ఉద్యోగ అవకాశాలు
గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో 106 ఖాళీలు
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, టెలికాం, హెచ్‌ఆర్, సెక్యూరిటీ, కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్‌మెంట్, స్టోర్‌స అండ్ పర్చేస్ తదితర విభాగాల్లో సీనియర్ ఇంజనీర్, ఫోర్‌మన్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్, అకౌంట్స్ అసిస్టెంట్ మొదలైన ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 22 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు తదితర పూర్తి వివరాలకు www.gailonline.com వెబ్‌సైట్ చూడొచ్చు.
ఎన్‌ఐఏసీఎల్‌లో మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు
ది న్యూ ఇండియా అస్యూరెన్‌స కంపెనీ లిమిటెడ్(ఎన్‌ఐఏసీఎల్) 17 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి 21 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న వారు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 4 నుంచి 14 మధ్య ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.newindia.co.in వెబ్‌సైట్ చూడొచ్చు.
ఐఐటీ బాంబేలో స్టాఫ్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బాంబే, మూడేళ్ల కాలపరిమితికి కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ట్రైన్‌డ గ్రాడ్యుయేట్ టీచర్, పార్‌ట టైం డెంటల్ టెక్నీషియన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ మెకానిక్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 5లోగా
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు తదితర పూర్తి
వివరాలకు www.iitb.ac.in వెబ్‌సైట్ చూడొచ్చు.
ఐసీఎస్‌ఐలో 27 ఖాళీలు
ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) వివిధ విభాగాల్లో 27 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డీన్, జాయింట్ సెక్రటరీ, డెరెక్టర్, డిప్యూటీ డెరైక్టర్, రీసెర్‌చ అసోసియేట్, అసిస్టెంట్ డెరైక్టర్, అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులను భర్తీ చేస్తారు. సెప్టెంబర్ 20 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలకు www.icsi.eduవెబ్‌సైట్ చూడొచ్చు.