Narandra modi
-
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్!
సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వచ్చే వారం నుంచి ‘భారత్ రైస్’ పేరిట కిలో బియ్యం రూ.29కే విక్రయించనున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా సామాన్య ప్రజలకు ఊరట కలిగిస్తుందని పేర్కొంది. ఈ మేరకు బియ్యం నిల్వలు ఎంత మేర ఉన్నాయో ట్రేడర్లు ప్రకటించాలని ఆదేశించింది. ‘వివిధ రకాలపై ఎగుమతి పరిమితులు ఉన్నప్పటికీ.. బియ్యం రిటైల్, టోకు ధరలు సంవత్సరానికి 13.8 శాతం నుంచి 15.7శాతం పెరిగాయి. ధరలను నియంత్రించడానికి, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులను గుర్తించేలా వచ్చే వారం నుండి రిటైల్ మార్కెట్లో సబ్సిడీతో కూడిన భారత్ రైస్‌ను కిలో రూ.29 చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని యూనియన్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సంజీవ్ చోప్రా తెలిపారు. భారత్ రైస్‌ను ఎక్కడ కొనుగోలు చేయాలి? నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్), రిటైల్ చైన్ కేంద్రీయ భండార్లలో భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల ప్యాక్ అందుబాటులో ఉంచనుంది కేంద్రం. తొలి దశలో, ప్రభుత్వం రిటైల్ మార్కెట్లో అమ్మకానికి 500,000 టన్నుల బియ్యాన్ని కేటాయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ కిలో గోదుమ పిండిని రూ. 27.50, భారత్ దాల్ (చనా) కిలో రూ. 60కి విక్రయిస్తోంది . బియ్యంపై స్పష్టత ఇవ్వాల్సిందే ట్రేడర్ల వద్ద అన్నీ రకాల బియ్యం బ్రోకెన్ రైస్, నాన్ బాస్మతీ వైట్ రైస్, పార్బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్, వరి ఇలా ఎంత మేరకు నిల్వ ఉన్నాయో తెలపాలని, ఇందుకోసం ప్రతి వారం ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ పోర్టల్‌లో ప్రకటించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా దేశీయంగా ధరలు స్థిరపడే వరకు బియ్యం ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చోప్రా చెప్పారు. -
నేడు ప్రధాని మోదీ వారణాసి రాక..
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) యూపీలోని వారణాసికి రానున్నారు. ఆది, సోమవారాలలో ప్రధాని మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఉంటారు. డిసెంబర్ 17న తన కాశీ పర్యటనలో మొదటి రోజున ప్రధాని మోదీ.. నాడేసర్‌లో జరిగే వికాస్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం ప్రారంభిస్తారు. మరుసటి రోజు అంటే డిసెంబర్ 18న విహంగం యోగాకు చెందిన స్వర్వేద మహామందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. తరువాత బర్కిలో జరిగే బహిరంగ సభలో మిషన్-2024కు శంఖనాదం చేసిన అనంతరం ప్రసంగించనున్నారు. అలాగే కాశీ సంసద్ స్పోర్ట్స్ కాంపిటీషన్ విజేతలను కలుసుకోనున్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా తన పార్లమెంటరీ నియోజకవర్గానికి వస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేశారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. బార్కి నుంచి ఢిల్లీ-వారణాసి వందే భారత్‌తో సహా ఐదు రైళ్లను ప్రారంభించనున్నారు. దీనితోపాటు రూ.19,150 కోట్ల విలువైన 37 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కటింగ్ మెమోరియల్ స్కూల్ గ్రౌండ్స్‌లో జరిగే భారత్ సంకల్ప్ యాత్రలో ప్రధాని మోదీ.. పీఎం ఆవాస్, పీఎం స్వనిధి, పీఎం ఉజ్వల తదితర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఇది కూడా చదవండి: కరోనా కొత్త వేరియంట్ కలకలం.. కేరళలో జేఎన్.1 కేసు నమోదు! -
చివరి దశకు చర్చలు, భారత్‌లో టెస్లా కార్లు తిరిగేది ఎప్పుడంటే?
భారత్‌లో ‘టెస్లా’ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ కేంద్ర ప్రభుత్వంతో చేసుకోనున్న ఒప్పంద ప్రయత్నాలు దాదాపు తుది అంకానికి చేరాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. భారత్-టెస్లాల మధ్య ఒప్పందం పూర్తయితే మరో రెండేళ్లలో దేశీయంగా టెస్లా ఫ్యాక్టరీ అందుబాటులోకి రానుంది. దీంతో టెస్లా కార్లు రయ్.. రయ్ మంటూ చక్కెర్లు కొట్టనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 12 వరకు గుజరాత్ రాష్ట్రంలో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు పాల్గొనే ఈ ఈవెంట్లో భారత్ - టెస్లాల మధ్య జరగనున్న ఒప్పందంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమ్మిట్లోనే ఎందుకు? టెస్లా కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌పై ప్రకటన వస్తుందనే అంశంపై.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కేంద్రంగా ఇన్వెస్టర్ల సమావేశం, ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఎగుమతులకు అనువైన ప్రాంతాల్ని టెస్లా యాజమాన్యం గుర్తించిందని కాబట్టే ప్రకటన పరిశీలనలో ఉన్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. టెస్లా కనీస పెట్టుబడులు దేశీయంగా టెస్లా ప్లాంట్‌ను నిర్మించేందుకు ఎలాన్ మస్క్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేలా హామీ ఇచ్చిన పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా టెస్లా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కనీస పెట్టుబడి కింద మస్క్ 2 బిలియన్లు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. కారు తయారీ కోసం కావాల్సిన ఇతర కారు పార్ట్స్‌ని దేశీయ సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు 15 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నారు. ఖర్చు తగ్గించుకునేలా మనదేశంలో కొన్ని బ్యాటరీలను తయారు చేయాలనే యోచనలో ఉన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది పైన తెలిపినట్లుగా..దేశీయంగా టెస్లా- భారత్‌ల మధ్య ఒప్పందాలు ఎలా కొనసాగుతున్నాయనే అంశంపై అటు కేంద్రంగాని ఇటు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నుంచి ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
భారత్‌లో తయారీ.. విదేశాలకు రూ.85వేల కోట్ల స్మార్ట్ఫోన్ల ఎగుమతులు!
దేశీయంగా తయారీ, అటు ఎగుమతులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్- PLI) పథకం మంచి సత్ఫలితాలనిస్తున్నట్లు తెలుస్తోంది. 14 రంగాలకు వర్తిస్తోన్న ఈ స్కీమ్‌లో భాగమైన స్మార్ట్ ఫోన్ రంగం గణనీయమైన ఫలితాలు సాధించింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి (2021-2022) భారత్‌లో తయారు చేసిన సుమారు రూ. 85 వేల కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లు విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (icea) ప్రకటించింది. ఎక్స్పోర్ట్ చేసిన స్మార్ట్ ఫోన్లు గత ఆర్ధిక సంవత్సరం కంటే ఎక్కువగా రెట్టింపు అయ్యాయని సూచించింది. ఫోన్లను యూఏఈ, అమెరికా, నెథర్లాండ్స్, యూకే, ఇటలీ దేశాలకు పంపించినట్లు ఐసీఈఏ డేటా తెలిపింది. ఈ సందర్భంగా ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మోహింద్రో మాట్లాడుతూ.. దేశీయంగా 40 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్ల తయారీని అధిగమించినట్లు చెప్పారు. 25 శాతం అంటే 10 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లను విదేశాలకు తరలించినట్లు చెప్పారు. ఇక ఉత్పత్తి చేసిన 97 శాతం ఫోన్లను దేశీయంగా అమ్మకాలు జరిగాయని.. తద్వారా భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఫోన్ల తయారీ దేశంగా అవతరించిందని అన్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. భారత్ ఈ ఏడాది ముగిసే సమయానికి రూ.1లక్షల కోట్ల విలువైన ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. పలు నివేదికల ప్రకారం..చైనాలో సప్లయ్ చైన్ సమస్యల కారణంగా కంటే భారత్, వియాత్నం దేశాల్లో స్మార్ట్ ఫోన్ తయారీ లబ్ధిదారులుగా అవతరించినట్లు అంచనా. చదవండి👉 భారత్‌లో ఐఫోన్ల తయారీ.. యాపిల్ అంచనాలు తలకిందులవుతున్నాయా? -
ప్రైవేటు రంగం మరిన్ని పెట్టుబడులతో ముందుకు రావాలి
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రభుత్వం కల్పించిన ప్రతిపాదనలను అనుకూలంగా మలుచుకోవాలని భారత పరిశ్రమలను (ఇండియా ఇంక్) ప్రధాని మోదీ కోరారు. ప్రభుత్వం మూలధన వ్యయాలను పెంచినట్టే, ప్రైవేటు రంగం కూడా మరిన్ని పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే గరిష్ట ప్రయోజనం పొందగలమన్నారు. బడ్జెట్‌పై నిర్వహించిన 10వ వెబినార్‌లో భాగంగా ప్రధాని మాట్లాడారు. ప్రభుత్వం మూలధన వ్యయాల లక్ష్యాన్ని చారిత్రక గరిష్ట స్థాయి అయిన రూ.10 లక్షల కోట్లకు పెంచినట్టు గుర్తు చేశారు. అంతర్జాతీయంగా భారత్ ఎకానమీకి ప్రశంసలు లభిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. జీఎస్టీసహా ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను తగ్గింపు వల్ల పన్నుల భారం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్టు ప్రధాని తెలిపారు. ఈ చర్యలతో పన్నుల వసూళ్లు మెరుగుపడ్డాయని.. 2013–14 నాటికి 11 లక్షల కోట్లుగా ఉన్న పన్నుల ఆదాయం 2023–24 నాటికి రూ.33 లక్షల కోట్లకు చేరుకోవచ్చన్నారు. -
ఆమెను చూసి ‘అయ్యో’ అనేసిన ప్రధాని మోదీ
బెంగళూరు యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ ‘ఏరో ఇండియా 2023’ షోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ‘ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’ అనే నినాదంతో ఐదురోజుల పాటు ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన జరగనుంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. ఈ ఎయిర్‌షోలో భాగంగా అన్నీ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వారిలో లే ఆఫ్ ఐటీ ఉద్యోగి, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యో శ్రద్దా జైన్ ఉన్నారు. మోదీ తనని చూసి ‘అయ్యో’ అని పిలిచారని అన్నారు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.మోదీకి కృతజ్ఞతలు’ అంటూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో తెగ చక్కెర్లు కొడుతున్నారు. ఇంతకీ ఈ శ్రద్దా జైన్ ఎవరు? మోదీ ఆమెను చూసి అయ్యో అని ఎందుకు పిలిచారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. (ఇదీ చదవండి: Mass Layoffs "ఓన్లీ ప్యాకేజ్, నో బ్యాగేజీ" ఉద్యోగ కోతలపై మామూలు చురకలు కాదు! వైరల్ వీడియో) ఆర్ధిక మాంద్యం సెగ తగులుతోంది ఐటీ ఉద్యోగి అంటే లగ్జరీ లైఫ్. కావాల్సినంత జీతంతో కోరుకున్న జీవితం. సమాజంలో వారికంటూ ఓ స్టేటస్. అందుకే కాలు కదపకుండా కంప్యూటర్ ముందు చేసే ఐటీ ఉద్యోగమంటే ఓ క్రేజ్. అయితే, అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా! నిన్న మొన్నటి వరకు రెండు చేతులా సంపాదించిన ఐటీ ఉద్యోగులకు ఆర్ధిక మాంద్యం సెగ తగులుతోంది. లాభాలు లేవనే కారణంతో.. మాంద్యం వస్తుందన్న భయంతో బడా కంపెనీలైన గూగుల్ మైక్రోసాఫ్ట్, అమెజాన్,ట్విటర్, మెటా నుంచి చిన్న చిన్న స్టార్టప్స్ వరకు ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి. ఆ తొలగింపుల్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. శాలరీలు ఎక్కువ ఇస్తుంటే తగ్గించి ఉద్యోగుల్ని కొనసాగించవచ్చు కదా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఉన్న ఉద్యోగం ఊడింది. ఇప్పుడు కంపెనీ ఇచ్చిన పెన్నులు, మగ్గులు, మాస్కులు తప్ప ఇంక ఏం మిగల్లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓన్లీ ప్యాకేజీ.. నో బ్యాగేజీ అలా ఉద్యోగం కోల్పోయిన వారిలో శ్రద్దాజైన్ ఒకరు. నెటిజన్లకు అయ్యో శ్రద్దా జైన్‌గా సుపరిచితురాలైన ఆమె..ఉద్యోగుల తొలగింపులపై ఐటీ కంపెనీలపై వ్యంగ్యంగా సెటైర్లు వేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓన్లీ ప్యాకేజీ.. నో బ్యాగేజీ అంటూ చేసిన ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోను 20లక్షల మందికిపైగా వీక్షించారు. ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్షా గోయెంకా సైతం ఆ వీడియోను షేర్ చేశారు. తాజాగా, శ్రద్దా జైన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ తనని ‘అయ్యో’ అని పిలవడాన్ని సంతోషం వ్యక్తం చేస్తూ నెటిజన్లతో పంచుకుంది. అయ్యో శ్రద్దా జైన్ తమిళులు అయ్యో అనే పదాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ప్రతికూల పరిస్థితులు. లేదంటే ఏదైనా నష్టం, దుఃఖం, నిస్సహాయతను ఎదుటి వారితో వ్యక్తం చేసే సమయంలో ఆ పదాన్ని ఎక్కువగా చేర్చుతుంటారు. ఇక ఇన్ఫ్లుయెన్సర్ శ్రద్దా జైన్ ప్రస్తుత సమాజంలో అన్నీ అంశాలపై స్పందిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోల్లో ఎక్కువగా అయ్యో అనే పదం వాడుతుండటం. ఆమె పేరు ముందు అయ్యో అనే పదం నిక్ నేమ్‌గా మారింది. A laid off techie….this is so funny @AiyyoShraddha pic.twitter.com/uIlVwHeX21 — Harsh Goenka (@hvgoenka) January 30, 2023 -
రూ.1.46 లక్షల కోట్ల డిపాజిట్లు..43 కోట్ల ఖాతాలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీఐ) ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంకు అకౌంట్ల సంఖ్య 43 కోట్లకు చేరుకోగా డిపాజిట్ల మొత్తం రూ.1.46 లక్షల కోట్లున్నట్లు శనివారం కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది. సామాన్య ప్రజలకు బ్యాంకింగ్, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పింఛను వంటి ఆర్థిక సేవలు సులభంగా అందుబాటులో ఉండే లక్ష్యంతో 2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అనంతరం ఈ పథకాన్ని అదే ఏడాది ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభించారు. 2014లో ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంకు ఖాతాల సంఖ్య 17.90 కోట్లు కాగా, ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ నాటికి ఇవి 43.04 కోట్లకు పెరిగాయి. వీటిలో 55.47% అంటే, 23.87 కోట్ల ఖాతాలు మహిళలవే. మొత్తం ఖాతాల్లో 66.69% అంటే 28.70 కోట్ల ఖాతాలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారివేనని ఆర్థిక శాఖ పేర్కొంది. 43.04 కోట్ల ఖాతాల్లో 85.6% అంటే, 36.86 కోట్ల ఖాతాలు యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిలో సరాసరి డిపాజిట్ మొత్తం రూ.3,398గా ఉంది. అంతేకాదు, ఈ ఖాతాల్లో సరాసరి డిపాజిట్ మొత్తం పెరుగుతూ వస్తోందనీ, దీనర్థం వీటిని ప్రజలు వినియోగించుకుంటున్నారనీ, వారిలో పొదుపు అలవాటైందని ఆర్థిక శాఖ వివరించింది. ఈ అకౌంట్లు కలిగిన వారికి ప్రమాద బీమా మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచినట్లు తెలిపింది. ఇందుకోసం 31.23 కోట్ల రూపే కార్డులను జారీ చేసినట్లు తెలిపింది. జన్‌ధన్ యోజన అమలుతో దేశం అభివృద్ధి పథం ఒక్కసారిగా మారిపోయిందని పీఎంజేడీఐ ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. పారదర్శకతను పెంచిన ఈ పథకంతో కోట్లాదిమంది భారతీయులకు సాధికారిత, ఆర్థికపరమైన గౌరవం దక్కాయని తెలిపారు. చదవండి : నాణేల చెలామణీ..ప్రోత్సహకాల్ని పెంచిన ఆర్బీఐ -
బీహెచ్ ట్యాగ్: ఇక కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ అక్కర్లేదు
వ్యక్తిగత వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారత్ సిరీస్(బీహెచ్) కొత్త వాహనాలను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తీసుకెళ్లినప్పుడు..రిజిస్ట్రేషన్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంతకు ముందు వాహనాలు తీసుకెళ్లినప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ అవసరం ఉండేది. అయితే బీహెచ్ సిరీస్ ట్యాగ్ ఉన్న వాహనాలకు ఇకపై ఆ అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తాజా నొటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. రక్షణ సిబ్బంది, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలకు (PSU), నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న ప్రైవేట్ సెక్టార్ కంపెనీలకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్వచ్చందంగా వర్తించనుంది. ఈ పథకం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వ్యక్తిగత వాహనాల తరలింపునకు బీహెచ్ ట్యాగ్ దోహదపడుతుందని కేంద్రం చెబుతోంది. పద్నాలుగేళ్ల కాలపరిమితి తర్వాత మాత్రం.. క్రితం కంటే వసూలు చేసిన మోటర్ వెహికిల్ ట్యాక్స్‌లో సగం చొప్పున ప్రతీ ఏడాది వసూలు చేయనున్నట్లు నొటిఫికేషన్‌లో పేర్కొంది. చదవండి : మీరు పాత కారు కొనాలనుకుంటున్నారా ?! -
ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ
-
ఇదో ‘అనుభూతి’ బాణం!
మంత్రివర్గాల్లో మార్పులు, చేర్పులు సాధారణం. మొన్నటి కేంద్ర మంత్రివర్గ మార్పుచేర్పులు మాత్రం అసాధారణం. గడిచిన డెబ్బయ్యేళ్ల చరిత్రలో ఇంతటి భారీస్థాయి పునర్వ్య వస్థీకరణ దేశంలో ఎప్పుడూ జరగలేదు. పన్నెండుమందిని తొల గించి 36 మందిని కొత్తగా తీసుకున్నారు. కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య ప్రధానితో కలిపి 78కి చేరింది. యూపీఏ-2ను జంబో కేబినెట్‌గా బీజేపీ వాళ్లు ఆనాడు వెక్కిరించారు. ఇప్పుడు వారి మంత్రి మండలిలో అంతకంటే ఒక నెంబర్ పెరిగింది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నరేంద్ర మోదీ ‘పరిమిత ప్రభుత్వం-విస్తృత పరిపాలన’ తమ లక్ష్యమని చెప్పే వారు. అందుకు తగినట్టుగానే 2014లో తొలి కేబినెట్ కూర్పును తనతో సహా 46 మందితోనే సరిపెట్టారు. నిబంధనల ప్రకారం మంత్రిమండలి సంఖ్య 81 దాకా ఉండవచ్చు. కనుక ఇప్పటి ఈ జంబో కేబినెట్‌ను తప్పుపట్టవలసిన అవసరం ఏమీలేదు. కానీ ‘పరిమిత ప్రభుత్వం’ అనే సంకల్పం పరిధులు ఎందుకు విస్తరించవలసి వచ్చిందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ లేదా దాని నాయకత్వంలోని కూటమి మరోసారి గెలిచి ఢిల్లీ గద్దెనెక్కితే ఆ పార్టీ సుదీర్ఘ పరిపాలనా ప్రస్థానానికి వీలు చిక్కుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నామమాత్రావశిష్టంగా తయారైంది. మరో ఓటమిని నిభాయించుకోలేదు. పూర్తిగా శిథిలమైపోతుంది. ఆ శిథిలాల మీద మరో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్మాణానికి సమయం పడుతుంది. ఈలోపల గట్టిగా కుదురుకుంటే, ఏక బిగిన ఐదుసార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ రికార్డును తిరగ రాయవచ్చన్న ఆశ బీజేపీ నాయకత్వాన్ని సలుపుతున్నది. ఇంకోసారి గెలిస్తే నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ విజయాలనందించిన నాయకుడిగా మోదీ మెడలో ఓ వీరతాడు పడుతుంది. ఇందిరమ్మ నాలుగుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మూడు విజయాలనందించారు. కానీ వరుసగా కాదు. ఈ నేపథ్యంలో బీజేపీ, వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ ఒక అపురూప సన్నివేశపు అంచున నిలబడి ఉన్నారని భావించాలి. నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొడతారా? కాషాయ యుగపు పాంచజన్యం పూరిస్తారా? ఈ లక్ష్యసాధనకు గల అవకాశా లేమిటి? అడ్డంకులేమిటి? అనే విషయాలపై మేధోమథనం జరి గిన తర్వాతనే జంబో కేబినెట్ రంగప్రవేశం చేసిందనే అభి ప్రాయం కలుగుతున్నది. రాజకీయంగా చూస్తే ఇప్పటికీ మోదీకి దీటైన నాయకుడు ప్రతిపక్ష శిబిరంలో కనిపించడం లేదు. రెండేళ్ల కిందటితో పోలిస్తే రేటింగ్ కొంత తగ్గినప్పటికీ మోదీయే అగ్ర స్థానంలో కొనసాగుతున్నారని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఆయ నకు దరిదాపుల్లో కూడా మరో నాయకుడు లేడు. అయితే పరిపాలనాపరంగా ఆయన ప్రభుత్వానికి పడుతున్న మార్కు లెన్ని?. ప్రజల ఆర్థిక - ఆయురారోగ్య పరిస్థితులెట్లా వున్నాయి? రక్షణ-విదేశాంగ విధానాలు దేశ ప్రతిష్ట ఇనుమడించేవిధంగా ఉన్నాయా? ఉద్యోగ ఉపాధి రంగాలు యువతరంగాలతో జత గూడుతున్నాయా? వ్యవసాయం, పరిశ్రమలూ లాభదాయకం గానే ఉన్నాయా? ... ఇత్యాది అంశాలపై అలుముకునే ప్రజాభి ప్రాయమే మోదీ పాలనపై రేపటి తీర్పునకు కీలకం. ప్రజాభిప్రాయం ఎట్లా ఏర్పడుతుంది? ఒకటి ప్రత్యక్ష అనుభవం, రెండోది పరోక్షంగా కలిగే అనుభూతి. కరోనా పీక్ టైమ్‌లో ఇంటిల్లిపాదికీ సోకిందనుకోండి. ఒకరికో ఇద్దరికో సీరి యస్ అయింది. ఆస్పత్రిలో బెడ్ ఆలస్యంగా దొరికింది. ఆక్సిజన్ సిలిండర్ దొరకలేదు. ఒకరు చనిపోయారు. మోదీ ప్రభుత్వం పనితీరుపై ఆ కుటుంబ సభ్యులు అనుభవపూర్వకంగా చెబు తారు. కరోనా సమయంలో వైద్య ఆరోగ్యశాఖ సరిగ్గా పనిచేయ లేదు. ఇటువంటి అలక్ష్యాన్ని మోదీ అస్సలు సహించరు. ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ను పీకిపారేశారు. ఇది అనుభూతి. అనుభవం వ్యక్తిగతం. ఇది కూడిక లెక్కలతో పెరుగుతుంది. అనుభూతి సామూహికం. ఇది హెచ్చవేతలతో పెరుగుతుంది. కనుక చాలా సందర్భాల్లో వ్యక్తిగత అనుభవాల (experiences ) కంటే సామూహిక అనుభూతి (perception)ది పైచేయి అవు తుంది. ‘హర్ దర్ద్కో ఏకీ దవా (సర్వరోగనివారిణి) జిందా తిలి స్మాత్’ అనే మాటను పూర్వకాలం నుంచీ వింటున్నాము. ఆ మందును ఎప్పుడూ వాడకపోయినా, ఆ నినాదాన్నయితే నమ్ముతాము. అదీ అనుభూతి. మోదీ సర్కార్ పాలనలో ప్రజల వ్యక్తిగత దైనందిన జీవితానుభవాలు ఎట్లా ఉన్నా... సామూహి కంగా ఒక పాజిటివ్ అనుభూతిని ఉత్పత్తి చేయడం సంఘ్ పరివార్ మేథోవర్గం ముందున్న తక్షణ కర్తవ్యం. ఆ కార్యక్రమంలో తొలిదశ మొన్న జంబో కేబినెట్ ఏర్పాటుతో పూర్తవుతుంది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన వారిలో రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, రమేశ్ పోఖ్రియాల్, డాక్టర్ హర్ష వర్ధన్, సదానందగౌడ వంటి సీనియర్లు ఉండటం కొంత ఆశ్చ ర్యాన్ని కలిగించింది. కీలక శాఖల్లోని వైఫల్యాలకు కొందరు వ్యక్తులను బాధ్యులుగా చేయడం ద్వారా ప్రభుత్వ ఇమేజ్ను కాపాడుకునే ప్రయత్నంగా ఈ చర్య ఉన్నదనే అభిప్రాయం విన బడుతున్నది. ఈ పునర్వ్యవస్థీకరణ తర్వాత గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో పనిచేసిన వారిలో రాజ్‌నాథ్, నఖ్వీ ఇద్దరే మిగిలారు. ఇది వాజ్‌పేయి నీడ కూడా లేని అచ్చమైన మోదీ కేబినెట్. వైఫల్యాలను కడిగేసుకోవడంతోపాటు సామాజిక మార్పు సంకేతాలను కూడా ఈ పునర్వ్యవస్థీకరణ బలంగా ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ తొలిరోజుల్లో ‘జనసంఘ్’గా ఉన్న ప్పుడు దానిపై బ్రాహ్మణ్-బనియా (వైశ్య) ముద్ర ఉండేది. ఎమర్జెన్సీ సమయంలో జనతా పార్టీలో విలీనం కావడం, అందులో చేరిన నానాజాతి సభ్యుల్లోని తటస్థ వర్గాలను తన గూటికి ఆకర్షించి బీజేపీ పేరుతో పునరుత్థానమవడం వెనుక వాజ్‌పేయి, అడ్వాణీల వ్యూహరచనా చాతుర్యం కనిపిస్తుంది. ఈ వ్యూహం ఆరెస్సెస్ ఆలోచన కూడా కావచ్చు. అనంతర కాలంలో రామ మందిర ఉద్యమం ద్వారా ఉత్తరాదిలోని వెనుకబడిన వర్గాలనూ, గిరిజనులను పెద్దఎత్తున బీజేపీ సమీకరించుకోగలిగింది. పార్టీ సామాజిక పొందికను విస్తృతం చేసే పనిని మోదీ మరింత వేగవంతం చేశారు. ప్రధానితో సహా 78 మంది సభ్యులున్న మంత్రి మండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంఖ్య 52. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఇంత ఎక్కువమంది బలహీనవర్గాల ప్రతినిధులున్న కేంద్ర మంత్రి వర్గం ఇదే కావచ్చు. ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఆయా వర్గాల పాజిటివ్ అనుభూతిని మోదీ ప్రభుత్వం ఆశిస్తున్నదని చెప్ప వచ్చు. కేంద్ర మంత్రిమండళ్లలో సహాయ మంత్రుల పాత్ర నామమాత్రం. అధికారాన్ని చలాయించే కేబినెట్ మంత్రులు ఇప్పుడు ప్రధానితో కలిపి 31 మంది ఉన్నారు. వీరిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నీ కలిపితే 11 మంది. ఇరవైమంది హిందూ అగ్రవర్ణాల వారు. వారిలో ఆరుగురు బ్రాహ్మణులు. ఐదుగురు రాజ్‌పుత్‌లు. ఇద్దరు బనియాలు, ఇద్దరు పాటీదార్లు (పటేల్), ఒకరు రెడ్డి. ఒకరు భూమిహార్, ఒకరు మల్హోత్రా. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా కేబినెట్ కూర్పును ఖరారు చేసినట్టు స్పష్టంగా కనిపి స్తున్నది. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు పెద్దపీట వేశారు. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి ప్రతిష్టాత్మకం. ఎక్కువ లోక్‌సభ సీట్లున్న యూపీ నుంచి ఏడుగురిని కొత్తగా తీసుకున్నారు. వీరిలో ఎక్కు వమంది యాదవేతర బీసీలు. ఇక్కడ బీజేపీకి ప్రధాన పోటీ దారు అఖిలేశ్ సింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ. ఈ పార్టీ నుంచి నాన్-యాదవ్ బీసీలను దూరం చేయడం ద్వారా యాదవ-ముస్లిం వర్గాలకే సమాజ్‌వాది పార్టీని పరి మితం చేసే లక్ష్యం ఈ వ్యూహంలో కనిపిస్తున్నది. యాదవుల తర్వాత ప్రధాన బీసీ కులమైన కుర్మీ వర్గానికి చెందిన అనుప్రియా పటేల్ (అప్నాదళ్)కు రెండేళ్ల తర్వాత మళ్లీ పదవీయోగం పట్టింది. ఉత్తరాఖండ్‌పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఐదు ఎంపీ సీట్లున్న చిన్న రాష్ట్రం అది. ఇక్కడ ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే మరోసారి బీజేపీ గెలవడం ఆనవాయితీ. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. గుజరాత్ గెలుపు పట్ల బీజేపీలో పెద్దగా అనుమానాల్లేవు. ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రిని దృష్టిలో పెట్టుకునే జనం ఓట్లేస్తారని ఆ పార్టీ విశ్వాసం. అయినా ఛాన్స్ తీసుకోకుండా రాష్ట్రంలో బలీయమైన సామాజిక వర్గంగా ఉన్న పాటీదార్ల (పటేళ్లు)కు రెండు కేబినెట్ బెర్తులు కేటాయించారు. పంజాబ్‌ను అంతగా పట్టించుకోలేదు. రైతుల ఆందోళన తర్వాత పంజాబ్ మీద బీజేపీ పూర్తిగా ఆశలు వదులుకున్నది. పంజాబ్ నుంచి ఒక్క జాట్ సిక్కుకూ స్థానం దొరకని మొట్టమొదటి కేంద్ర మంత్రిమండలి ఇదే. ఈ రాష్ట్రానికి చెందిన హర్దీప్సింగ్ పూరీ అనే ఖత్రీ కులానికి చెందిన సిక్కు కేబినెట్లో ఉన్నారు. రాష్ట్రంలో జాట్ సిక్కుల జనాభా 30 శాతం దాకా ఉంటుంది. దళితుల జనాభా మరో 30 శాతం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కూ, లెఫ్ట్, బీఎస్పీలతో కూడిన అకాలీదళ్ కూటమికీ మధ్యనే ప్రధానంగా పోటీ జరగబోతున్నది. పటియాలా రాజవంశస్థు డైన కెప్టెన్ అమరీందర్‌సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గానే ఉందన్న అభిప్రాయం ఉన్నది. యువకులు, విద్యావంతుల అనుభూతిని కూడా ప్రభా వితం చేసే అంశాలకు కేబినెట్ పొందికలో వీలు కల్పించారు. కేంద్ర మంత్రుల సగటు వయసు 58కి తగ్గింది. రాజకీయ రంగంలో ఇది యూత్ కిందే లెక్క. అట్లాగే మాజీ ఐఏఎస్ అధికారులకు, టెక్నోక్రాట్లకు, డాక్టర్లకు, లాయర్లకు అవకాశం లభించింది. అశ్వినీ కుమార్ వైష్ణవ్ మాజీ ఐఏఎస్ అధికారి. ఆయనకిప్పుడు కేబినెట్ హోదా వచ్చింది. వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ చేశారు. కాన్పూర్ ఐఐటీలో ఎమ్‌టెక్ చేశారు. అక్కడ ఆయన స్పెషలైజేషన్ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్ షిప్ మీద. ఆయనకిప్పుడు రైల్వే శాఖ లభించడం వెనుక లక్ష్యం సుస్పష్టమే. భారతీయ రైల్వేలు ఇక పీపీపీ పట్టాలెక్కబోతు న్నాయి. మరో ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్‌సింగ్‌కు ప్రమోషన్ లభించి కేబినెట్ మంత్రయ్యారు. బీజేపీ ప్రజా పునాదులను విస్తృతం చేసిన అడ్వాణీ రథయాత్ర జరుగుతున్నప్పుడు రాజ్ కుమార్‌సింగ్ బిహార్ కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్. అప్పుడు ముఖ్య మంత్రిగా ఉన్న లాలూయాదవ్ జిల్లా కలెక్టర్‌కూ, ఎస్పీకి చెప్ప కుండా రాజ్‌కుమార్‌కు అదనపు మేజిస్ట్రేట్ హోదా కల్పిస్తూ ప్రత్యేక ఆదేశాలిచ్చి ఈయన ద్వారానే అడ్వాణీని అరెస్ట్ చేయిం చారని చెబుతారు. అడ్వాణీని అరెస్ట్ చేసిన అధికారి అదే బీజేపీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి కావడం విధివిలాసమేమో! కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన రాజీవ్ చంద్రశేఖర్ ఇలినాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఎమ్‌టెక్ పట్టా పొందారు. ఆయనకిప్పుడు ఐటీ సహాయమంత్రి పదవి లభించింది. బీపీఎల్ టెలికామ్ కంపెనీని ఈయనే స్థాపించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కార్యక్ర మాన్ని ఈయన పర్యవేక్షించనున్నారు. మంత్రిమండలిలో మహి ళల సంఖ్య కూడా 11కు పెరిగింది. అందుబాటులో ఉన్న వివ రాల మేరకు ఇప్పటివరకు ఇదే పెద్ద సంఖ్య. మంత్రిమండలి కూర్పులోని సానుకూలాంశాలను ప్రచారం చేసుకోవడం ద్వారా లబ్ధిపొందాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ పైపూతల వల్ల లోతైన గాయాలు (ఉంటే) ఏమేరకు మాను తాయో చూడాలి. కీలక మంత్రులను తప్పించినంత మాత్రాన వైఫల్యాలను కప్పిపుచ్చుకోగలగడం సాధ్యమేనా? ఈ అంశం మీద ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ ఎమ్మెల్యే, యువ దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ‘‘ఖరాబీ ఇంజిన్ మే హై, ఔర్ బద్లే డిబ్బే జారహే హై’’. సమస్య ఇంజన్లో ఉంటే డబ్బాలను మారుస్తున్నారట. ఈ రైలు కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటే మాత్రం జిగ్నేష్ చేసిన కామెంట్ తప్పవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘ఇందూరుకు నిజామాబాద్ పేరు అరిష్టం’
సాక్షి, నిజామాబాద్: ఇందూరుకు నిజామాబాద్ పేరు ఉండటం అరిష్టమని ఎంపీ అర్వింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే దేశానికి ప్రధాని మోదీ అవసరమని అన్నారు. తన తండ్రి, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ప్రధాని మోదీ నాయకత్వానన్న బలపరిచే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన అన్నారు. తనను నమ్మి బీజేపీలో చేరుతున్న డీఎస్ అనుచర వర్గానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తొలుత తాను బీజేపీలో చేరతానంటే వద్దన్న మా నాన్న ఇప్పుడు తన నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆయన బీజేపీ కండువా కప్పకొనే యోచనలో ఉన్నారని, పెద్దాయన కాబట్టి బయటపడట్లేదని వెల్లడించారు. జిల్లాకు నిజామాబాద్ పేరు ఉండటాన్ని ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారన్నారు. పేరులో నిజాం ఉండటం వల్ల నిజాంసాగర్ నిండటం లేదని, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ మూత పడిందని, నిజామాబాద్ రైతులు బాగుపడటం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీగా మిగిలిపోయిందని, దిశానిర్దేశం చేసే నాయకుడు లేకుండా పోయారని ఆయన ఎద్దేవా చేశారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిన ప్రధాని....దేశంలో కామన్ సివిల్ కోడ్ (సీసీసీ)ను తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ నాయకులందరూ ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉండి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని బల్దియాలపైనా కాషాయజెండా ఎగుర వేసేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘మోదీని ఆ దేవుడు కూడా కాపాడలేడు’
కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఓటమి తథ్యమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అన్నారు. ఓటమి నుంచి ఆయనను దేవుడు కూడా కాపాడలేడని వ్యాఖ్యానించారు. టీఎంసీ తరఫున ఎన్నికల బరిలో దిగిన అభిషేక్ డైమండ్ హార్బర్ నియోజవర్గం నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ...‘ ఈ ఎన్నికల్లో ఓడిపోకుండా ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేవుడు కూడా రక్షించలేడు. ఆయనను అలాగే ధ్యానం చేసుకోనివ్వండి. బెంగాల్‌లోని 42 లోక్‌సభ సీట్లు గెలిచి క్లీన్‌స్వీప్ చేస్తామనే నమ్మకం ఉంది. మతతత్త్వ పార్టీ అయిన బీజేపీని తరిమికొట్టాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు’ అని పేర్కొన్నారు. కాగా ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ తన ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడారంటూ అభిషేక్ ఆయనకు పరువు నష్టం నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. డైమండ్ హార్బర్లో అభిషేక్‌పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి నీలాంజన్ రాయ్‌కు మద్దతుగా మే 15న మోదీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్లో డెమోక్రసీ గూండాక్రసీగా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఎంసీ గూండాలు మమత, అభిషేక్ ప్రజల జీవితాలను నరకప్రాయం చేశారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు 36 గంటల్లోగా మోదీ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో తన లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. -
చౌకీదార్ కోసం నేపాల్‌కు వెళ్తా..కానీ
అహ్మదాబాద్ : సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు చేపట్టిన మై బీ చౌకీదార్ ఉద్యమంపై కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశాన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రధాన మంత్రి మాత్రమే ఉండాలని కోరుకుంటానే తప్ప చౌకీదార్లను కాదని ఆయన ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు దేశ వ్యాప్తంగా మూడో విడత పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుజరాత్‌లోని సురేంద్రనగర్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో హార్దిక్ పటేల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ నాకు చౌకీదార్(వాచ్మెన్) అవసరం ఉంటే... నేను నేపాల్‌కు వెళ్తాను. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే, యువతకు విద్య, ఉపాధి కల్పించి దేశాన్ని దృఢంగా మార్చే ప్రధాని ఉండాలని కోరుకుంటాను. ప్రస్తుతం నాకు కావాల్సింది ప్రధాని మాత్రమే. చౌకీదార్ కాదు అంటూ హార్దిక్ పటేల్ నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఆఖరికి ఆమె కూడా పోటీ చేస్తుంది.. నేనే.. ‘ నేను అస్సలు సంతోషంగా లేను. ఆఖరికి సాధ్వీ ప్రగ్యా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేను మాత్రం అనర్హుడినయ్యాను. ఇది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తోంది. అసలు ఇలా జరగాల్సింది కాదు అంటూ హార్దిక్ పటేల్ అసహనం వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మాలేగావ్ పేలుళ్ల కేసుతో సంబంధం ఉన్న సాధ్విని బీజేపీ భోపాల్‌లో పోటీకి దింపడాన్ని విమర్శించారు. తమను మోసం చేస్తున్న బీజేపీకి ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెబుతారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన గుజరాత్లో బీజేపీ ఇప్పుడు 10 నుంచి 12 సీట్లు మాత్రమే గెలుస్తుందని జోస్యం చెప్పారు. కాగా 2015లో పటీదార్ రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా జరిగిన దాడి వెనుక హార్దిక్ ప్రోద్బలం ఉందంటూ నమోదైన కేసులో విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. హార్దిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను కొట్టేసిన కోర్టు.. దోషిత్వాన్ని అలాగే ఉంచింది. మార్చిలో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్.. జామ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన వ్యక్తి(దోషిత్వంపై న్యాయస్థానం స్టే ఇవ్వని పరిస్థితుల్లో) ఎన్నికల్లో పోటీకి అనర్హుడుగా పరిగణిస్తారన్న సంగతి తెలిసిందే. దీంతో హార్ధిక్ ఆశలు ఆవిరయ్యాయి. -
సునామీ...ఇక ఎన్నికలుండవ్!
బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాటల్లేవు ..మాట్లాడు కోల్లేవు అన్నరీతిలో 2019 ఎన్నికల తర్వాత ఇక దేశంలో ఎన్నికలే ఉండవంటూ జోస్యం చెప్పారు. 2014లో మొదలైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా 2019నాటికి సునామిలా మారిపోయింది.. దీంతో ఈ ఎన్నికల్లో ముందుకంటే మెరుగైన ఫలితాలుంటాయి. ఇక మోదీని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని ఆయన వ్యాఖ్యానించారు 2019లో 'మోదీ సునామీ' నేపథ్యంలో దేశంలో ఇక ఎన్నికలు జరగవు. 2024లో ఎన్నికలుండవని తాను భావిస్తున్నానన్నారు. శుక్రవారం నిర్వహించిన ఒక పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ తాము పూర్తి నిజాయితీతో దేశంకోసం పోరాడుతున్నామని సాక్షిపేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఓడించేందుకు చాలామంది చాలారకాల ఎత్తులు వేస్తున్నారు.. మోదీ ఉంటేనే దేశం ( మోదీ హైతో దేశ్ హై) అని దేశంలోని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంకగాంధీని రంగంలోకి దింపినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా మోదీ సునామీని అడ్డుకోవడం వారి తరం కాదని వ్యాఖ్యానించారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకగాంధీ వాద్రాను కాంగ్రెస్ నియమించింది. అలాగే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ బిజెపిని ఓడించే లక్ష్యంతో ముందస్తు ఎన్నికల పొత్తులో ప్రవేశించిన సంగతి తెలిసిందే. -
ఏది రాజకీయం, ఏది కుట్ర?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘బహుత్ హువా నారి పర్ వార్ (మహిళలపై జరిగిన అత్యాచారాలు ఇక చాలు)’ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ముఖ్య నినాదాల్లో ఒకటి. ఇప్పుడు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడుతున్న బీజేపీని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఎంజె అక్బర్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ ఆరోపణలన్నీ తనపై జరుగుతున్న రాజకీయ కుట్రగా అక్బర్ అభివర్ణించారు. పరువు నష్టం కేసు వేయాలని కూడా నిర్ణయించారు. ఎంత హాస్యాస్పదం! మీడియా మాజీ ఎడిటరైన అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 14 మంది మహిళలు. వారిలో 18 ఏళ్ల యువతి కూడా ఉంది. పైగా వారంతా జర్నలిస్టులు. ప్రియా రమాని, ఘజాల వాహబ్, సబా నక్వీ, మజ్లీ డే పుయ్ కాంప్, శుమా రహా, హరిందర్ బవేజా, శుతాప పాల్, సుపర్ణ శర్మ, అంజు భారతి, మాలిని భూప్తా, కాదంబరి వాడే, కనిక గహ్లాట్, రుత్ డేవిడ్, ప్రేరణ బింద్రా అక్బర్‌పై ఆరోపణలు చేశారు. వారిలో కొందరు తమపై లైంగిక దాడి జరిపినట్లు చెప్పగా, లైంగిక దాడులకు ప్రయత్నించినట్లు మిగతా వారు ఆరోపించారు. పేర్లను బట్టి చూస్తే వారంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారని తెలుస్తోంది. వారంతా కలిసి ఎలాంటి ప్రజా పలుకబడి పునాదులు లేకుండా రాజ్యసభ ద్వారా మంత్రి అయిన అక్బర్‌పై రాజకీయ కుట్ర పన్నుతారా? ఎంత హాస్యాస్పదం! బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఎంజె అక్బర్‌పై వచ్చిన ఆరోణలపై బీజేపీ నేతలు పలు విధాలుగా స్పందించారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని సుబ్రమణియన్ స్వామి అన్నారు. అది ఆయనకు, ఆరోపణలు చేసిన వారికి సంబంధించిన సమస్య, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి ఉమా భారతి వ్యాఖ్యానించారు. లైంగిక ఆరోపణలను చేస్తున్న మహిళలను లక్ష్యంగా పెట్టుకోరాదని, అయితే అక్బర్ గురించి మాట్లాడే స్థానంలో తాను లేనని మరో మహిళా కేంద్ర మంత్రి స్మతి ఇరానీ అన్నారు. లైంగిక ఆరోపణలు చేస్తున్న వారిని తాను నమ్ముతున్నానని, ప్రతి ఫిర్యాది వెనకనుండే బాధను, వ్యధను తాను అర్థం చేసుకోగలనంటూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్పందించారు. ‘మీటూ’ ఆరోపణలన్నింటిని విచారించేందుకు సీనియర్ జుడీషియల్, లీగల్ వ్యక్తులతోని ఓ కమిటీ వేయాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు ఆమె చెప్పారు. (చదవండి : మీటూ సంచలనం : ఎంజే అక్బర్‌పై లైంగిక ఆరోపణలు) మరోసారి వేధించే అవకాశం ఉంది! అయితే లైంగిక ఆరోపణలు చేసిన మహిళల సమ్మతి ఉన్న కేసుల్లోనే విచారణ జరపాలని రుత్ మనోరమా, అమ్మూ జోసఫ్, గీత లాంటి మహిళా సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. ఎప్పుడో జరిగిన ఇలాంటి సంఘటలనకు సంబంధించి సరైన ఆధారాలు లభించక పోవచ్చని అలాంటి సందర్భాల్లో విచారణ నుంచి బయటపడే మగవాళ్లు ఫిర్యాదుదారులను వేధించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విచారణ కమిటీలకన్నా మహిళల హక్కులను గౌరవించేలా మగవాళ్ల మనస్తత్వాన్ని మార్చే వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ‘బేటీ బచావో బేటీ పడావో’ నినాదంతోపాటు మహిళలపై జరగుతున్న అన్యాయాలను ఏ నాగరిక ప్రపంచం సహించదంటూ పదే పదే మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గం నుంచి అక్బర్‌ను తొలగించక పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో?! -
‘అసోం’లో అసలు ఏం జరుగుతోంది?
సాక్షి, న్యూఢిల్లీ : అసోం అంతటా చీమ చిటుక్కుమన్న స్పందించేందుకు పారా మిలటరీ సైనిక దళాలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 200 కంపెనీల మిలటరీ దళాలు పహారా గాస్తున్నాయి. సరిహద్దు రాష్ట్రాలు కూడా అప్రమత్తమై సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేశాయి. 1983లో జరిగిన ‘నిల్లీ మారణకాండ’, 2012లో జరిగిన ‘కొక్రాజర్ మారణకాండ’లు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకొని ఉండవచ్చు. నిల్లీ మారణకాండలో 2,191 మంది, కొక్రాజర్ మారణకాండలో 77 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది బెంగాలీ ముస్లింలే ఉన్నారు. నాటి మారణకాండలకు, నేటి అసాధారణ భద్రతకు కారణాలు ఏమిటీ ? అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటీ? 40 లక్షల మంది ప్రజల పేర్లు గల్లంతు భారత పౌరులను గుర్తించే ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ సోమవారం ఉదయం పది గంటలకు అసోం పౌరులపై తన నివేదికను వెల్లడించింది. అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వారిలో 2,89,88,677 మంది ప్రజలను మాత్రమే భారత పౌరులుగా గుర్తించింది. మిగతా దాదాపు 40 లక్షల మందిని గుర్తించలేదు. అంటే వారు విదేశీయులన్న మాట. వారిలో ఎక్కువ మంది ముస్లింలు, వారిలో కూడా బెంగాలీ మాట్లాడే ముస్లింలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పౌర జాబితాలో పేరు దక్కని ఈ 40 లక్షల మంది ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం కావచ్చని, వారిలో వేల మందైనా విధ్వంసానికి పాల్పడవచ్చన్న భయాందోళనల మధ్య అసాధారణ భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకు ఆందోళన? ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు వలసవచ్చిన విదేశీయులకు వెళుతున్నాయని, స్థానికులైన తమకు రావడం లేదని 1950వ దశకం నుంచే ‘సన్స్ ఆఫ్ సాయిల్’గా పిలుచుకునే 34 శాతం జనాభా కలిగిన అస్సామీ భాష మాట్లాడే అస్సామీలు ఆందోళన చేస్తున్నారు. తమ వెనకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని వలసదారులు తమ విలువైన భూములను కొల్లగొడుతున్నారంటూ 1960వ దశకం నుంచి ఆందోళన తీవ్రం చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలతోపాటు బంగ్లాదేశ్ యుద్ధానంతరం ఆ దేశీయులు అసోంలోకి వలస వచ్చారు. వాస్తవానికి బంగ్లా దేశీయులకన్నా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముస్లింలే అసోంలో ఎక్కువ ఉన్నారని పలు స్వచ్ఛంద సంస్థలు తమ అధ్యయనాల్లో తెలిపాయి. మణిపూర్ నుంచి వలసవచ్చిన వారు కూడా స్థానికంగా భూములు కొనుక్కొని స్థిరపడ్డారని ఆ సంస్థలు వెల్లడించాయి. పెరిగిన ముస్లింల జనాభా వలసలు ఎక్కడి నుంచి అన్న ప్రశ్నను పక్కన పెడితే రాష్ట్రంలో హిందువులకన్నా ముస్లింల జనాభా శాతం పెరుగుతూ వచ్చింది. వారిప్పుడు మెజారిటీ స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ శక్తులు ఆందోళనల్లో భాగంగా ముస్లింలకు వ్యతిరేకంగా అస్సామీలను రెచ్చ గొడుతూ వచ్చారు. ఆ పర్యవసానంగానే నిల్లీ మారణకాండ, కొక్రాజర్ మారణకాండలు జరిగాయి. ఈ రెండు ఘటనల్లో కూడా ఆరెస్సెస్ నాయకులు అరెస్ట్ అవడం గమనార్హం. హిందువులైనా, ముస్లింలు అయినా తమకు సంబంధం లేదని, విదేశీయులందరిని తమ రాష్ట్రం నుంచి పంపించాలని స్థానిక అస్సామీలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాల తాత్సారం ఓటు బ్యాంకు రాజకీయాలకు విలువనిచ్చే వరుస ప్రభుత్వాలు తాత్సారం చేస్తు రావడంతో సమస్య జటిలమవుతూ వచ్చింది. అఖిల అసోం విద్యార్థుల సంఘం 1979 నుంచి ఆందోళనను తమ చేతుల్లోకి తీసుకొని నడిపించింది. సమ్మెలు, దిగ్బంధనాలు, సహాయ నిరాకరణ వంటి వివిధ రీతుల్లో కొనసాగిన ఆందోళనలో విధ్వంసాలు, ప్రభుత్వ పతనాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి పాలనలో కూడా పౌర జీవితం స్తంభించిపోయింది. ఆరు సుదీర్ఘ సంవత్సరాల ఆందోళన అనంతరం 1985లో అప్పటి కేంద్రంలోని రాజీవ్ ప్రభుత్వం దిగివచ్చి అస్సాం ఆందోళనకారులతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం1951 నుంచి 1961 లోపు వచ్చిన బంగ్లాదేశీయులకు భారత పౌరసత్వం కల్పించాలి. 1971 తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపించాలి. 1961 నుంచి 1971 మధ్యన వలసవచ్చిన వారికి ఓటింగ్ హక్కు మినహా అన్ని పౌర హక్కులు ఉంటాయి. నాటి ఒప్పందంలో 90 శాతం అంశాలు కూడా ఇప్పటికి అమలు కాలేదన్నది ఉద్యమకారుల ఆరోపణ. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కారం దిశగా చర్యలకు ఉపక్రమించింది. 1985 అస్సాం ఒప్పందంలోని అంశాలను మార్గదర్శకంగా తీసుకొని పౌరులను గుర్తించాల్సిందిగా కోరుతూ 2015లో ఓ ఉన్నతాధికార కమిటీని వేసింది. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి ఒక్క రోజు ముందు అంటే, 1971, మార్చి 24వ తేదీ అర్థరాత్రి తర్వాత భారత్‌కు వచ్చిన విదేశీయులందరిని విదేశీయులుగా పరిగణించాలని కమిటీకి కేంద్రం నిర్దేశించింది. దీంతో విదేశాల నుంచి వలస వచ్చిన హిందువులను కాకుండా ముస్లింలనే వెనక్కి పంపించాలంటూ ఆరెస్సెస్ అధినేతలు బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. హిందువులకు అనుకూలంగా చట్టం ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం 2016లో ‘సిటిజెన్షిప్ (అమెండ్మెంట్)బిల్’ను తీసుకొచ్చింది. అందులో బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం ఇచ్చేలా సవరణలు తీసుకొచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కూడా అస్సామీలు చేస్తున్న ఆందోళనను పట్టించుకోకుండా ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ అసోంలోని భారత పౌరుల జాబితాను ఈ రోజు విడుదల చేసింది. పౌరులుగా గుర్తించడంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, ఆధార్ కార్డులు కూడా ఉన్న బెంగాలీ ముస్లింలను గుర్తించలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇది తమ రాష్ట్రంలో చిచ్చు పెట్టవచ్చని, అశాంతి పరిస్థితులకు దారితీయవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌తో పరస్పర దేశ పౌరుల మార్పిడి ఒప్పందం లేనందున ఆ దేశీయులను వెనక్కి పంపించడం సాధ్యం కాదు. అందుకనే దేశంలోని శరణార్థుల శిబిరాలకు వారిని పంపిస్తామని కేంద్రం చెబుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఓటు బ్యాంకు రాజకీయాలకు ఓ లెక్కుంటుంది. -
‘లోఫర్లే అలా చేస్తారు’
పనాజి : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరుపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోదీని కౌగిలించుకోవడం, అనంతరం తన సీట్లో కూర్చుని కన్నుగీటడం వంటి చర్యల ద్వారా రాహుల్ సభా మర్యాదను మంటగలిపారని బీజేపీ నేతలు విరుచుకు పడిన విషయం తెలిసిందే. తాజాగా గోవా బీజేపీ అధికార ప్రతినిధి దత్తప్రసాద్ నాయక్ రాహుల్ గాంధీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. భారత ప్రజల సమస్యలను, కష్టాలను అర్థం చేసుకోలేని వ్యక్తే ఇలా ప్రవర్తిస్తారంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కొలువుదీరిన పవిత్రమైన ఆలయం(పార్లమెంటు)లో రాహుల్ చేసిన పనులు చాలా అవమానకర రీతిలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీల్లో, రోడ్లపై అమ్మాయిలను ఏడిపించే లోఫర్లే ఇలా కన్నుగీటుతారని, రాహుల్ కూడా సభలో ఓ లోఫర్ లాగే వ్యవహరించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీ కుటుంబం చేతుల్లో తోలుబొమ్మల్లా మారిన కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్లు చెప్పినట్టల్లా ఆడుతున్నారని విమర్శించారు. కాగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్.. బీజేపీ, మిత్ర పక్షాల చేతిలో తోలుబొమ్మగా మారడం వల్లే రాష్ట్రంలో ఫిష్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయంటూ కాంగ్రెస్ నేత చోదంకర్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే దత్తప్రసాద్ నాయక్ రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. -
ప్రధాని మోదీని కలసిన వనజీవి రామయ్య
ఖమ్మంరూరల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో శుక్రవారం జరిగిన ఎట్‌హోం, రిపబ్లిక్ వేడుకల్లో ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి అందిన ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన రామయ్య ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలను కలుసుకున్నారు. -
సల్మాన్, కమల్, ప్రియాంకలకు మోడీ ఛాలెంజ్!
న్యూఢిల్లీ : ఐస్ బక్కెట్ ఛాలెంజ్.... ఇప్పుడు స్వచ్ఛ భారత్‌కు కూడా పాకింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...తొమ్మిదిమంది సెలెబ్రెటీలకు సవాల్ విసిరారు. బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్యంలో పాల్గొనాలని ఆయన ఆ తొమ్మిదిమందికి ఆహ్వానం పలికారు. . స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆ తొమ్మిది మంది స్వచ్ఛ భారత్‌లో పాల్గొని...వారి మరో తొమ్మిదిమందికి ఆహ్వానం పలకాలని కోరారు. మోడీ ఆహ్వానం పలికినవారిలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రా, శశిథరూర్, సచిన్ టెండుల్కర్, కమల్ హాసన్, తారక్ మెహతా, అనీల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు. కాగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పాల్గొన్నాడు. -
పాత అలవాట్లు మానుకోవటం కష్టమే...అయితే
న్యూఢిల్లీ : దేశంలో ఉన్న పరిస్థితులను మహాత్మా గాంధీ కళ్లద్దాల ద్వారా చూస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా గురువారమిక్కడ మాట్లాడుతూ మహాత్మాగాంధీ పరిశుభ్ర భారత్ నినాదానికి పిలుపు ఇచ్చారన్నారు. అయితే ఆ నినాదం ఇప్పటికీ అసంపూర్తిగా ఉండిపోయిందన్నారు. బాపూజీ ఆశయ సాధన కోసం మనమంతా చేయాల్సింది ఒక అడుగు ముందుకు వేయటమేనని మోడీ పిలుపునిచ్చారు. భారతీయులంతా కలిసికట్టుగా పనిచేసి ఒక ప్రేరణాత్మక వాతావరణాన్ని సృష్టించాలన్నారు. మనమంతా దేశభక్తితో ఇది చేయాలే కానీ...రాజకీయ ఉద్దేశంతో కాదని ఆయన అన్నారు. సర్పంచ్ల ప్రోత్సాహంతో వందశాతం పరిశుభ్రతంగా మారిన గ్రామాలను అనేకం తాను చూశానన్నారు. పరిశుభ్రత కేవలం సఫాయి కార్మికులదేనా అని మోడీ ప్రశ్నించారు. 125 కోట్ల భారతీయులు ఇక భారతమాతను మురికిగా ఉండాలని అనుకోరని ఆయన అన్నారు. పాత అలవాట్లను మానుకోవటం కొంచెం కష్టమే అని అయితే అందుకు మనకు ఇంకా 2019 వరకూ సమయం ఉందని మోడీ అన్నారు. చెత్త ఉన్న ప్రాంతం ఫోటో తీయండి, ఆ తర్వాత వాటిని శుభ్రం చేశాక ఫోటో తీసి నెట్ లో పెట్టాలని మోడీ అన్నారు. మార్స్ మిషన్ పూర్తి చేసింది ప్రధాని, మంత్రులు కాదని, భరతమాత బిడ్డలని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో అంగారకుడిపై మార్స్‌ను ప్రయోగించిన మనం దేశాన్ని శుభ్రం చేసుకోలేమా అని ప్రశ్నించారు. బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత కార్యక్రమంలో తాను తొమ్మిదిమంది పాల్గొనాలని పిలుపునిచ్చానని...వారు మరో తొమ్మిది మందికి ఆహ్వానం పంపాలని మోడీ కోరారు. అపరిశుభ్రత వల్ల వచ్చే రోగాలకు కుటుంబం ఏటా ఆరువేలు ఖర్చు పెడుతుందని మోడీ గుర్తు చేశారు. పరిశ్రుభతను పాటిస్తే ఆ ఆరువేలు ఆదా చేసినవారు అవుతారన్నారు. అనంతరం ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు.