Infrastructure Industry
-
ఇన్వి ట్స్లో పెట్టుబడులు జూమ్..
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఇన్వి ట్స్), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులపై (రీట్స్) మదుపుదార్ల ఆసక్తి పెరుగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వీటిలో రూ. 17,116 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. స్థిరమైన రాబడులు అందిస్తుండటంతో ఈ సాధనాల్లో పెట్టుబడులు 14 రెట్లు పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రైమ్ డేటాబేస్డాట్కామ్ క్రోడీకరించిన గణాంకాల ప్రకారం 2023–24లో రీట్స్, ఇన్వి ట్స్ రూ. 17,116 కోట్లు సమీకరించాయి. 2022–23లో ఇది రికార్డు కనిష్ట స్థాయి రూ. 1,166 కోట్లుగా నమోదైంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఒక ఇన్వి ట్ ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్) కూడా చేపట్టింది. డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ సంస్థ ఓఎఫ్ఎస్ మార్గంలో రూ. 2,071 కోట్లు సమీకరించింది. సెబీ ఇటీవల నిబంధనలను సవరించిన నేపథ్యంలో ఈ విభాగం ఏయూఎం (నిర్వహణలోని ఆస్తులు) 500 మిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరవచ్చని వైజ్ఎక్స్ సీఈవో ఆర్యమాన్ వీర్ తెలిపారు. కొత్తగా వచ్చే పెట్టుబడుల్లో 75 శాతం వాటాతో రహదారుల రంగం ప్రధాన లబి్ధదారుగా ఉండగలదని పేర్కొన్నారు. -
రీట్స్, ఇన్విట్స్ ఇండెక్స్ షురూ
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ.. దేశీయంగా తొలిసారి రియల్ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(ఇన్విట్) ఇండెక్స్ను ప్రవేశపెట్టింది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టయ్యి, ట్రేడయ్యే రీట్స్, ఇన్విట్స్ పనితీరును పరిశీలించేందుకు మదుపరులకు వీలు చిక్కనున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. ఆదాయాన్ని ఆర్జించే రియల్టీ ఆస్తులతో రీట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తులతో ఇన్విట్స్ ఏర్పాటయ్యే సంగతి తెలిసిందే. వీటి ద్వారా ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. దీర్ఘకాలికమైన రియల్టీ ప్రాజెక్టులలో రీట్స్, మౌలిక రంగ ప్రాజెక్టులలో ఇన్విట్స్ పెట్టుబడులు చేపడుతుంటాయి. వీటి ద్వారా ఇన్వెస్టర్లకు విభిన్న మార్గాలలో నిరవధిక ఆదాయానికి అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు నగదు ఆర్జించే ప్రాజెక్టుల ద్వారా నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ ఆర్థిక అవకాశాలుగా రీట్స్, ఇన్విట్స్ గుర్తింపు పొందాయి. కాగా.. ఇండెక్సులో ఫ్రీఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా సెక్యూరిటీలకు వెయిటేజీ ఇవ్వనున్నట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఒక్కో సెక్యూరిటీకి 33 శాతం పరిమితిని అమలు చేయనుంది. ఇండెక్స్ ప్రాథమిక విలువ 1,000కాగా.. త్రైమాసికవారీగా సమీక్షించనుంది. -
మేలో మౌలిక రంగం భారీ వృద్ధి
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ మేనెల్లో (2021 మే నెలతో పోల్చి) భారీగా 18.1 శాతం పురోగతి సాధించింది. ఈ స్థాయి ఫలితం నమోదుకావడం 13 నెలల తర్వాత ఇదే తొలిసారి. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్లతో కూడిన ఈ గ్రూప్ వెయిటేజ్ మొత్తం పారిశ్రామిక ఉత్పతిసూచీ (ఐఐపీ)లో దాదాపు 44 శాతం. మే నెల్లో బొగ్గు (25.1 శాతం), క్రూడ్ ఆయిల్ (4.6 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (16.7 శాతం), ఎరువులు (22.8 శాతం), సిమెంట్ (26.3 శాతం) విద్యుత్ (22 శాతం) రంగాలు మంచి పురోగతి సాధించాయి. అయితే సహజ వాయువు ఉత్పత్తి 7 శాతం క్షీణించగా, స్టీల్ ఉత్పత్తి 15 శాతం పడింది. కాగా, ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్–మే) ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు 13.6 శాతంగా నమోదయ్యింది. -
జనవరిలో మౌలిక రంగం వృద్ధి 3.7 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగ పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు జనవరిలో 3.7 శాతంగా నమోదయ్యింది. 2021 ఇదే నెల్లో ఈ వృద్ధి రేటు 1.3 శాతం. 2021 డిసెంబర్లో ఈ రేటు 4.1 శాతం. అధికారిక గణాంకాల ప్రకారం, బొగ్గు, సహజ వాయువు, సిమెంట్ పరిశ్రమల పనితీరు సమీక్షా నెల్లో కొంత మెరుగ్గా ఉంది. క్రూడ్ ఆయిల్, ఎరువుల ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది. బొగ్గు (8.2 శాతం), సహజ వాయువు (11.7 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (3.7 శాతం), సిమెంట్ (13.6 శాతం) ఉత్పత్తులు బాగున్నాయి. స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాల పనితీరు అంతంతమాత్రంగానే నమోదయ్యింది. కాగా, ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకూ గడచిన 10 నెలల్లో ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు 11.6 శాతంగా ఉంటే, 2020–21 ఇదే కాలంలో అసలు వృద్ధిలేకపోగా 8.6 క్షీణత నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 44 శాతం. రానున్న రెండు వారాల్లో ఐఐపీ జనవరి గణాంకాలు వెలువడనున్నాయి. -
8 మౌలిక రంగాలూ బాగున్నాయ్!
న్యూఢిల్లీ: ఎనిమిది రంగాలతో కూడిన మౌలిక పారిశ్రామిక విభాగం వృద్ధి జూలైలో బాగుంది. వృద్ధి 6.6 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో వృద్ధి రేటు కేవలం 2.9 శాతం. కాగా, నెలవారీగా చూస్తే మాత్రం ఎనిమిది పారిశ్రామిక రంగాల వృద్ధి రేటు తగ్గింది. జూన్లో ఈ రేటు 7.6 శాతం. ఎనిమిది రంగాలూ వేర్వేరుగా... భారీ వృద్ధి... బొగ్గు: ఉత్పత్తి 0.6% నుంచి 9.7%కి ఎగసింది. సహజవాయువు: –5.2 శాతం క్షీణత నుంచి 6.6 శాతం వృద్ధి బాటకు మారింది. స్టీల్: వృద్ధి రేటు 6% నుంచి 9.4%కి పెరిగింది. విద్యుత్: 4.8% వృద్ధి రేటు 6.6%కి పెరిగింది. వృద్ధి తగ్గినవి... ఎరువులు: వృద్ధిలోనే ఉన్నా, ఈ రేటు 1.3 శాతం నుంచి 0.2 శాతానికి తగ్గింది. సిమెంట్: ఎరువుల రంగం తరహాలోనే వృద్ధి 10.8 శాతం నుంచి 1 శాతానికి తగ్గింది క్షీణత నమోదు చేసినవి.... క్రూడ్ ఆయిల్: క్షీణత –5.4 శాతం నుంచి –0.5 శాతానికి తగ్గింది. రిఫైనరీ ప్రొడక్టులు: – 2.7 శాతం క్షీణత నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ విభాగం 12.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. నాలుగు నెలల్లో... కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19) ఏప్రిల్ నుంచి జూలై మధ్య గ్రూప్ వృద్ధిరేటు 2.6 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది. -
‘బొగ్గు’ తప్ప అన్నీ మసే..
మైనస్తో ప్రారంభమైన మౌలిక రంగం * ఏప్రిల్లో వృద్ధి లేకపోగా 0.4% క్షీణత న్యూఢిల్లీ: ఎనిమిది రంగాలతో కూడిన కీలక మౌలిక పరిశ్రమల విభాగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో (2015-16, ఏప్రిల్) తీవ్ర నిరాశను మిగిల్చింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ విభాగంలో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదయింది. ఉత్పత్తి విలువ 2014 ఏప్రిల్లో విలువతో పోలిస్తే 2015 ఏప్రిల్లో -0.4 శాతంగా నమోదయింది. ఒక్క బొగ్గు రంగం మినహా మిగిలిన ఏడు రంగాలూ నిరాశాజనక ఫలితాలిచ్చాయి. స్టీల్ పరిశ్రమ వృద్ధిలోనే ఉన్నా... ఈ రేటు భారీగా పడిపోయింది. మంగళవారం ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నేపథ్యంలో వెలువడిన తాజా ‘మౌలిక’ గణాంకాలు.. ‘పాలసీ రేటు తగ్గింపు’ ఆశలకు మరింత బలాన్ని ఇచ్చాయి. వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్లో ఈ రంగాల పనితీరు చూస్తే... బొగ్గు: వృద్ధి 6.2 శాతం నుంచి 7.9 శాతానికి పెరిగింది. క్రూడ్ ఆయిల్: 0.1 శాతం క్షీణత మరింతగా 2.7 శాతం క్షీణతలోకి పడింది. సహజవాయువు: క్షీణతలోనే ఉంది. అయితే ఇది 7.7% నుంచి 3.6%కి తగ్గింది. రిఫైనరీ ప్రొడక్టులు: క్షీణత 1.9 శాతం నుంచి 2.9 శాతానికి పడింది. ఎరువులు: 11.1 శాతం వృద్ధి రేటు 0.04 క్షీణతలోకి జారింది. స్టీల్: 6.9 శాతం వృద్ధి 0.6 శాతం వృద్ధికి పడిపోయింది. సిమెంట్: 7.3 శాతం క్షీణత నుంచి 2.4 శాతం క్షీణతలోకి జారింది. విద్యుత్: 11.9 శాతం వృద్ధి రేటు 1.1 శాతం క్షీణతలోకి మళ్లింది. వరుసగా రెండవ నెలా మైనస్లోనే... ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం ఇలాంటి నిరాశాజనక ఫలితం ఇవ్వడం ఇది వరుసగా రెండవ నెల. నిజానికి గత ఏడాది నవంబర్ నుంచీ మౌలిక రంగం వృద్ధి రేటు పడిపోతూ వస్తోంది. నవంబర్లో 6.7 శాతం ఉన్న ఈ వృద్ధి రేటు, డిసెంబర్లో 2.4 శాతానికి అటు తర్వాత నెల జనవరిలో 1.8 శాతానికి, ఫిబ్రవరిలో 1.4 శాతానికి పడిపోతూ వచ్చింది. మార్చిలో -0.1 శాతంగా ఉన్న ఈ రేటు ఏప్రిల్లో మరింత దిగజారడం విచారకరం. కాగా గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 3.5 శాతం.