Industrial Health Clinic
-
ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌కు నిధుల్లేక సుస్తీ
సాక్షి, హైదరాబాద్: నష్టాల అంచులో ఉన్న సూక్ష్మ, చిన్నపరిశ్రమలను ఆదుకుని వాటి కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం 2018లో ‘ది తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్’(టీఐహెచ్‌సీఎల్)ను ఏర్పాటు చేసింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)గా ప్రస్థానం ప్రారంభించిన హెల్త్ క్లినిక్ నిధుల కొరత ఎదుర్కొంటోంది. రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌తో హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా పదోవంతు అనగా రూ.10 కోట్లు విడుదల చేసింది. కేంద్రం నుంచి మరో రూ.50 కోట్లు, ఎంఎస్ఎంఈలు, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.40 కోట్లు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతలో రూ.10 కోట్లు విడుదల చేసినా కేంద్రం నుంచి నయాపైసా రాలేదు. మరోవైపు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి కూడా స్పందన శూన్యం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మరో రూ.10 కోట్లు విడుదల చేసింది. ఈ కొద్ది నిధులతోనే ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ నష్టాల అంచులో ఉన్న పరిశ్రమలకు కన్సల్టింగ్, కౌన్సెలింగ్, మార్గదర్శనం వంటి సేవలను అందిస్తోంది. నిధుల సేకరణ కోసం ప్రయత్నాలు పారిశ్రామికంగా శరవేగంగా పురోగమిస్తున్న తెలంగాణలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఉద్యమ పోర్టల్ వివరాల ప్రకారం రాష్ట్రంలో 3.25 లక్షల సూక్ష్మ, చిన్న పరిశ్రమలు నమోదయ్యాయి. అయితే కరోనా పరిస్థితుల్లో అనేక సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పెట్టుబడి వ్యయం(వర్కింగ్ క్యాపిటల్) దొరక్కపోవడం, ఇతరత్రా కారణాలతో నష్టాల బాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నష్టాల అంచులో ఉన్న సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌ను ఆశ్రయిస్తున్నా నిధుల కొరతమూలంగా ఆశించిన సాయం అందడంలేదు. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వ ఆర్థిక సంస్థ ‘జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ’(జికా)తో రుణ వితరణ ఒప్పందం కోసం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ప్రయత్నిస్తోంది. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే ‘స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’(సిడ్బి)తో కూడా సంప్రదింపులు చేస్తోంది. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కార్యకలాపాలు మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు నష్టాల అంచులో ఉన్న 45 పరిశ్రమలకు రూ.5.50 కోట్ల మేర ఆర్థిక సాయం లభించింది. నష్టాల అంచులో ఉన్న మరో 430 వరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేసినట్లు సమాచారం. ఆదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కార్పస్ ఫండ్ కోసం ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాం. నష్టాల అంచు లో ఉన్న పరిశ్రమల వివరాలను బ్యాంకర్ల ద్వారా సేక రించడంతోపాటు సర్వేల ద్వారా కూడా గుర్తిస్తున్నాం. అయితే చాలా పరిశ్రమలు మూసివేతకు గురైన తర్వాతే యాజమాన్యాలు మా దగ్గరకు వస్తున్నాయి. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కార్యకలాపాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత వర్గాలను కోరాం. – వెంకటేశ్వర్లు శిష్లా్ట, సీఈవో, ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ -
వాల్‌మార్ట్‌తో టీఐహెచ్‌సీ ఒప్పందం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణలో తయారీ రంగంలోని ఖాయిలా పరిశ్రమలను పునరుద్దరించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ (టీఐహెచ్‌సీ) అమెరికాకు చెందిన రిటైల్ బహుళ జాతి కంపెనీ వాల్‌మార్ట్‌తో ఒప్పందం చేసుకోనుంది. టీఐహెచ్సీలోని ఎంఎస్ఈలకు ఆన్లైన్ వేదికను అందించడంతో పాటు మార్కెటింగ్ అవకాశాలను కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని టీఐహెచ్‌సీ అడ్వైజర్ డాక్టర్ బి. యెర్రం రాజు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ‘‘రూ.100 కోట్ల సోషల్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం పలు విదేశీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. రెండేళ్ల లాకిన్ పీరియడ్‌తో 7 శాతం డివిడెండ్‌ను కేటాయిస్తాం. వచ్చే 3 నెలల్లో డీల్ క్లోజ్ చేస్తామని’’ ఆయన పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ఖాయిలా పడ్డ 43 ఎంఎస్ఎంఈలను పునరుద్ధరించామని... వీటి ద్వారా సుమారు 1,100 మందికి ఉద్యోగ అవకాశాలొచ్చాయని చెప్పారు. ‘ప్రస్తుతం మరొక 12 ఎంటర్‌ప్రైజ్‌లు పునరుద్ధ్దరణ జాబితాలో ఉన్నాయి. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా నారీ పథకాన్ని ఏర్పాటు చేశాం. వార్షిక వడ్డీ రేటు 9 శాతంగా ఉంటుంది. గరిష్ట రుణం రూ.25 లక్షలు’ అని ఆయన వివరించారు. -
‘సూక్ష్మ, చిన్నతరహా’కు మహర్దశ
- ఖారుులా సంస్థలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం - ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ విధానం రూపకల్పన - రూ.100 కోట్లతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స కార్పొరేషన్ ఏర్పాటుకు కసరత్తు - పావలా వడ్డీకే రుణాలిచ్చి ఎంఎస్ఎంఈలను ఆదుకునేలా ప్రతిపాదన - వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: ‘‘గడిచిన 9 నెలల్లోనే రాష్ట్రానికి రూ. 44,791 కోట్ల పెట్టుబడులతో 2,550 కొత్త పరిశ్రమలొచ్చారుు. వాటి ద్వారా ప్రత్యక్షంగా 1,60,894 మందికి ఉద్యోగాలు లభించారుు’’ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఇది. గత పదేళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు లక్షలాది మందికి ఉపాధి కల్పించినట్లు రికార్డులు చెబుతున్నారుు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. గత రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఖారుులా పడ్డ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు వెరుు్యకి పైమాటే. ఇవిగాకుండా రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో ఖారుులా పడ్డ పరిశ్రమల సంఖ్య 7,840. తద్వారా రోడ్డునపడ్డ కార్మికుల సంఖ్య లక్షపైమాటే. ఇవన్నీ కూడా పరిశ్రమల శాఖ వద్దనున్న గణాంకాలే. ఇది నాణేనికి రెండోవైపు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ విధానం ఒకవైపు పెద్ద పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు అనేక రారుుతీలిస్తూ పారిశ్రామికాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వానికి ఇది తీవ్ర ఆందోళన కలిగి స్తోంది. ఖారుులా సంస్థలను గట్టెక్కించేందుకు స్టేట్ లెవెల్ ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ కమిటీ(స్లిక్) చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ ’ పేరిట కొత్త తరహా విధానానికి శ్రీకారం చుట్టింది. నాన్‌బ్యాంకింగ్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే... ఖారుులా దిశగా పయనించే సంస్థలకు బ్రిడ్జ ఫైనాన్స తరహాలో పావలా వడ్డీకే స్వల్పకాలిక (90 రోజుల్లో తిరిగి చెల్లించేలా) రుణాలిచ్చి ఆదుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐడీసీ) పరిధిలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స కార్పొరేషన్(ఎన్‌బిఎఫ్‌సీ)ను ఏర్పాటు చేసేలా ప్రతిపాదన రూపొందించింది. అందులో రూ.100 కోట్ల కార్పస్‌ఫండ్‌ను జమ చేస్తారు. ఈ ప్రతిపాదన ప్రకారం....ఈ కార్పొరేషన్ ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తారు. ఐఏఎస్, డిపార్ట్మెంట్ వ్యక్తిని కాకుండా ఫండ్‌ను మేనేజ్‌చేసే వ్యక్తిని కార్పొరేషన్ సీఈవోగా నియమిస్తారు. ఖారుులా దిశగా పయనిస్తున్న పరిశ్రమలు సాయం కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అర్హత ఉన్న వాటికి రుణం అందిస్తారు. ఆ రుణాన్ని నేరుగా కాకుండా ఖారుులా దిశగా వెళుతున్న సంస్థలకు ఏ బ్యాంకు రుణమిచ్చిందో... మళ్లీ ఆ బ్యాంకు ద్వారానే రుణం మంజూరు చేరుుస్తారు. రుణం కోసం దరఖాస్తు మొదలు మంజూరు వరకు ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. అందరి భాగస్వామ్యంతోనే కార్పస్‌ఫండ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల భాగస్వామ్యంతోనే రూ.వంద కోట్ల కార్పస్‌ఫండ్ మొత్తాన్ని సమకూరుస్తారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్(డీఐపీపీ) శాఖ తెలంగాణకు రూ.50 కోట్లు ఇవ్వాలి. ఆ మొత్తాన్ని కార్పస్‌ఫండ్‌కు జమ చేస్తారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.10 కోట్లు సమకూరుస్తుంది. ఈ కార్పస్‌ఫండ్‌లో భాగస్వాములు కాదల్చుకున్న సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణ మొత్తంలో గరిష్టంగా ఒక శాతం లేదా కనిష్టంగా రూ.10 వేలు చెల్లించి ఎన్బీఎఫ్సీలో సభ్యత్వం తీసుకోవాలి. తద్వారా మరో రూ.10 కోట్లు సమకూరుతుంది. దీంతో కలిపి రూ.70 కోట్లు జమ అవుతుండగా, మిగిలిన రూ.30 కోట్లు బ్యాంకుల ద్వారా సమకూర్చుకునేలా ప్రతిపాదన రూపొందించారు. బ్యాంకులు సమకూర్చే మొత్తానికి కార్పొరేషన్ 8 శాతం వడ్డీ చెల్లించేలా ప్రతిపాదన రూపొందించారు. ఈ ప్రతిపాదనను క్షుణ్నంగా పరిశీలించిన ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. పది రోజుల్లో నిర్ణయం వెల్లడి! ఎన్బీఎఫ్సీ ఏర్పాటు, బోర్డు సభ్యులు, సీఈవో నియామకం, కార్పస్‌ఫండ్ సేకరణ వంటి ఏర్పాట్లకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించిన వెంటనే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎన్బీఎఫ్సీని అమల్లోకి తీసుకొస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనిపై విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వారం, పది రోజుల్లో ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.