లీ: మీకు దగ్గర ఏదైనా వాహనం ఉందా? లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే, మీకు శుభవార్త. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటారు వాహన 1989 చట్టంలోని కొన్ని నిబంధనలలో మార్పులు చేసింది. ఈ కొత్త నిబందనల ప్రకారం.. వాహన యజమాని వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో తన వాహనానికి నామినీ పేరును కూడా జత చేయవచ్చు. ప్రస్తుతం ఎలాగైతే బ్యాంక్ ఖాతా, భీమా వంటి ఖాతాలకు నామినీని పెట్టుకున్నామో అలాగా అన్నమాట. వాహన యజమాని మరణించినప్పుడు ఆ వాహనాన్ని తన పేరు మీద మార్చుకోవడానికి ఈ మార్పుల వల్ల సులభతరం కానుంది. నామినీ పేరును వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో లేదా తర్వాత అయిన ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా జత చేయవచ్చు. ఇప్పటి వరకు నామినీని జాతచేయడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉండే విదంగా కొత్త నిబందనలు తీసుకువచ్చింది. నామినీ పేరును జత చేయాలంటే అతని గుర్తింపు కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. వాహన యజమాని మరణించిన తర్వాత ఆ వాహనాన్ని తన పేరుమీదకు మార్చాలంటే 30 రోజుల్లోపు యజమాని మరణాన్ని రిజిస్ట్రేషన్ అథారిటీకి తెలపాల్సి ఉంటుంది. అలాగే, వాహన యజమాని మరణించిన 3 నెలల్లో నామినీ వాహన బదిలీ కోసం ఫారం-31 ను సమర్పించాలి. పెళ్లి విడాకులు, ఆస్తి విభజన వంటి సందర్భాల్లో నామినీలో పేరు మార్పు కోసం యజమాని అంగీకరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP)తో మార్చవచ్చు. ప్రస్తుతం ఒక వాహనం రిజిస్టర్డ్ యజమాని మరణించిన సందర్భంలో వాహనాన్ని నామినీకి బదిలీ చేయడానికి వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాలి. రాష్ట్రం రాష్ట్రానికీ ఈ విధానం మారుతూ ఉంటుంది. యజమాని మరణించిన సందర్భంలో వాహన బదిలీకి చట్టపరమైన వారసుడిగా గుర్తింపు రుజువు చూపించాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పౌరుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు నవంబర్ 27న, 2020 రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో నామినీ పేరు వాహనం యజమాని జత చేయడానికి సెంట్రల్ మోటార్ వాహనాలు 1989 చట్టంలో మార్పులు చేయాలని మొదట ప్రతిపాదించింది. తర్వాత అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అలాగే, సాధారణ ప్రజల నుండి సలహాలు కోరింది. అన్నీ సూచనలను పరిశీలించిన తరువాత, మంత్రిత్వ శాఖ తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. చదవండి: కరోనాతో చనిపోతే రూ.2లక్షలు వస్తాయా? -
రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లం‘ఘనులు’ 40 శాతం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారు 40 శాతం మంది ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తేల్చింది. గత నాలుగేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తూ ట్రాన్స్‌పోర్టు రీసెర్చి వింగ్ ఓ నివేదిక వెల్లడించింది. మన రాష్ట్రంలో ప్రమాదాలు, కారణాలు తదితర అంశాలను ఈ నివేదిక విశ్లేషించింది. ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంతో రోజుకు తొమ్మిదిమంది మృత్యువాత పడుతున్నారు. ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 36 మంది దుర్మరణం పాలవుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారీగా జరిమానాలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ జరిమానాల పెంపుతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని రవాణారంగ నిపుణులు పేర్కొంటున్నారు. -2019లో మొత్తం 21,992 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 15,303 ప్రమాదాలు డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారి వల్ల, 1,262 ప్రమాదాలు లెర్నింగ్ లైసెన్సు ఉన్నవారి వల్ల, 2,576 రోడ్డు ప్రమాదాలు అసలు డ్రైవింగ్ లైసెన్సు లేనివారి వల్ల జరిగాయి. నిబంధనల ఉల్లంఘనల కారణంగా 2,851 ప్రమాదాలు జరిగాయి. - ట్రాఫిక్ ఉల్లంఘనలపై రాష్ట్రంలో రోజూ 80 నుంచి 120 వరకు కేసులు నమోదవుతున్నాయి. - డ్రైవింగ్ లైసెన్సు ఉండి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి పునశ్చరణ తరగతులు నిర్వహించడంపై రవాణా, పోలీస్‌శాఖలు ఆలోచిస్తున్నాయి. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే.. - గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలు: 21,992 - ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య: 7,984 - తీవ్రంగా గాయపడినవారి సంఖ్య: 24,619 - మృత్యువాత పడిన ద్విచక్రవాహనదారుల సంఖ్య: 3,287 - వీరిలో మహిళల సంఖ్య: 399 - హెల్మెట్ ధరించనివారి సంఖ్య: 1,861 - పిలియన్ రైడర్స్ (వెనుక కూర్చున్న వారు) సంఖ్య: 775 - సీటు బెల్టు ధరించని కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నవారి సంఖ్య: 711 - ఓవర్ స్పీడ్ కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాలు: 15,383 - ఓవర్ స్పీడ్ వల్ల మరణించినవారి సంఖ్య: 5,530 - డ్రంకన్‌డ్రైవ్ వల్ల మృత్యువాత పడినవారి సంఖ్య: 43 - రాంగ్ రూట్లో వచ్చి మరణించినవారి సంఖ్య: 155 - హైవేలపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య: 2,760 నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై కఠినచర్యలు వాహనదారులు సామాజిక బాధ్యతగా తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే తీవ్ర చర్యలుంటాయి. ప్రాణాల విలువ తెలియజేసేందుకే జరిమానాలు పెంచాం. జరిమానాల పెంపుతోనైనా కొంత మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. భారీ జరిమానాలతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. జరిమానాలతో 40 శాతం ఉల్లంఘనలు సగానికి పైగా తగ్గుతాయని భావిస్తున్నాం. జరిమానాలతో ఆదాయం పెంచుకుందామనేది మా అభిమతం కాదు. - పేర్ని వెంకట్రామయ్య (నాని), రవాణా శాఖ మంత్రి ఎన్ఫోర్సుమెంట్ కార్యకలాపాలు పెంచుతాం వాహనదారులకు క్రమశిక్షణ నేర్పేందుకే ప్రభుత్వం జరిమానాలు పెంచింది. చెల్లుబాటయ్యే లైసెన్సు ఉన్నవారు కూడా రోడ్డు ప్రమాదాలకు కారకులవడం బాధాకరం. డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చేందుకు కూడా.. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో పరీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇకపై ఎన్ఫోర్సుమెంట్ కార్యకలాపాలు పెరుగుతాయి. - పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్ గత ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు జిల్లా ఓవర్ స్పీడ్ లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేసినవి అనంతపురం 320 327 చిత్తూరు 8 269 తూర్పుగోదావరి 30 289 గుంటూరు 1 459 కృష్ణా 1 101 కర్నూలు 147 330 నెల్లూరు 1,926 603 ప్రకాశం 2 146 శ్రీకాకుళం 0 8 విశాఖపట్నం 3,446 302 విజయనగరం 0 42 పశ్చిమగోదావరి 7 722 వైఎస్సార్ కడప 0 231 మొత్తం 5,888 3,829 రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవించిన మరణాలు.. సంవత్సరం మరణాలు 2016 8,541 2017 8,060 2018 7,556 2019 7,984 2020 (సెప్టెంబర్ వరకు) 4,752 -
మోస్ట్ ఎఫెక్టెడ్: ద్విచక్రవాహనదారులే!
- రోడ్డుప్రమాదాల్లో చనిపోతున్నవారిలో బైక్ రైడర్లే ఎక్కువ - గత ఏడాదిలో 52,500 మంది మృత్యువాత - 2016లో మొత్తం 4.8 లక్షల ప్రమాదాల్లో 1.5 లక్షల మంది దుర్మరణం - అత్యధిక మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణ - ‘2016లో ప్రమాదాలు’పై రిపోర్ట్ విడుదల చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ - 2017 ప్రధమార్ధంలో తగ్గిన మరణాలు న్యూఢిల్లీ: దేశంలో ప్రతిరోజు 1317 మంది చొప్పున రోడ్డు ప్రమాదాల్లో బలవుతున్నారు. అన్ని రాష్ట్రాల పోలీసు శాఖల నుంచి సేకరించిన వివరాల ప్రకారం గత ఏడాది(2016) భారత్‌లో మొత్తం 4,80,652 రోడ్డు ప్రమాద ఘటనలు చోటుచేసుకోగా.. 