న్యూఢిల్లీ: భారీ సరుకు వాహనాలు, ప్రయాణికుల కోసం ఉపయోగించే భారీ వాహనాలకు నమోదిత ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) ద్వారా తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష తేదీని ప్రభుత్వం 18 నెలల పాటు పొడిగించింది. ఈ నిబంధన 2024 అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుందని రోడ్ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్ మినిస్ట్రీ వెల్లడించింది. వాస్తవానికి ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సి ఉంది.
మధ్యస్థాయి, తేలికపాటి సరుకు రవాణా వాహనాలు, మధ్యస్థాయి ప్యాసింజర్ వెహికిల్స్‌కు 2024 జూన్ 1 నుంచి తప్పనిసరి చేయాలని గతంలో నిర్ణయించారు. తాజా ప్రకటన ప్రకారం ఈ వాహనాలకు అన్నిటికీ సామర్థ్య పరీక్షలు 2024 అక్టోబర్ 1 నుంచి ఏటీఎస్ ద్వారా తప్పనిసరిగా జరపాల్సి ఉంటుంది. రవాణాయేతర వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమయంలో (వాహనం కొన్న 15 ఏళ్లకు) ఫిట్‌నెస్ పరీక్షలు చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment