‘సూక్ష్మ, చిన్నతరహా’కు మహర్దశ | good chance to small and middle range Industries | Sakshi
Sakshi News home page

‘సూక్ష్మ, చిన్నతరహా’కు మహర్దశ

Published Wed, Nov 9 2016 4:13 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

‘సూక్ష్మ, చిన్నతరహా’కు మహర్దశ

‘సూక్ష్మ, చిన్నతరహా’కు మహర్దశ

- ఖారుులా సంస్థలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం
- ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ విధానం రూపకల్పన
- రూ.100 కోట్లతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్‌‌స కార్పొరేషన్ ఏర్పాటుకు కసరత్తు
- పావలా వడ్డీకే రుణాలిచ్చి ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేలా ప్రతిపాదన
- వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు  
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘గడిచిన 9 నెలల్లోనే రాష్ట్రానికి రూ. 44,791 కోట్ల పెట్టుబడులతో 2,550 కొత్త పరిశ్రమలొచ్చారుు. వాటి ద్వారా ప్రత్యక్షంగా 1,60,894 మందికి ఉద్యోగాలు లభించారుు’’ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఇది. గత పదేళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు లక్షలాది మందికి ఉపాధి కల్పించినట్లు రికార్డులు చెబుతున్నారుు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. గత రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఖారుులా పడ్డ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు వెరుు్యకి పైమాటే. ఇవిగాకుండా రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో ఖారుులా పడ్డ పరిశ్రమల సంఖ్య 7,840. తద్వారా రోడ్డునపడ్డ కార్మికుల సంఖ్య లక్షపైమాటే. ఇవన్నీ కూడా పరిశ్రమల శాఖ వద్దనున్న గణాంకాలే. ఇది నాణేనికి రెండోవైపు.

 ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ విధానం
 ఒకవైపు పెద్ద పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు అనేక రారుుతీలిస్తూ పారిశ్రామికాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వానికి ఇది తీవ్ర ఆందోళన కలిగి స్తోంది. ఖారుులా సంస్థలను గట్టెక్కించేందుకు స్టేట్ లెవెల్ ఇంటర్ ఇన్‌స్టిట్యూషనల్ కమిటీ(స్లిక్) చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ ’ పేరిట కొత్త తరహా విధానానికి శ్రీకారం చుట్టింది.  

 నాన్‌బ్యాంకింగ్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే...
 ఖారుులా దిశగా పయనించే సంస్థలకు బ్రిడ్‌‌జ ఫైనాన్‌‌స తరహాలో పావలా వడ్డీకే స్వల్పకాలిక (90 రోజుల్లో తిరిగి చెల్లించేలా) రుణాలిచ్చి ఆదుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐడీసీ) పరిధిలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్‌‌స కార్పొరేషన్(ఎన్‌బిఎఫ్‌సీ)ను ఏర్పాటు చేసేలా ప్రతిపాదన రూపొందించింది. అందులో రూ.100 కోట్ల కార్పస్‌ఫండ్‌ను జమ చేస్తారు. ఈ ప్రతిపాదన ప్రకారం....ఈ కార్పొరేషన్ ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తారు. ఐఏఎస్, డిపార్ట్‌మెంట్ వ్యక్తిని కాకుండా ఫండ్‌ను మేనేజ్‌చేసే వ్యక్తిని కార్పొరేషన్ సీఈవోగా నియమిస్తారు. ఖారుులా దిశగా పయనిస్తున్న పరిశ్రమలు సాయం కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అర్హత ఉన్న వాటికి రుణం అందిస్తారు. ఆ రుణాన్ని నేరుగా కాకుండా ఖారుులా దిశగా వెళుతున్న సంస్థలకు ఏ బ్యాంకు రుణమిచ్చిందో... మళ్లీ ఆ బ్యాంకు ద్వారానే రుణం మంజూరు చేరుుస్తారు. రుణం కోసం దరఖాస్తు మొదలు మంజూరు వరకు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

 అందరి భాగస్వామ్యంతోనే కార్పస్‌ఫండ్
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల భాగస్వామ్యంతోనే రూ.వంద కోట్ల కార్పస్‌ఫండ్ మొత్తాన్ని సమకూరుస్తారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్(డీఐపీపీ) శాఖ తెలంగాణకు రూ.50 కోట్లు ఇవ్వాలి. ఆ మొత్తాన్ని కార్పస్‌ఫండ్‌కు జమ చేస్తారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.10 కోట్లు సమకూరుస్తుంది. ఈ కార్పస్‌ఫండ్‌లో భాగస్వాములు కాదల్చుకున్న సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణ మొత్తంలో గరిష్టంగా ఒక శాతం లేదా కనిష్టంగా రూ.10 వేలు చెల్లించి ఎన్‌బీఎఫ్‌సీలో సభ్యత్వం తీసుకోవాలి. తద్వారా మరో రూ.10 కోట్లు సమకూరుతుంది. దీంతో కలిపి రూ.70 కోట్లు జమ అవుతుండగా, మిగిలిన రూ.30 కోట్లు బ్యాంకుల ద్వారా సమకూర్చుకునేలా ప్రతిపాదన రూపొందించారు. బ్యాంకులు సమకూర్చే మొత్తానికి కార్పొరేషన్ 8 శాతం వడ్డీ చెల్లించేలా ప్రతిపాదన రూపొందించారు. ఈ ప్రతిపాదనను క్షుణ్నంగా పరిశీలించిన ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
 
 పది రోజుల్లో నిర్ణయం వెల్లడి!
 ఎన్‌బీఎఫ్‌సీ ఏర్పాటు, బోర్డు సభ్యులు, సీఈవో నియామకం, కార్పస్‌ఫండ్ సేకరణ వంటి ఏర్పాట్లకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించిన వెంటనే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎన్‌బీఎఫ్‌సీని అమల్లోకి తీసుకొస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనిపై విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వారం, పది రోజుల్లో ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement