
వ్యక్తిగత వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారత్ సిరీస్(బీహెచ్) కొత్త వాహనాలను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తీసుకెళ్లినప్పుడు..రిజిస్ట్రేషన్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంతకు ముందు వాహనాలు తీసుకెళ్లినప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ అవసరం ఉండేది. అయితే బీహెచ్ సిరీస్ ట్యాగ్ ఉన్న వాహనాలకు ఇకపై ఆ అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తాజా నొటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
రక్షణ సిబ్బంది, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలకు (PSU), నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న ప్రైవేట్ సెక్టార్ కంపెనీలకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్వచ్చందంగా వర్తించనుంది.
ఈ పథకం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వ్యక్తిగత వాహనాల తరలింపునకు బీహెచ్ ట్యాగ్ దోహదపడుతుందని కేంద్రం చెబుతోంది. పద్నాలుగేళ్ల కాలపరిమితి తర్వాత మాత్రం.. క్రితం కంటే వసూలు చేసిన మోటర్ వెహికిల్ ట్యాక్స్‌లో సగం చొప్పున ప్రతీ ఏడాది వసూలు చేయనున్నట్లు నొటిఫికేషన్‌లో పేర్కొంది.
చదవండి : మీరు పాత కారు కొనాలనుకుంటున్నారా ?!
Comments
Please login to add a commentAdd a comment