
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) యూపీలోని వారణాసికి రానున్నారు. ఆది, సోమవారాలలో ప్రధాని మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఉంటారు. డిసెంబర్ 17న తన కాశీ పర్యటనలో మొదటి రోజున ప్రధాని మోదీ.. నాడేసర్‌లో జరిగే వికాస్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం ప్రారంభిస్తారు.
మరుసటి రోజు అంటే డిసెంబర్ 18న విహంగం యోగాకు చెందిన స్వర్వేద మహామందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. తరువాత బర్కిలో జరిగే బహిరంగ సభలో మిషన్-2024కు శంఖనాదం చేసిన అనంతరం ప్రసంగించనున్నారు. అలాగే కాశీ సంసద్ స్పోర్ట్స్ కాంపిటీషన్ విజేతలను కలుసుకోనున్నారు.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా తన పార్లమెంటరీ నియోజకవర్గానికి వస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేశారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. బార్కి నుంచి ఢిల్లీ-వారణాసి వందే భారత్‌తో సహా ఐదు రైళ్లను ప్రారంభించనున్నారు. దీనితోపాటు రూ.19,150 కోట్ల విలువైన 37 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
కటింగ్ మెమోరియల్ స్కూల్ గ్రౌండ్స్‌లో జరిగే భారత్ సంకల్ప్ యాత్రలో ప్రధాని మోదీ.. పీఎం ఆవాస్, పీఎం స్వనిధి, పీఎం ఉజ్వల తదితర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సంభాషించనున్నారు.
ఇది కూడా చదవండి: కరోనా కొత్త వేరియంట్ కలకలం.. కేరళలో జేఎన్.1 కేసు నమోదు!
Comments
Please login to add a commentAdd a comment