ఐక్యరాజ్యసమితిలో సెప్టెంబర్‌లో మోదీ ప్రసంగం | PM Modi to address annual UN General Assembly session september 28 | Sakshi
Sakshi News home page

ఐక్యరాజ్యసమితిలో సెప్టెంబర్‌లో మోదీ ప్రసంగం

Published Fri, Aug 2 2019 3:35 AM | Last Updated on Fri, Aug 2 2019 3:35 AM

PM Modi to address annual UN General Assembly session september 28 - Sakshi

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో భారత ప్రధాని మోదీ మరోసారి ప్రసంగిం చనున్నారు. ఐక్యరాజ్యసమితి 74వ వార్షిక జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్‌ 28వ తేదీ ఉదయం ప్రధాని మోదీ ప్రసంగం ఉండనుంది. ఈ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించే ప్రపంచ దేశాధినేతల షెడ్యూల్‌ను యూఎన్‌ గురు వారం ప్రకటించింది.

దీని ప్రకారం సెప్టెం బర్‌ 24 నుంచి 30 వరకు సాధారణ అసెం బ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమా వేశాల కోసం 112 దేశాల అధ్యక్షులు, 48 మంది ప్రభుత్వాధినేతలు, 30 మంది విదేశాంగ శాఖ మంత్రులు న్యూయార్క్‌ చేరుకోనున్నారు. ఈ పర్యటన లోనే మోదీ మరికొన్ని ఉన్నత స్థాయి సదస్సులకు హాజరు కానున్నారు. మోదీ మొదటిసారి 2014లో ఐరాసలో ప్రసంగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement