మాఘ పౌర్ణమి వేళ.. వారణాసికి మోదీ | PM Modi Can Visit Varanasi on Magh Purnima | Sakshi
Sakshi News home page

Varanasi: మాఘ పౌర్ణమి వేళ.. వారణాసికి మోదీ

Published Mon, Feb 5 2024 11:25 AM | Last Updated on Mon, Feb 5 2024 11:25 AM

PM Modi Can Visit Varanasi on Magh Purnima - Sakshi

ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమి.. ఆరోజున ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. అలాగే  గోవర్ధన్‌లో సంత్‌ రివిదాస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు ఆలయ అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ.50 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. 

ఈ కార్యక్రమానికి సంబంధించి ఆలయ నిర్వాహకులు ప్రధాని మోదీకి ఆహ్వానం పంపారు. మోదీ పర్యటన ఇంకా ఖరారు కానప్పటికీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి కాశీకి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ పంచగంగా ఘాట్ వద్దనున్న బిందుమాధవ్‌ ఆలయాన్ని దర్శించే అవకాశాలున్నాయి. శైవ-వైష్ణవ ఐక్యతకు పునాదిగా నిలిచే ఈ ఆలయం విస్తరణ, అభివృద్ధి దిశగా ప్రధాని యోచిస్తున్నారని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement