న్యూఢిల్లీ: ఎనిమిది రంగాలతో కూడిన మౌలిక పారిశ్రామిక విభాగం వృద్ధి జూలైలో బాగుంది. వృద్ధి 6.6 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో వృద్ధి రేటు కేవలం 2.9 శాతం. కాగా, నెలవారీగా చూస్తే మాత్రం ఎనిమిది పారిశ్రామిక రంగాల వృద్ధి రేటు తగ్గింది. జూన్‌లో ఈ రేటు 7.6 శాతం. ఎనిమిది రంగాలూ వేర్వేరుగా...
భారీ వృద్ధి...
బొగ్గు: ఉత్పత్తి 0.6% నుంచి 9.7%కి ఎగసింది.
సహజవాయువు: –5.2 శాతం క్షీణత నుంచి 6.6 శాతం వృద్ధి బాటకు మారింది.
స్టీల్: వృద్ధి రేటు 6% నుంచి 9.4%కి పెరిగింది.
విద్యుత్: 4.8% వృద్ధి రేటు 6.6%కి పెరిగింది.
వృద్ధి తగ్గినవి...
ఎరువులు: వృద్ధిలోనే ఉన్నా, ఈ రేటు 1.3 శాతం నుంచి 0.2 శాతానికి తగ్గింది.
సిమెంట్: ఎరువుల రంగం తరహాలోనే వృద్ధి 10.8 శాతం నుంచి 1 శాతానికి తగ్గింది
క్షీణత నమోదు చేసినవి....
క్రూడ్ ఆయిల్: క్షీణత –5.4 శాతం నుంచి –0.5 శాతానికి తగ్గింది.
రిఫైనరీ ప్రొడక్టులు: – 2.7 శాతం క్షీణత నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ విభాగం 12.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.
నాలుగు నెలల్లో...
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19) ఏప్రిల్ నుంచి జూలై మధ్య గ్రూప్ వృద్ధిరేటు 2.6 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది.
8 మౌలిక రంగాలూ బాగున్నాయ్!
Published Sat, Sep 1 2018 12:37 AM | Last Updated on Sat, Sep 1 2018 12:37 AM
Comments
Please login to add a commentAdd a comment