బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాటల్లేవు ..మాట్లాడు కోల్లేవు అన్నరీతిలో 2019 ఎన్నికల తర్వాత ఇక దేశంలో ఎన్నికలే ఉండవంటూ జోస్యం చెప్పారు. 2014లో మొదలైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా 2019నాటికి సునామిలా మారిపోయింది.. దీంతో ఈ ఎన్నికల్లో ముందుకంటే మెరుగైన ఫలితాలుంటాయి. ఇక మోదీని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని ఆయన వ్యాఖ్యానించారు
2019లో 'మోదీ సునామీ' నేపథ్యంలో దేశంలో ఇక ఎన్నికలు జరగవు. 2024లో ఎన్నికలుండవని తాను భావిస్తున్నానన్నారు. శుక్రవారం నిర్వహించిన ఒక పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ తాము పూర్తి నిజాయితీతో దేశంకోసం పోరాడుతున్నామని సాక్షిపేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఓడించేందుకు చాలామంది చాలారకాల ఎత్తులు వేస్తున్నారు.. మోదీ ఉంటేనే దేశం ( మోదీ హైతో దేశ్ హై) అని దేశంలోని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంకగాంధీని రంగంలోకి దింపినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా మోదీ సునామీని అడ్డుకోవడం వారి తరం కాదని వ్యాఖ్యానించారు.
కాగా 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకగాంధీ వాద్రాను కాంగ్రెస్ నియమించింది. అలాగే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ బిజెపిని ఓడించే లక్ష్యంతో ముందస్తు ఎన్నికల పొత్తులో ప్రవేశించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment