న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగ పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు జనవరిలో 3.7 శాతంగా నమోదయ్యింది. 2021 ఇదే నెల్లో ఈ వృద్ధి రేటు 1.3 శాతం. 2021 డిసెంబర్‌లో ఈ రేటు 4.1 శాతం. అధికారిక గణాంకాల ప్రకారం, బొగ్గు, సహజ వాయువు, సిమెంట్ పరిశ్రమల పనితీరు సమీక్షా నెల్లో కొంత మెరుగ్గా ఉంది. క్రూడ్ ఆయిల్, ఎరువుల ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది. బొగ్గు (8.2 శాతం), సహజ వాయువు (11.7 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (3.7 శాతం), సిమెంట్ (13.6 శాతం) ఉత్పత్తులు బాగున్నాయి. స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాల పనితీరు అంతంతమాత్రంగానే నమోదయ్యింది. కాగా, ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకూ గడచిన 10 నెలల్లో ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు 11.6 శాతంగా ఉంటే, 2020–21 ఇదే కాలంలో అసలు వృద్ధిలేకపోగా 8.6 క్షీణత నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 44 శాతం. రానున్న రెండు వారాల్లో ఐఐపీ జనవరి గణాంకాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment