న్యూఢిల్లీ: బడ్జెట్‌లో ప్రభుత్వం కల్పించిన ప్రతిపాదనలను అనుకూలంగా మలుచుకోవాలని భారత పరిశ్రమలను (ఇండియా ఇంక్) ప్రధాని మోదీ కోరారు. ప్రభుత్వం మూలధన వ్యయాలను పెంచినట్టే, ప్రైవేటు రంగం కూడా మరిన్ని పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే గరిష్ట ప్రయోజనం పొందగలమన్నారు. బడ్జెట్‌పై నిర్వహించిన 10వ వెబినార్‌లో భాగంగా ప్రధాని మాట్లాడారు.
ప్రభుత్వం మూలధన వ్యయాల లక్ష్యాన్ని చారిత్రక గరిష్ట స్థాయి అయిన రూ.10 లక్షల కోట్లకు పెంచినట్టు గుర్తు చేశారు. అంతర్జాతీయంగా భారత్ ఎకానమీకి ప్రశంసలు లభిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. జీఎస్‌టీసహా ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను తగ్గింపు వల్ల పన్నుల భారం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్టు ప్రధాని తెలిపారు. ఈ చర్యలతో పన్నుల వసూళ్లు మెరుగుపడ్డాయని.. 2013–14 నాటికి 11 లక్షల కోట్లుగా ఉన్న పన్నుల ఆదాయం 2023–24 నాటికి రూ.33 లక్షల కోట్లకు చేరుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment