బెంగళూరు యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ ‘ఏరో ఇండియా 2023’ షోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ‘ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’ అనే నినాదంతో ఐదురోజుల పాటు ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన జరగనుంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు.
ఈ ఎయిర్‌షోలో భాగంగా అన్నీ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వారిలో లే ఆఫ్ ఐటీ ఉద్యోగి, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయ‍్యో శ్రద్దా జైన్ ఉన్నారు. మోదీ తనని చూసి ‘అయ్యో’ అని పిలిచారని అన్నారు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.మోదీకి కృతజ్ఞతలు’ అంటూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో తెగ చక్కెర్లు కొడుతున్నారు. ఇంతకీ ఈ శ్రద్దా జైన్ ఎవరు? మోదీ ఆమెను చూసి అయ్యో అని ఎందుకు పిలిచారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
(ఇదీ చదవండి: Mass Layoffs "ఓన్లీ ప్యాకేజ్, నో బ్యాగేజీ" ఉద్యోగ కోతలపై మామూలు చురకలు కాదు! వైరల్ వీడియో)
ఆర్ధిక మాంద్యం సెగ తగులుతోంది
ఐటీ ఉద్యోగి అంటే లగ్జరీ లైఫ్. కావాల్సినంత జీతంతో కోరుకున్న జీవితం. సమాజంలో వారికంటూ ఓ స్టేటస్. అందుకే కాలు కదపకుండా కంప్యూటర్ ముందు చేసే ఐటీ ఉద్యోగమంటే ఓ క్రేజ్. అయితే, అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా! నిన్న మొన్నటి వరకు రెండు చేతులా సంపాదించిన ఐటీ ఉద్యోగులకు ఆర్ధిక మాంద్యం సెగ తగులుతోంది. లాభాలు లేవనే కారణంతో.. మాంద్యం వస్తుందన్న భయంతో బడా కంపెనీలైన గూగుల్ మైక్రోసాఫ్ట్, అమెజాన్,ట్విటర్, మెటా నుంచి చిన్న చిన్న స్టార్టప్స్ వరకు ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి.
ఆ తొలగింపుల్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. శాలరీలు ఎక్కువ ఇస్తుంటే తగ్గించి ఉద్యోగుల్ని కొనసాగించవచ్చు కదా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఉన్న ఉద్యోగం ఊడింది. ఇప్పుడు కంపెనీ ఇచ్చిన పెన్నులు, మగ్గులు, మాస్కులు తప్ప ఇంక ఏం మిగల్లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఓన్లీ ప్యాకేజీ.. నో బ్యాగేజీ
అలా ఉద్యోగం కోల్పోయిన వారిలో శ్రద్దాజైన్ ఒకరు. నెటిజన్లకు అయ్యో శ్రద్దా జైన్‌గా సుపరిచితురాలైన ఆమె..ఉద్యోగుల తొలగింపులపై ఐటీ కంపెనీలపై వ్యంగ్యంగా సెటైర్లు వేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓన్లీ ప్యాకేజీ.. నో బ్యాగేజీ అంటూ చేసిన ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోను 20లక్షల మందికిపైగా వీక్షించారు. ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్షా గోయెంకా సైతం ఆ వీడియోను షేర్ చేశారు. తాజాగా, శ్రద్దా జైన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ తనని ‘అయ్యో’ అని పిలవడాన్ని సంతోషం వ్యక్తం చేస్తూ నెటిజన‍్లతో పంచుకుంది.
అయ్యో శ్రద్దా జైన్
తమిళులు అయ్యో అనే పదాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ప్రతికూల పరిస్థితులు. లేదంటే ఏదైనా నష్టం, దుఃఖం, నిస్సహాయతను ఎదుటి వారితో వ్యక్తం చేసే సమయంలో ఆ పదాన్ని ఎక్కువగా చేర్చుతుంటారు. ఇక ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రద్దా జైన్ ప్రస్తుత సమాజంలో అన్నీ అంశాలపై స్పందిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోల్లో ఎక్కువగా అయ్యో అనే పదం వాడుతుండటం. ఆమె పేరు ముందు అయ్యో అనే పదం నిక్ నేమ్‌గా మారింది.
A laid off techie….this is so funny @AiyyoShraddha pic.twitter.com/uIlVwHeX21
— Harsh Goenka (@hvgoenka) January 30, 2023
Comments
Please login to add a commentAdd a comment