1,50,785 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల సంఖ్య 4,94,624గా నమోదయింది. చనిపోయినవారిలో 52,500 మంది(33.8శాతం) ద్విచక్రవినియోగదారులే కావడం గమనార్హం. అత్యధిక ప్రమాదాలు, మరణాలు సంభివిస్తోన్న రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉండటం గమనార్హం. కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం విడుదల చేసిన ‘ఇండియాలో రోడ్డు ప్రమాదాలు-2016’ నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నారు. ‘రోడ్డు ప్రమాదాలు నివేదిక’లో మరికొన్ని అంశాలివి.. ⇒ 2015తో పోల్చుకుంటే 2016లో రోడ్డు ప్రమాదాలు 4.1 శాతం తగ్గినప్పటికీ, మరణాలు 3.2 శాతం మేరకు పెరిగాయని నివేదికలో వెల్లడైంది. ⇒అయితే ఈ ఏడాది(2017) ప్రధమార్థంలో మాత్రం ప్రమాదాలు 3 శాతం తగ్గాయి. అదేవిధంగా 4.75 శాతం మేరకు మరణాలు కూడా తగ్గాయి. ⇒ అత్యధికంగా ప్రమాదాలకు గురవుతున్న వాహనాలు: టూవీలర్లు(33.8 శాతం), కార్లు(23.6), ట్రాక్టర్లు, లారీలు,టెంపోలు(21శాతం), ఆటోరిక్షాలు(6.5 శాతం). ⇒ అతి వేగం.. దేశంలో జరుగుతోన్న రోడ్డు ప్రమాదాలకు ముఖ్యమైన కారణం. గత ఏడాది సంభవించిన మరణాల్లో 56 శాతం మంది అతివేగం కారణంగానే ప్రాణాలు కోల్పోయారు. ⇒12 శాతం మరణాలు వాహనం నడుపుతూ మొబైల్ మాట్లాడటం వల్ల జరిగాయి. ఓవర్ టేకింగ్ వల్ల 6శాతం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 4 శాతం, ఇతర కాణాల వల్ల మరో 22 శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ⇒ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది చోటుచేసుకున్న 22,811 ప్రమాదాల్లో 7,219 మంది ప్రాణాలు కోల్పోగా, 24,217 మంది గాయపడ్డారు. ⇒తెలంగాణలో 24,888 ప్రమాదాల్లో 8,541మంది చనిపోగా, 30,051 మంది గాయపడ్డారు. ⇒రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నవారిలో 18-34 ఏళ్ల వయసు వారే ఎక్కువ(46.3 శాతం) ⇒జరుగుతోన్న ప్రమాదాల్లో జాతీయ రహదారులపై చోటుచేసుకుంటున్నవే (29.6 శాతం) అధికం. స్టేట్ హైవేలపై 25.3 శాతం, ఇతర రహదారులపై 45.1 శాతం. ⇒ఎక్కువగా ప్రమాదానికి గురవుతోన్నవారిలో ద్విచక్రవాహనదారుల సంఖ్య (52,500) ఎక్కువ. వీరిలో 19.3 శాతం మంది ప్రమాద సమయంలో హెల్మెట్లు ధరించనివారే. కారు వినియోగదారులు 26,923 మంది చనిపోగా, భారీ వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురై చనిపోయివారి సంఖ్య 26,845గా ఉంది. ⇒పాదచారులూ జాగ్రత్త: గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో 15,746 మంది పాదచారులు చనిపోవడం గమనార్హం. ⇒అత్యధికంగా ప్రమాదాలు జరుగుతోన్న పెద్ద నగరాల్లో చెన్నైది మొదటి స్థానం. గతేడాది చెన్నైలో 7,486 ప్రమాదాలు జరిగాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ(7375 ప్రమాదాలు), బెంగళూరు(5323), ఇండోర్(5143), కోల్‌కతా(4104), ముంబై(3379) ఉన్నాయి. ⇒ భారీ సంఖ్యలో జరుగుతోన్న ప్రమాదాలు.. దేశంలో రోడ్డు భద్రత ఆశించినమేరలో లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాయని, సాంకేతికత సహాయంతో ప్రమాదాలను నివారించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి గడ్కరీ తెలిపారు. ⇒ బ్లాక్‌స్పాట్స్(ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను) గుర్తించి, మార్పులు చేసేలా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎంపీల సారధ్యంలో స్థానిక అధికారులు, పౌరులతో కూడిన కమిటీలను ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. -
17 ఏళ్లు అవుతోంది.. ఆ వ్యక్తి ఎక్కడా?
న్యూఢిల్లీ: తనకు బెయిల్ కోసం ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి మరణించి 17 సంవత్సరాలు గడిచిపోయినా నిందితుడికి తెలియకపోవడం నమ్మశక్యంగా లేదని సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను మే 22కు వాయిదా వేసింది. వివరాల్లోకెళితే ఢిల్లీకి చెందిన వినీత్ తివారీ, ఎల్.కె.కౌల్, ఏ ఎస్ మస్తర్లు 1982లో అప్పటి షిప్పింగ్, రవాణా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సంతకంతో ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించారు. వాటి సాయంతో బాంబే పోర్ట్ ట్రస్టుకు చెందిన 39,846 చదరపు మీటర్ల భూమిని రూ.2.27 కోట్లకు విక్రయించారు. ఈ ఘటనపై 1983, మార్చి22న అప్పటి షిప్పింగ్, రవాణా మంత్రిత్వ శాఖ జాయింట్స సెక్రటరీ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మస్తర్ అప్రూవర్‌గా మారడంతో 1985లో కోర్టు అతడిని విడుదల చేసింది. 2008 అక్టోబర్ 13న తివారీ, కౌల్‌లకు వ్యతిరేకంగా మోసం, ఫోర్జరీ, కుట్ర, తప్పుడు ధ్రువపత్రాల సమర్పణ అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రాథమిక ఆధారాల ప్రకారం నిందితులిద్దరూ అప్రూవర్‌తో కలిసి నేరం చేశారని కోర్టు అభిప్రాయపడింది. తివారీ బెయిల్‌కు మరో ష్యూరిటీని అంగీకరించిన ధర్మాసనం, విచారణను మే 22కు వాయిదా వేసింది.