సాక్షి,ముంబై: దేశంలో మోటారు వాహన చట్టం ప్రకారం భారత్(BH) అనే నంబరు ప్లేట్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బీహెచ్ సిరీస్ నంబరు ప్లేట్‌ను వాహన వినియోగదారులందరూ వాడుకోవచ్చా? ఈ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ వల్ల లాభాలేంటి? ఆగస్టు 26, 2021 ప్రతిపాదించి, సెప్టెంబర్ 15, 2021 నుంచి అమలులోకి వచ్చిన ఈ విధానంలో ఎవరు బీహెచ్ సిరీస్ నెంబర్ ప్లేట్లకు అర్హులు, తదితర విషయాలను ఒకసారి చూద్దాం!
భారతదేశంలోని రక్షణ సిబ్బంది ,ప్రభుత్వ ఉద్యోగుల సౌలభ్యం కోసం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా వాహనాల కోసం భారత్ (BH) రిజిస్ట్రేషన్ సిరీస్‌ను ప్రవేశపెట్టారు. జీఎస్‌ఆర్594(E) ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ రిజిస్ట్రేషన్ విధానానికి అర్హులు. అలాగే నాలుగు కంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో తిరిగే ప్రైవేటు ఉద్యోగులు తమ వ్యక్తిగత కార్ల కోసం BH రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సాధాణంగా వాహన వినియోగదారులు ఎన్ని స్టేట్స్ మారితే అన్నిసార్లు రిజిస్ట్రేషన్, నో అబ్జెక్షన్, ఇలాంటి తప్పనిసరిగా చేయించుకోవాలి. అయితే మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లాంటి బాదరబందీ లేకుండా బీహెచ్ రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతుంది. తద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏ ప్రైవేటు వాహనమైనా ప్రాంతం మారినప్పుడు రీరిజిస్ట్రేషన్ కోసం ఎన్‌ఓసీ అవసరం లేకుండానే నేరుగా వాహనదారుడే అప్లై చేసు కోవచ్చు. తద్వారా వారి సమయం, డబ్బు రెండూ సేవ్ అవుతాయన్నమాట. అలాగే బీహెచ్ విధానంలో రెండేళ్ల కొకసారి ఆ స్టేట్ విధానాల ప్రకారం రోడ్ ట్యాక్స్ చెల్లించాలి.
(ఇదీ చదవండి: ChatGPT రెసిపీ వైరల్..ఏలియన్స్ కంటే ఏఐ చాలా డేంజర్ బ్రో!)
ఎక్కడ, ఎలా అప్లై చేసుకోవాలి?
ఆర్టీవో కార్యాలయంలో లేదా వాహన్ పోర్టల్ లో ఈ బీహెచ్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కొనుగోలుదారు తరపున, డీలర్ వాహన పోర్టల్‌లో ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి. ప్రభుత్వ సంస్థ ఉద్యోగి గుర్తింపు, ఇతర అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఇతర వివరాలను పూరించడంతో పాటు, డీలర్ సరైన రుసుము లేదా పన్ను చెల్లించాలి. అలాగే సంబంధిత ప్రూఫ్స్ సమర్పించి ఆన్‌లైన్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరోవైపు సాధారణ నంబరు ప్లేట్‌లా కాకుండా ఈ బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్‌లో మొదట సంవత్సరం, తర్వాత బీహెచ్ అని, ఆ తర్వాత వాహన రిజిస్ట్రేషన్ డిజిట్స్ ఉండటం విశేషం.
(భారీగా లిథియం నిక్షేపాలు: ఇక భవిష్యత్తంతాఅద్భుతమే! ఆనంద్ మహీంద్ర)
Comments
Please login to add a commentAdd a comment