speeches
-
బీసీలను పెద్దల సభకు పంపింది సీఎం జగన్: మంత్రి సీదిరి
సాక్షి, గాజువాక : చంద్రబాబుకు బానిసత్వం చేసే వారే టీడీపీలో మిగిలారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం విశాఖపట్నం గాజువాకలో జరిగిన సామాజిక సాధికారత యాత్ర బహిరంగ సభలో అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీనర్గాలకు ఏనాడైనా చంద్రబాబు మేలు చేశారా అని ప్రశ్నించారు. బీసీలను చంద్రబాబు తోలు తీస్తానని, తాట తీస్తానని బెదిరించారని గుర్తుచేశారు. ఒక మత్స్యకారుడు పార్లమెంట్ లో అడుగు పెట్టారంటే అందుకు సీఎం జగన్ కారణమని చెప్పారు. ఏకంగా నలుగురు బీసీలను రాజ్య సభకు పంపింది సీఎం జగనేనన్నారు. బీసీలు జడ్జిలుగా పనికి రారని చంద్రబాబు లేఖలు రాశారని మండిపడ్డారు. దళితులను అవమానించిన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. పీకే అంటే ప్యాకేజీ స్టార్ అని, జనసైనికుల కష్టాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అమ్మేస్తున్నారని అప్పలరాజు ఫైర్ అయ్యారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. సీఎం పాలనను ఇతర రాష్ట్రాలు అచరిస్తున్నాయి. ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వంపై త్పపుడు ప్రచారం చేస్తున్నాయి. అవినీతి రహిత పాలనను సీఎం జగన్ అందిస్తున్నారు. లంచాలు లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయి. రాజధాని వైజాగ్‌కు వస్తె ఇక్కడ ఉపాధి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి’ అని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేత అంజాద్ బాషా మాట్లాడుతూ..‘ సీఎం జగన్ చెప్పిందే చేస్తారు. లోకేష్ కార్పొరేటర్‌గా కూడా గెలవడు. పవన్‌ను రెండు చోట్ల ఓడించిన మగాడు సీఎం జగన్’ అని కొనియాడారు. -
చిన్న మాటలే.. ఛిన్నాభిన్నం చేసేస్తాయి
శ్రీరామాయణంలో... దశరథ మహారాజు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికీ వివాహాలు చేయాలని సంకల్పించాడు. సభతీర్చి వారికి తగిన వధువులను వెతకవలసిందిగా కోరుతూ మంత్రులతో, పురోహితులతో సమాలోచనలు జరుపుతున్నాడు. అదే సమయానికి విశ్వామిత్రుడు వచ్చాడు. సాక్షాత్ బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు వచ్చేసరికి మహారాజు కంగారు పడిపోయి గబాగబా వెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదు లిచ్చి ఆహ్వానించాడు. బ్రహ్మర్షి కాకముందు విశ్వామిత్రుడు కోపధారి కనుక తొందరపాటులో ఏ శాపమిస్తాడో అని భయపడిపోయి... ఒకటికి పదిమార్లు ... ఆయన ఏమీ అడగకపోయినా... మీరు రావడం వల్ల మా వంశం తరించింది, నేను తరించాను, నా ఇల్లు పావనమయింది, మీకు ఏం కావాలో చెప్పండి, ఏవయినా చేసేస్తాను, ఏదయినా ఇచ్చేస్తాను.. అని అదేపనిగా చెప్పాడు. అన్నీ విన్న మహర్షి చివరన మాట్లాడుతూ.. ‘‘రాజా! నేనొక యజ్ఞాన్ని తలపెట్టాను. మారీచ సుబాహులనే రాక్షసులు వచ్చి నా యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఆ యజ్ఞ సంరక్షణ కొరకు మీ కుమారులయిన రామలక్ష్మణులను ఇద్దరినీ నాతో పంపించండి’’ అన్నాడు. అది విని దశరథుడు హతాశుడయ్యాడు. తన కుమారులకు రాక్షసుల చేతిలో ఎక్కడ ఏ ఆపద కలుగుతుందో అని అనేక సాకులు చూపిస్తూ నేను పంపను... నేను పంపను... అనడం మొదలు పెట్టాడు. దానికి విశ్వామిత్రుడు ..‘‘ఒకసారి మాటిచ్చి తప్పే లక్షణం ఉన్నవాడా! దీర్ఘకాలంలో శోకించెదవుగాక!’’ అన్నాడు. విశ్వామిత్రుడు అడగకముందే తొందరపడిపోయి చేసేస్తాను అనడం వల్ల .. తీరా అడిగేసరికి చేయలేని పరిస్థితి కొనితెచ్చుకున్నందువల్ల దశరథ మహారాజు అంతటివాడు సంకటపరిస్థితిలో పడ్డాడు. ఏదయినా ఒకమాట ఇచ్చేముందు మనకున్న పరిమితుల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఇది నేను చేయగలనా? నాకు ఆ సామర్థ్యం ఉందా? నాకు సాధ్యమవుతుందా? ఆలోచించి... చెయ్యగలిగితే చేయగలను.. అని చెప్పాలి. చేయలేనప్పుడు అదే చెప్పాలి. గణిత శాస్త్ర మేథావి, సంగీత శాస్త్రంలో, రాజకీయంలో, మతవిశ్వాసాలను సిద్ధాంతీకరించడంలో దిట్ట అయిన పైథాగరస్ ఒక మాట అంటాడు.. ‘‘అత్యంత ప్రాచీనమైన మాటలు, చాలా చిన్న చిన్న మాటలు ఏవి! అంటే... ‘‘యస్’’, ‘‘నో’’. అని – వీటిని వాడేటప్పుడు ఎంతో విచక్షణతో, సంయమనంతో వాడాలనేది ఆయన ఉద్దేశం. అలాగే గొప్ప అవకాశం వచ్చినప్పుడు... ముందూ వెనకలు ఆలోచించకుండా తిరస్కరించడం, తమను తాము నిరూపించుకునే అవకాశాన్ని, జీవితంలో వృద్ధిలోకి వచ్చే అవకాశాన్ని. అపరిపక్వ అపోహలతో, లేనిపోని భయాలతో చేజేతులా వదులుకోవడం తరువాత మెలికలు తిరిగిపోవడం కంటే.. అవును అని కానీ, కాదు అని కానీ చెప్పేముందు తొందరపడకుండా, ఆవేశాలకు లోను కాకుండా పదిసార్లు విజ్ఞతతో ఆలోచించి ఆ పదాలను వాడుతూ ఉండాలి. ఒక వ్యక్తి గౌరవం, మర్యాద, అభ్యున్నతి, ప్రతిష్ఠ, విశ్వసనీయత... వంటివన్నీ దీనితో ముడిపడి ఉన్నాయి. యస్ లేదా నో... అవును లేదా కాదు... చిన్న పదాలే కానీ జీవితాలను మలుపు తిప్పేస్తాయి... జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించడం ఉత్తమం. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పవన్‌కు ఆ టెక్నిక్ చంద్రబాబే నేర్పి ఉంటాడు!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు ఇలా రెచ్చిపోయినట్లు పిచ్చితనంగా మాట్లాడుతున్నారు?. తనను హత్య చేయడానికి సుపారీ ఇచ్చారని ఎందుకు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను,ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎందుకు అంతలా దూషిస్తున్నారు. తాను అదికారంలోకి వస్తే ఎమ్మెల్యేని భీమ్లానాయక్ సినిమాలో మాదిరి లాక్కువెళతామని, వైఎస్సార్సీపీ వాళ్లను కొడతామని ఇలా.. ఏవేవో క్రిమినల్ భాషలో ఎందుకు మాట్లాడుతున్నారు. ఇదంతా కాకతాళీయంగా చేస్తున్నారా? కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారా?.. కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించి ప్రసంగిస్తున్న విషయాలలో పెక్కు వివాదాస్పదం అవుతున్నాయి. ఒక రాజకీయ నేత ప్రవర్తించవలసిన పద్దతిలో ఆయన లేరన్న అభిప్రాయం కలుగుతుంది. విధానపరమైన అంశాలు,ప్రభుత్వ పధకాల జోలికి వెళ్లకుండా రాష్ట్రంలో ఏదో అశాంతి ప్రబలిపోయిందన్న అపోహ కల్పించాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. సరిగ్గా ఇది టీడీపీ అధినేత చంద్రబాబు శైలి. ✍️ తాను అధికారంలో ఉంటే పరిస్థితి ఎలా ఉన్నా రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్లు, శాంతిభద్రతలు పరిఢవిల్లుతున్నట్లు.. అదే ఎదుటివారు అధికారంలో ఉంటే అంతా అరాచకమే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతుంటారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి,టీవీ5 వంటివి ఆయనకు తందానా అంటాయి. ఇప్పుడు అదే స్టైల్ లో పవన్ కళ్యాణ్ కూడా ఉపన్యాసాలు సాగిస్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఇది జరుగుతోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. దానిని నిజమని ధృవీకరించేలా పవన్ కల్యాణ్ ఎక్కడా గత టీడీపీ పాలన గురించి ఒక్క ముక్క మాట్లాడకుండా ఎంతసేపు జగన్ ప్రభుత్వంపైనే చేస్తున్న ఆరోపణలు గమనిస్తే పిచ్చితనం పీక్కు చేరినట్లు అనిపిస్తుంది. ✍️ పవన్ ప్రసంగంలో.. తనను ప్రజలు ఓడించి వైఎస్సార్సీపీని గెలిపించారన్న దుగ్ద కనిపిస్తుంది. అందుకే తనను కనీసం ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన బతిమాలుతున్నారు. అది కూడా అనుమానంగా ఉండబట్టే తనను చంపడానికి సుపారీ ఇచ్చారని మరో ఆరోపణ చేశారు. దీనివల్ల కొంతైనా సానుభూతి రాకపోతుందా అన్నది ఆయన ఆశ కావచ్చు. అది నిజమే అయితే ఆయన స్వయంగా లేదా, ఆయన పార్టీ నేతల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా!. అదేమీ చేయలేదంటే ఏమిటి దాని అర్ధం. కేవలం ప్రచారం కోసం ఇలాంటివి చెప్పి ప్రభుత్వంపై బురద చల్లడమే కదా! ✍️ సినిమా నటుడు కనుక ఆయనకు కొంత అభిమాన బలగం ఉంది. సామాజికపరంగా కొంతమంది ఆయనను అనుసరించవచ్చు. వారిలో ఉద్రేకం రెచ్చగొట్టం ఒక లక్ష్యంగా పెట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లుగా ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యేలను, వైస్సార్సీపీవాళ్లను దారుణంగా తిట్టడం ద్వారా ఆ వర్గాలలో కోపం తెప్పించాలని, వారిలో ఎవరైనా ఆవేశపరులు ఉంటే వారు రియాక్ట్ అయితే.. మళ్లీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాలన్నది ఆయన దురుద్దేశం కావచ్చు. ఇలాంటి టెక్నిక్స్ లో చంద్రబాబు దిట్ట. వాటిలోకొన్నిటిని పవన్ కల్యాణ్ కు నేర్పి పంపినట్లుగా ఉంది. ✍️ పవన్ కల్యాణ్, చంద్రబాబులతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి కావాలని రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నట్లుగా భ్రమ కల్పించి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజీని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి అందులోనూ కాకినాడ వంటి ప్రశాంతమైన నగరంలో పవన్ రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నం ఇంతా అంతా కాదు. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటన్నింటిని ప్రస్తావించి మరోసారి ప్రచారం చేయడం ఇష్టం లేదు. ఈ సందర్భంగా కాకినాడ నుంచి పోటీచేసి తనను ఓడించాలని ద్వారంపూడి సవాల్ చేశారు. ఎటూ తను ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసేది ఇంకా తేల్చుకోలేదు కనుక ఆయన ఈ అవకాశాన్ని వినియోగించుకుని కాకినాడ సిటీలో పోటీచేయవచ్చు కదా!. ఆ ధైర్యం పవన్‌కు ఉందా? అన్నది సందేహమే. ✍️ పవన్ ఇప్పటిదాకా యాత్రలో ఎక్కడా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ స్కీముల గురించి తన అభిప్రాయాలు చెప్పలేదు. అమ్మ ఒడి కింద విద్యార్ధుల తల్లిదండ్రులకు పదిహేనువేల రూపాయలు చొప్పున ఇవ్వడాన్ని ఆయన అంగీకరిస్తారా?లేదా?.. చేయూత కింద 18,500 రూపాయల చొప్పున మహిళలకు ఇవ్వడం కరెక్టా ?కాదా?.. కాపునేస్తం కింద కాపు మహిళలకు ఆర్ధిక సాయం చేయడాన్ని సమర్దిస్తారా?లేదా?.. చేనేత నేస్తం కింద చేనేత కుటుంబాలకు సాయం చేయాలా?వద్దా ?.. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ,ఇళ్లు నిర్మించడాన్ని ఒప్పుకుంటారా?లేదా?.. వలంటీర్ల వ్యవస్థపై ఆయన అభిప్రాయం ఏమిటి? గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజల ముంగిటికి పాలన వెళ్ళిందా?లేదా?.. రైతు భరోసా కేంద్రాలకు రైతులకు ఉపయోగపడుతున్నాయా?లేదా?.. ఇలాంటివాటిపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ✍️ ఏపీలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయంటూ అబద్దపు ప్రచారం చేయడమే కాకుండా, బీహారులా మారిందని పవన్ అనడం ద్వారా ఏపీపై ఆయనకు ఉన్న అక్కసును బయటపెట్టుకున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వాన్ని చెత్తపాలనతో పోల్చుతూ జపాన్‌కు చెందిన మాకీ సంస్థ దేశ ప్రధానికి లేఖ రాసినప్పుడు మాత్రం.. పవన్ కల్యాణ్ నోట్లోవేలేసుకుని కూర్చున్నారు. చంద్రబాబు కాని, లోకేష్ కాని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాని ఒకే వ్యూహంతో వెళుతున్నారు. అదేమిటంటే.. ప్రజలు ఈ సంక్షేమ స్కీముల గురించి మర్చిపోవాలి. ఆ పిమ్మట రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందన్న భయాన్ని కల్పించాలి. సంక్షేమ స్కీముల ద్వారా ప్రజల ఆదరణను జగన్ బాగా పొందారని గమనించిన ఈ ప్రతిపక్షం వాటి జోలికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా కుట్ర ధోరణికి వెళుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే పచ్చిగా ఇలాంటివాటిని ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా మొదటి పేజీలలో ప్రచురిస్తూ ప్రజలలో కంపరం కలిగిస్తున్నాయి. అదే తెలంగాణకాని, ఇతర రాష్ట్రాలలో కాని ఎన్ని ఘటనలు జరిగినా, ఎంత పెద్ద నేరం జరిగినా, దానిని కప్పిపుచ్చేలా వార్తలు ఇస్తున్నారు. అందుకే ఈ ఎల్లో మీడియాను జనం నమ్మవద్దని పదే,పదే చెప్పాల్సి వస్తోంది. ::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
అది ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యం పవన్ వల్ల కాదు..!
-
అమెరికా న్యూజెర్సీలో తెలుగు కుర్రాడి ఘనత
హైదరాబాద్ నుంచి వలస వెళ్లి అమెరికా న్యూజెర్సీలో స్థిరపడిన ఓ కుటుంబం నుంచి వచ్చిన సాహిత్ మంగు ప్రసంగాలతో అదరగొట్టాడు. ప్రతిష్టాత్మక గార్డెన్ స్టేట్ డిబేట్ లీగ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. సాహిత్ మంగు, ఏడో తరగతి అబ్బాయి. భారత్ నుంచి వచ్చిన హైదరాబాదీ కుటుంబం తనది. న్యూజెర్సీ సోమర్సెట్లోని సెడార్ హిల్ ప్రిపరేటరీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. న్యూజెర్సీ రాష్ట్రంలో ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా డిబెట్ లీగ్ టోర్నమెంట్లు జరుగుతాయి. ఈ ఏడాది వేర్వేరు పాఠశాలలకు చెందిన 164 మంది విద్యార్థులు ఈ లీగ్‌లో పోటీ పడగా.. సాహిత్ మంగు గోల్డెన్ గావెల్ టాప్ స్పీకర్ అవార్డు దక్కించుకున్నాడు. సాహిత్ చేసిన పరిశోధన, లోతైన విషయ అవగాహనకు తోడు ధాటిగా చేసిన ప్రసంగం న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. సాహిత్‌ను విజేతగా ప్రకటించిన జడ్జిలు... అతడు ఎంచుకున్న అంశాలను, వాటికి మద్ధతుగా సేకరించిన విషయాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. డిబేట్లో సాహిత్ ఎంచుకున్న అంశాలు ►సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించాలి ►అమెరికాలో అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి రావాలి ►ఫేసియల్ టెక్నాలజీ వల్ల చెడు కంటే మంచే ఎక్కువ ►శాఖాహారమే మంచిది, మాంసాహారం సరి కాదు మరో ఫ్రెండ్‌తో కలిపి డిబేట్లో పాల్గొన్న సాహిత్.. నాలుగు అంశాల్లోనూ ధాటిగా తన వాదనను వినిపించి జడ్జిలను మెప్పించాడు. మొత్తమ్మీద విజేతగా నిలిచి గోల్డెన్ గావెల్ టాప్ స్పీకర్ అవార్డు అందుకున్నాడు. -
నారా లోకేష్ ప్రసంగాల్లో కొత్త కోణం.. పరువు పాయే..!
తెలుగుదేశం నేత, మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు నారా లోకేష్ తన పాదయాత్రలో చేస్తున్న ప్రసంగాలలో కొత్త కోణాలు కనిపిస్తున్నాయి. ఆయన ఒక స్పీచ్ ఇస్తూ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు దేవుడని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాముడని, తాను మూర్ఖుడినని చెప్పారు. లోకేష్ చెబుతున్న అనేక విషయాలలో ఇది ఒకటి. పోలీసు అధికారులను, వైసీపీ నేతలను హెచ్చరించడానికి గాను ఆయన ఈ పోలిక తీసుకు వస్తున్నారు. ఎన్టీఆర్ దేవుడు అయితే ఆయనను ఎందుకు పదవి నుంచి దించేశారు? సొంత కుటుంబ సభ్యులే దారుణంగా ఎందుకు అవమానించారు? ఆ బాధతో కుమిలి, కుమిలి చివరికి గుండెపోటుతో మరణించారే! చంద్రబాబు శ్రీరాముడు అయితే తన మామ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతులను ఎలా చేశారో చెప్పగలగాలి. శ్రీరామచంద్రుడు తన తండ్రి దశరధుడి మాట నెరవేర్చడానికి అడవులకు వెళ్లారు. మహారాజ పదవిని తృణప్రాయంగా వదలుకున్నారు. అది ఆయన గొప్పదనం. కాని చంద్రబాబు తన తండ్రితో సమానం అయిన ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించడానికి చేయని యత్నం లేదు. చివరికి ఆయన సీఎం పదవిని, ఆయన స్థాపించిన టీడీపీని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ జీవించి ఉన్న కొద్ది నెలల్లో పలుమార్లు అవమానకరంగా మాట్లాడారు. అంతేకాదు. శ్రీరాముడు సత్యవాక్పరిపాలకుడుగా పేరొందారు. కాని చంద్రబాబు అసత్యాల పునాదులపై పెద్ద పెద్ద మేడలే నిర్మించారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయినా ఏ రకంగా శ్రీరాముడితో పోల్చారో తెలియదు. లోకేష్‌కు ఉపన్యాసం రాసిస్తున్నవారు ఇలాంటి విషయాలతో సంబంధం లేకుండా అర్ధం,పర్ధం లేకుండా డైలాగులు పెట్టి పరువు తీస్తున్నారు. దీనివల్ల రాజకీయ భవిష్యత్తుకోసం పాదయాత్ర చేస్తున్న లోకేష్‌కు నష్టం తప్ప లాభం ఉండదు. ఈ రెండు పోలికలు ఇలా ఉంటే ఏకంగా తనను తాను మూర్ఖుడినని ఆయన చెప్పుకుంటున్నారు. మూర్కులతో పోల్చుకోవడం ఎంత తెలివైన పనో తెలియదు. వైసీపీ ప్రభుత్వంపై వీరు సైకో అంటూ విమర్శలు చేస్తుంటారు. వాటిని పూర్వపక్షం చేస్తూ తానే సైకోనని ఆయన చెప్పుకుంటున్నట్లుగా ఉంది. తన తల్లిని అసెంబ్లీలో ఎవరూ అవమానించకపోయినా, లోకేష్ కూడా అదే పాట పాడడం దురదృష్టకరం. తల్లిని ఈ దిక్కుమాలిన రాజకీయాలలోకి లాగడం బాధాకరం. శ్రీరాముడిలో మార్పు వచ్చిందట.. వారి సంగతి రాముడే తేల్చుతారట.. అంటూ తండ్రిని ఉద్దేశించి చెబుతున్నారు. చంద్రబాబేమో తన భార్యను అవమానించారని శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోయి, కొద్ది గంటల తర్వాత బోరున విలపించిన సన్నివేశంతో కలకలం సృష్టించారు. లోకేష్ ఏమో చంద్రబాబు ఏదో చేసేస్తారని అంటున్నారు. ఇది వారి వ్యక్తిగత విషయం. వారిష్టం. చంద్రబాబు అయినా, లోకేష్ అయినా పదే, పదే పోలీసులను నిందించడం ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏపీ పోలీసులు వివిధ రంగాలలో నెంబర్ ఒన్ గా నిలిచారని మెచ్చుకుంటుంటే, టీడీపీ నేతలు మాత్రం వారి పట్ల పూర్తి అనుచితంగా వ్యవహరిస్తున్నారు. వారు ఏమి తిట్టినా ఏమీ కాదులే అన్న ధీమా ఉండవచ్చు. వ్యవస్థలను మేనేజ్ చేయగల సత్తా తమకు ఉందన్న నమ్మకం కావచ్చు. తాజాగా అచ్చెన్నాయుడు వేల మంది పాల్గొన్న బహిరంగ సభలో అంత దారుణంగా బూతుపదాన్ని వాడడమే కాకుండా దానిని సమర్ధించుకుంటున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. రాయడానికి కూడా వీలులేని ఆ మాట బూతు కాదని, రొటీన్ భాష అని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. గ్రామాలలో అలాగే మాట్లాడుకుంటారట. తమ ఇంటిలోనో, తమ మనుషుల వద్దో ఆయన ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టుకోమనండి.కాని బహిరంగ సభలలో కూడా దూషణలకు దిగడం, అది కూడా పోలీసులను ఉద్దేశించి అనడం శోచనీయం. పోలీసులు బాధపడితే ఆ పదాన్ని బయటకు తీసుకుంటారట కాని, ఆయన బాధపడడం లేదట. కనీసం క్షమాపణ చెప్పాలన్న స్పృహ కూడా వ్యవహరిస్తున్నారు. ఇదంతా చంద్రబాబు,లోకేష్‌లు అనుసరిస్తున్న విధానం వల్లే జరుగుతోందని అనుకోవాలి. తమను తిడుతున్నారని ప్రచారం చేసే టీడీపీ నేతలు పచ్చిబూతులు మాట్లాడడం ద్వారా తమ నైజాన్ని బయటపెట్టుకుంటున్నారు. మరో సంగతి ఏమిటంటే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని లోకేష్ చెబుతున్నారు. స్థానిక ఎన్నికలలో ఈ రిజర్వేషన్లు కల్పించలేకపోవడం వల్ల, పది శాతం తగ్గడం వల్ల పదహారు వేల పదవులు రాకుండా పోయాయట. ఈ లెక్కలు ఎక్కడ నుంచి తెచ్చారో తెలియదు. పైగా బీసీల రిజర్వేషన్లు తగ్గడానికి టీడీపీ వారు సుప్రింకోర్టుకు వెళ్లడమే కారణమన్నది అందరికి తెలిసిన విషయం. బి.ప్రతాపరెడ్డి అనే టీడీపీ నేత ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. జగన్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తూ జారీ చేసిన జిఓ కి వ్యతిరేకంగా ఆయన ఈ పని చేశారు. ఇప్పుడేమో లోకేష్ మళ్లీ 34 శాతం ఇస్తామని చెబుతున్నారు. దీనిని ఎలా నమ్మాలి?. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా రిజర్వేషన్లు పెంచుతుందన్న సంగతి ఆయన చెప్పగలగాలి. గతంలో కాపులను బీసీలలో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి టీడీపీ మోసం చేసిందన్న విమర్శ ఉండనే ఉంది. ఇప్పుడు కూడా అలాగే బీసీలను మోసం చేయడానికి లోకేష్ ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. లోకేష్ ఏ హామీ ఇచ్చినా తప్పు లేదు. కాని అది ఎలా అమలు చేస్తామో, ఎలా ఆచరణ సాధ్యమో చెప్పగలిగితే ప్రజలు నమ్ముతారు. అంతే తప్ప ఏదో ఒకటి చెప్పేస్తే జనం నమ్మేస్తారనుకుంటే అది కుదరదు. ఆ రోజులు పోయాయి.అదేకాదు. చంద్రబాబు రైతులకు ఎనభై శాతం రుణమాఫీ చేశారని కూడా లోకేష్ అంటున్నారు. నిజంగా అంత శాతం రుణ మాఫీ చేసి ఉంటే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ ఇరవైశాతం సీట్లకే ఎందుకు పరిమితం అయిపోయింది. కేవలం 23 సీట్లే సాధించి దారుణంగా పరాజయం చెందింది.చివరికి లోకేష్ కూడా మంగళగిరిలోనే ఓటమిపాలయ్యారు కదా! ఇవన్ని ఒక ఎత్తు అయితే లోకేష్ సమక్షంలో టీడీపీ కార్యకర్త ఒకరు కుప్పంలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పడం హైలైట్‌గా ఉంది. సోషల్ మీడియాలో ఆ క్లిప్ హల్ చల్ చేస్తోంది. కుప్పంలో టీడీపీ పరిస్థితిపై నేతలు కొందరు ప్రాడ్గా నివేదికలు ఇస్తున్నారని ఆయన చెప్పారు. గ్రౌండ్ లెవెల్లో అలా లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన చెప్పిన తీరు చూస్తే నిజాయితీగానే పార్టీ గురించి ఆవేదన చెందినట్లు కనిపిస్తుంది. చదవండి: లోకేష్ యాత్రలో టీడీపీ కార్యకర్తల షాక్ ఒకవేళ పార్టీకి వ్యతిరేకంగా కావాలని మాట్లాడి ఉంటే, ఆయనను ఈ పాటికి పార్టీ నుంచి బహిష్కరించి ఉండేవారు. ఆయన బహిరంగంగా ఒక వాస్తవం చెప్పడం పార్టీకి నష్టం అవుతుంది. అయినా ఆ కార్యకర్త చెప్పిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ తిరిగి పుంజుకునేలా చేయడానికి ఏమి చేయాలన్నదానిపై ఆలోచన చేసుకోవాలి. గత స్థానిక ఎన్నికలలో టీడీపీ కుప్పంలో ఘోరంగా ఓటమి పాలైంది. మండల, జడ్పిటిసి ఎన్నికలలో ఓటమి చెందడమే కాకుండా, కుప్పం మున్సిపల్ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడినా టిడిపి ఓడిపోయింది కుప్పంలో ముఖ్యమంత్రి జగన్ స్కీములు బాగా పనిచేస్తున్నాయని, పలు అభివృద్ది కార్యక్రమాలకు జగన్ నిధులు ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఆ ప్రభావం వల్ల కుప్పం టీడీపీలో అలజడి ఏర్పడింది. దానికి తోడు ఇంతకాలం టీడీపీకి ఉపయోగపడ్డ బోగస్ ఓట్లను చాలావరకు తొలగించారన్న ఆందోళన కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా కుప్పం నుంచి పాదయాత్ర ఆరంభించిన లోకేష్ కు ఇది నిరాశ కలిగించే పరిణామమే. హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ -
రాహుల్ స్పీచ్‌లు చూసి వాళ్లు భయంతో వణికిపోతున్నారు: సీఎం స్టాలిన్
చెన్నై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. భారత్ జోడో యాత్రలో రాహుల్ స్పీచ్‌లు చూసి కొందరు భయంతో వణికిపోతున్నారని అన్నారు. ఆయన ప్రసంగాలు చూస్తుంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తుకు వస్తున్నారని కొనియాడారు. నేహ్రూ, గాంధీల వారసులు మాట్లాడుతుంటే గాడ్సే భక్తులకు మండుతోందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తన స్పీచ్‌లలో ఎన్నికలపరమైన రాజకీయాల గురించి మాట్లాడటం లేదని, సిద్ధాంతపరమైన రాజకీయాల గురించే ప్రస్తావిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ ప్రసంగాలు చూసి కొన్ని పార్టీలు భయపడుతున్నాయన్నారు. భారత తొలి ప్రధాని నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యవాది అని స్టాలిన్ అన్నారు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంస్థలను అమ్మెస్తోందని, పార్లమెంటులో ప్రతిపక్షాలు మాట్లాడటానికి కూడా అనుమతించకుండా గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భారత్-చైనా బలగాల ఘర్షణ విషయంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా బీజేపీ నిరాకరించింది. సభ్యులు సభలో ఆందోళనలు చేయడంతో రోజూ వాయిదాల పర్వాన్నే కొనసాగించింది. ఈ నేథ్యంలోనే శీతాకాల సమావేశాలను ఆరు రోజులు ముందుగానే ముగించింది. చదవండి: మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ! -
సభలో సీఎం
-
'నేను జైలు పాలైన జర్నలిస్ట్ కూతురుని'...అంటూ చిన్నారి ప్రసంగం! వైరల్
న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల చిన్నారి తన పాఠశాలలో ఇచ్చిన ప్రసంగం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె స్వాత్రత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. పాఠశాల్లో ప్రసంగించింది. ఆమె తన ప్రసంగాన్ని ‘నేను పౌర హక్కులు హరించడం కారణంగా కటకటాల పాలైన జర్నలిస్ట్ కుమార్తెని’ అని ప్రారంభించి అందర్నీ విస్మయపర్చింది. సుమారు రెండు నిమిషాల నిడివి గల ఆ వీడియోలో పౌరులు హక్కులు, మతం, హింసకు తావిచ్చే రాజకీయాలు గురించి ప్రసంగించి ఆశ్చర్యపరిచింది. ఆ చిన్నారి తన ప్రసంగంలో... ‘ప్రతి భారతీయుడికి ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏ మతాన్ని అనుసరించాలి వంటివి నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఇవన్ని మహాత్మ గాంధీ, నెహ్రు, భగత్ సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు, త్యాగాల వల్లే సాధ్యమైంది. నాటి సమరయోధులను స్మరిస్తూ.. పౌరుల సాధారణ స్వేచ్ఛ హక్కులను హరించొద్దు ఇదే నా అభ్యర్థన. నా మాతృభూమిని చూసి గర్విస్తున్నాను, దీన్ని లొంగదీసుకోవాలని చూడకూడదు. మనం 76వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తిరుగులేని ఆనందం, అధికారం కలిగిన ఒక భారతీయురాలిగా "భారత మాతకి జై" అని చెప్పాలనుకుంటున్నాను’ అంటూ ప్రసంగం ముగించింది. ఆ చిన్నారి తండ్రి మలయాళ వార్త ఛానెల్ అజీముఖం రిపోర్టర్ సిద్దిక్ కప్పన్. అక్టోబర్ 2020లో అత్యాచారానికి గురైన 19 ఏళ్ల దళిత మహిళ గురించి రిపోర్టింగ్‌ని నివేదించడానికి వెళ్తుండగా అతడి తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. భద్రతలకు విఘాతం కలిగించాడనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. తనను అకారణంగా జైలు పాలుచేశారని, తాను నిర్దొషినని సిద్ధిక్ పేర్కొన్నాడు. అతడి బెయిల్ దరఖాస్తును సైతం అలహాబాద్ లక్నో హైకోర్టు బెంచ్ తిరస్కరించింది. (చదవండి: జాతీయ వ్యతిరేకులకు కాంగ్రెస్ మద్దుతిస్తోంది: కేఎస్ ఈశ్వరప్ప) -
జగన్, చంద్రబాబుల ప్రసంగాలలో వ్యత్యాసం ఏమిటి!
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుల ప్రసంగాలలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. జగన్ వ్యక్తిగత దూషణలకు పాల్పడకుండా, అధిక భాగం విధానాలకు పరిమితం అవుతుంటే, చంద్రబాబు మాత్రం అత్యధిక శాతం వ్యక్తిగత నిందారోపణలకే పరిమితం అవుతున్నారు. వీరిద్దరూ ఇటీవలి కాలంలో చేసిన కొన్ని ప్రసంగాలను చూద్దాం. సత్యసాయి జిల్లాలో, శ్రీకాకుళంలో జరిగిన సభలలో జగన్ ఉపన్యసిస్తూ, అప్పటివరకు ప్రతిపక్షపార్టీల నేతలు చేస్తున్న విమర్శలకు బదులు ఇచ్చారు. చదవండి: ఎల్లో హెచ్చులు ఢిల్లీ దాకా! చంద్రబాబు రోజూ ఏదో రూపంలో జగన్‌ను విమర్శిస్తుంటే, జగన్ మాత్రం ఇలా పబ్లిక్ కార్యక్రమాలలోనే తన అభిప్రాయాలు చెబుతుండడం విశేషం. మిగిలిన రోజుల్లో చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఇతర నేతలు బదులు ఇస్తుంటారు. కాని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన చాలా వరకు హుందాగా ఉంటూ, రోజూ ఏదో విమర్శ చేయాలని తాపత్రయపడడం లేదు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిలో, ప్రతిపక్షనేత పదవిలో ఉన్న చంద్రబాబు మాత్రం మీడియా సమావేశాలు పెట్టో, జూమ్ లోనో, లేదా లీక్ ద్వారానో జగన్‌ను గంటల తరబడి తిడుతూ ఉంటారు. జగన్ ప్రసంగంలో కొన్ని భాగాలు పరిశీలిద్దాం. రైతులకు మేలు చేయడంలో తాము పోటీపడుతున్నది ప్రతిపక్షాలతో కాదని, దేశంతో అని జగన్ చెప్పారు. వివిధ రాష్ట్రాల అధికారులు ప్రతినిధి బృందాలు వచ్చి ఏపీలో రైతులకు అమలు చేస్తున్న కార్యక్రమాలు చూసి వెళ్లి వారి రాష్ట్రాలలో కూడా అమలు చేయాలని యత్నిస్తున్నారని ఆయన వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతు బీమా పథకం అమలుకు, తన ప్రభుత్వం అమలు చేస్తున్న తీరుకు ఆయన తేడాను వివరించారు. అప్పుడు ఎంత డబ్బు ఇచ్చింది.. ఇప్పుడు ఎంత అధికంగా డబ్బు రైతులకు ఇస్తున్నది ఆయన వివరించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు జరుగుతున్న మేళ్లను వివరించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా తాము చెల్లించామని ఆయన వివరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కౌలు రైతుల భరోసా పేరుతో అనంతపురం జిల్లాలో చేసిన పర్యటనకు బదులు ఇస్తూ, ఆత్మహత్య చేసుకున్న ఒక రైతు తరపు కుటుంబం అయినా, తమకు పరిహారం అందలేదని చెప్పారా అని సీఎం సవాల్ చేశారు. పిల్లలకు నాణ్యమైన చదువులు ఇవ్వడానికి తాను ప్రయత్నిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, పదో తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత శాతంపై వచ్చిన విమర్శలకు బదులుగా చెప్పారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే వైసీపీ ప్రస్తుత మానిఫెస్టో, 2014లో టీడీపీ మానిఫెస్టో రెండిటిని ఆయన తీసుకు వచ్చి వాటి అమలును పోల్చి చూడాలని జగన్ కోరుతున్నారు. ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే మంత్రి ఇల్లు దగ్ధం చేస్తారా అని టీడీపీ, జనసేనలపై ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 లను ఆయన దుష్టచతుష్టతయంతో పోల్చి వారికి దత్తపుత్రుడు తోడు అవుతున్నారని పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో ఎక్కడా చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించడంలేదు. అయితే చంద్రబాబు, లోకేష్‌లు తరచు ఏం పీకావు అంటూ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మాత్రం జగన్ వీరంతా కలిసినా తన తల వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఒక్కటి మినహా మిగిలిన స్పీచ్ అంతా తన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చెప్పడానికే టైమ్ కేటాయిస్తున్నారు. జగన్ చేస్తున్న వాదనలోని అంశాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కాని, పవన్ కల్యాణ్ కాని ఎన్నడైనా జవాబు ఇచ్చారా? రైతు భరోసా కేంద్రాలు వృథా అని వారు ఎప్పుడైనా అనగలిగారా? వాటి ద్వారా ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు తదితర అవసరాలు రైతులకు అందుతున్నాయా? లేదా? ఈ క్రాప్ ద్వారా రైతులకు ప్రయోజనం ఉందా? లేదా ? అమ్మ ఒడి కొనసాగాలా? వద్దా? స్కూళ్లను బాగు చేయడం సరైనదా?కాదా? వీటి గురించి ప్రతిపక్షం ప్రస్తావించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఆహ్వానించవలసిందే. అలా కాకుండా చంద్రబాబు జనరల్ విమర్శలు చేయడమో లేక, దూషణలకు దిగడమో చేస్తున్నారు. ఉదాహరణకు కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టి ఏమి మాట్లాడారు? రాష్ట్రం వల్లకాడు అవుతోందట. గతంలో ఒకసారి మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి రాజధాని ప్రాంతంలో పిచ్చి చెట్లు పెరిగి స్మశానం మాదిరిగా తయారైందని వ్యాఖ్యానిస్తే ఇదే చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతిని స్మశానంతో పోల్చుతావా అని గద్దించారు. కాని ఇప్పుడు అదే చంద్రబాబు ఏకంగా రాష్ట్రం అంతటిని వల్లకాడు అంటున్నారు.ఇది ఎంత దారుణం. వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్‌ను చంపితే డీజీపీ ఏమి చేస్తున్నారని చంద్రబాబు అనడంలో ఏమైనా అర్థం ఉందా? ఈ హత్యను కప్పిపుచ్చుకోవడానికి కోనసీమలో చిచ్చు పెట్టారట. గతంలో పోలీసులు తీవ్రవాదం, మతకల్లోలాలు, ప్యాక్షనిజం, రౌడీయిజం పై పోరాడి అదుపు చేసి ప్రజల ప్రశంసలు పొందరని కాని ఇప్పుడు నేరగాళ్లతో చేతులు కలుపుతున్నారట. ఎవరు ఆ నేరగాళ్లు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసిన చంద్రబాబేనా ఇలా మాట్లాడేది. తన పార్టీవారు, జనసేనవారు కలిసి మంత్రి విశ్వరూప్ ఇంటిని దగ్దం చేస్తే కనీసం బాధపడకుండా ఇంత హేయంగా మాట్లాడడం ఆయనకే చెల్లింది. పదహారు కేసుల్లో నిందితుడుగా ఉన్న ఒక నేరగాడు పీఠం మీద కూర్చుని ఆదేశిస్తే పోలీసులు మిగిలిన పార్టీల హక్కులను హరిస్తారా? అని ఆయన అంటున్నారు. నిందితుడు అని ఆయనే చెబుతారు. అంతలోనే నేరగాడు అని అనేస్తారు. నిందితుడికి, నేరస్తుడికి ఉన్న తేడా ఏమిటో కూడా చంద్రబాబుకు తెలియదా? అసలు ఒక సీఎంను పట్టుకుని ఇలా ద్వేషంతో మాట్లాడవచ్చా? మరి గతంలో చంద్రబాబుపై పడిన కేసుల సంగతేమిటి? ఓటుకు నోటు కేసు విషయం ఏమిటి? ఆయన హయాంలో జరిగిన ఎన్ కౌంటర్లు ఏమిటి? గోదావరి పుష్కరాలలో ఇరవైతొమ్మిది చనిపోతే చివరికి కానిస్టేబుల్‌పై కేసు పెట్టని పోలీసు వ్యవస్థ సమర్థవంతమైనదని ప్రజలు మెచ్చుకున్నారట. చంద్రబాబు ఇలా చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలన్నమాట. ఇంటెలెజెన్స్ అధికారులు.. టీడీపీ హయాంలో విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో బిజిగా ఉంటే వారు చాలా బాగా పనిచేశారని చంద్రబాబు చెబుతున్నారన్నమాట. ఏదైనా హేతుబద్దంగా మాట్లాడితే విలువ ఉంటుందికాని, ఏదో ఒకటి గంటల తరబడి చెప్పుకుంటూ పోతే కొన్నిటిని అయినా నమ్మరా అన్న సిద్దాంతంతో పనిచేసేవారిని ఏమని అనగలం. టీడీపీ విడుదల చేసిన ఒక పుస్తకంలో ఏకంగా లక్షాపాతికవేల మంది ప్రభుత్వ వైఫల్యం కారణంగా మరణించారట. చంద్రబాబు ఏవో చెత్త అంకెలు చెబుతారని అందరికి తెలుసుకాని, మరీ ఇంత నీచంగా అబద్దాలు చెబుతారని ఊహించలేదు. వందల మంది దళితులు, బలహీనవర్గాలవారి ప్రాణాలను ప్రభుత్వం తీసిందట. అసలు సమస్య ఏమిటంటే బడుగు, బలహీనవర్గాలు, పేదలు అత్యధికంగా జగన్ వెంట నడుస్తున్నారు. వారిని ఎలాగైనా జగన్ నుంచి దూరం చేయాలన్న లక్ష్యంతో ఇలాంటి పిచ్చి లెక్కలు చెబితే జనం అసహ్యించుకుంటారన్న భావన కూడా టీడీపీకి రాకపోవడం దురదృష్టకరం. తన పార్టీవారు ఏమి చేసినా ఎవరూ చర్య తీసుకోకూడదట. తన ప్రభుత్వంలో మంత్రులంతా సచ్చీలురట. వారు స్కామ్ లకు పాల్పడినా వదలివేయాల్సిందేనట. చివరికి అది పేపర్ లీకేజీ అయినా,మరొకటి అయినా టిడిపి వారి జోలికి వెళ్లకూడదట. ఇలా సాగుతోంది ఆయన ప్రసంగం. కోనసీమలో క్రాప్ హాలిడే అని, ధాన్యం రైతులే కాదు, ఉద్యానవన రైతులు, ఆక్వా రైతులు ఇలా అన్ని రకాలవారు పంటలు వేయవద్దని అనుకుంటున్నారని చంద్రబాబు సెలవిచ్చారు. ఎన్ని వర్గాలు వారు వీలైతే అందరిని రెచ్చగొట్టడమే వీరి ధ్యేయం అన్నది అర్ధం అవుతూనే ఉంది. వాటికి జగన్ ఒక్క మాటలో జవాబిచ్చేశారు. అయినా చంద్రబాబు వాటిని పట్టించుకోరు. తాను చేయదలిచిన దూషణలు చేసుకుంటూనే పోతారు. అది పార్టీ సమావేశం అయినా, మహానాడు అయినా, మీడియా గోష్టి అయినా ఆయనకు పెద్దగా తేడా ఉండదు. తనకు అండగా ఉన్న మీడియాను అడ్డుపెట్టుకుని ఇలాంటివన్ని ప్రచారం చేస్తుంటారు. దీనివల్ల ప్రజలలో ఆయన పలచన అవడమే తప్ప పార్టీకి ఎంతవరకు ఉపయోగం అన్నది ప్రశ్నార్థకమే. ఈ మధ్య మహానాడు గురించి టీడీపీ నేత ఒకరు ఒక విషయం చెప్పారు. చంద్రబాబు ఒక్కరే గంటల తరబడి ప్రసంగాలు చేస్తున్నారని, వేరేవారు ఎవరైనా మూడు నిమిషాలు మించి మాట్లాడితే మాత్రం వెంటనే ఏదో రకంగా ఆపుతుంటారని ఆయన అన్నారు. చివరికి అనేక తీర్మానాలపై జరిగిన చర్చలలో సైతం ప్రతి తీర్మానంపై చంద్రబాబే కనీసం 45 నిమిషాలకు తక్కువ కాకుండా మాట్లాడారని ఆయన వివరించారు. దీంతో అది విని భరించడమే పెద్ద కష్టం అయిందని ఆయన వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా గంటల తరబడి మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. ఇష్టం ఉన్నా, లేకపోయినా, బలవంతంగా ఆయన పార్టీ కార్యకర్తలకు వినడమో, లేక విన్నట్లు నటించడమో తప్పడం లేదు. జగన్ ఈ విషయంలో చాలా బెటర్. తాను చెప్పదలచుకున్నది సూటిగా స్పష్టంగా చెప్పి మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రసంగాన్ని ముగిస్తున్నారు. ఈ విషయంలో అధికారులుకాని, వైసీపీ కార్యకర్తలు కాని హ్యాపీ అని చెప్పాలి. ఈ రెండేళ్లు చంద్రబాబు నోటి నుంచి ఇంకా ఎలాంటి దుర్భాషలు వస్తాయో తెరపైన చూడాల్సిందే. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కన్నుమూత
-
ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మహామహోపాధ్యాయ, పౌరాణిక సార్వభౌమ, అభినవ వ్యాస బిరుదాంకితులు, ప్రముఖ పురాణ వేదశాస్త్ర పండితులు, ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి (96) శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న చంద్రశేఖర శాస్త్రి స్వస్థలం గుంటూరు జిల్లా క్రోసూరు. ఆయనకు భార్య సీతారామ ప్రసన్నలక్ష్మి, ఆరుగురు కుమారులు రామకృష్ణ, వీరరాఘవశర్మ, రామనాథ్, రామారావు, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ఇద్దరు కుమార్తెలు ఆదిలక్ష్మి, సరస్వతి ఉన్నారు. చంద్రశేఖర శాస్త్రి భాతిక కాయానికి శనివారం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లాది కన్నుమూతపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం జగన్ దిగ్భ్రాంతి చంద్రశేఖర శాస్త్రి మరణంపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్‌తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలను అవపోసన పట్టిన మహా పండితుడు ఆయనని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా బాధించింది: కిషన్‌రెడ్డి మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం చెందడంపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్రంగా బాధించిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఐక్యరాజ్యసమితిలో సెప్టెంబర్‌లో మోదీ ప్రసంగం
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో భారత ప్రధాని మోదీ మరోసారి ప్రసంగిం చనున్నారు. ఐక్యరాజ్యసమితి 74వ వార్షిక జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం ప్రధాని మోదీ ప్రసంగం ఉండనుంది. ఈ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించే ప్రపంచ దేశాధినేతల షెడ్యూల్‌ను యూఎన్ గురు వారం ప్రకటించింది. దీని ప్రకారం సెప్టెం బర్ 24 నుంచి 30 వరకు సాధారణ అసెం బ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమా వేశాల కోసం 112 దేశాల అధ్యక్షులు, 48 మంది ప్రభుత్వాధినేతలు, 30 మంది విదేశాంగ శాఖ మంత్రులు న్యూయార్క్ చేరుకోనున్నారు. ఈ పర్యటన లోనే మోదీ మరికొన్ని ఉన్నత స్థాయి సదస్సులకు హాజరు కానున్నారు. మోదీ మొదటిసారి 2014లో ఐరాసలో ప్రసంగించారు. -
పాలరాతి శిథిలాలు కాకూడదు మన చర్చిలు
నీ క్రియలన్నీ, నీ కష్టాన్నంతా, నీ సహనాన్నంతా నేను యెరుగుదునంటూ ప్రకటన గ్రంథంలోని ఎఫెసు చర్చికి కితాబునిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రభువు కోసం పరిచర్య చెయ్యడంలో ఆ చర్చి ఎన్నడూ వెనకంజ వెయ్యలేదు. ఆ చర్చిలో తప్పుడు పనులున్నాయి, విచ్చలవిడిగా లైంగిక స్వేచ్ఛను ప్రోత్సహించే నీకొలాయితులనే వారి దుర్బోధలున్నాయి. అయితే వారి విషయం నాకెందుకులే అని ఊరుకోకుండా, ప్రభువు ద్వేషించే అలాంటి జుగుప్సాకరమైన విషయాలు, బోధలను ఎఫెసీ చర్చి కూడా వ్యతిరేకించి తన ప్రత్యకతను చాటుకుంది. ఒకప్పుడు యెరూషలేము చర్చికి చెందిన భక్తిపరులైన ఏడుగురు పెద్దలను అపొస్తలులు ఏర్పర్చి, ప్రార్థించి వారిని పరిచర్య కోసం ప్రతిష్టించారు (అపో.కా 6:5.6). వారిలో స్తెఫను ఆదిమ హతసాక్షి అయ్యాడు. కానీ నికోలాసు అనే మరో పెద్ద అభిషేకం పొంది కూడా లైంగిక విశృంఖలత్వాన్ని బోధిస్తూ విశ్వాసభ్రష్టుడయ్యాడు, చర్చిలో చాలామందిని ఆ బోధ దారి మళ్లిస్తుంటే ఎఫెసు చర్చి ఆ చాలా ఖచ్చితమైన వైఖరితో వారిని ఖండించి పారదోలింది.అది దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగించింది (ప్రక 2:1–7). దేవుని నిర్మలమైన ప్రేమను ప్రకటించే చర్చిలోనే అవినీతి నిండితే, అరాచకాలు, అపవిత్రత, ఆశ్రిత పక్షపాతానికి అది నిలయమైతే, ఆ చర్చి లోకానికి వెలుగునేలా చూపిస్తుంది. ఒకప్పుడెంతో గొప్పపేరున్న ఓ చర్చిలో ఇప్పుడు అక్కడి బోధకులు ‘రూతు–బోయజు’ ఉదంతాన్ని ప్రసంగాంశంగా తీసుకొని వారికి సంబంధించి చేసిన అనుచితమైన వర్ణనలు, వ్యాఖ్యలు, వివరణలు వింటూ చర్చిలో ఆడాళ్ళంతా తల దించుకున్నారు, చాలా మంది లేచి వెళ్లి పోయారట. అంటే ఇది మీ చర్చి, మీ ప్రసంగాలు మీరు చేసుకోండంటూ చర్చిని వదిలేసి, వారిని ప్రోత్సహించేందుకు కొన్ని కానుకలేసి మరీ వెళ్లిపోయారట. ఇదీ ఆ సభ్యుల ఆత్మీయ అపరిపక్వత, నిర్వాకం, భ్రష్టత్వం, చేతకాని తనం. ఆ పాస్టర్ ఎలాగు శాపగ్రస్థుడే అన్నది అతని జీవితాన్ని, కుటుంబాన్ని చూస్తేనే తెలుస్తుంది. కానీ చర్చి సభ్యులు అతన్ని నిలదీయొద్దా? అంటే పాస్టర్ కన్నా భ్రష్టులు ఆ చర్చి పెద్దలు, సభ్యులని దేవుడే తేల్చి వారిని పక్కన బెట్టాడన్న మాట. ఎఫెసీ చర్చిలో మాత్రం అలాంటి పప్పులుడకవు. అందుకే ఆయన అంతగా ఆ చర్చిని శ్లాఘించాడు. అయితే నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో, ఎక్కడి నుండి ఆరంభించి ఎక్కడపడ్డావో గుర్తు చేసుకోమ్మన్నాడు దేవుడు. ఇది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక. పెళ్లయిన మొదటి రోజున వధూవరుల మధ్య కనిపించే ప్రేమానుభూతులు జీవితమంతా కొనసాగితే అదెంత భాగ్యం కదూ!! కానీ కొన్నిసార్లు ఆ మొదటి ప్రేమ క్రమంగా చల్లారిపోతుంది. ఇద్దరూ విడిపోరు, కలిసే ఉంటారు. ఇంట్లో కార్యక్రమాలన్నీ యధావిధిగానే సాగుతుంటాయి. కాకపోతే ఆ కార్యాలు ప్రేమతో కాక ఒక తంతులాగా సాగుతాయి... అప్పటికి పిల్లలు పుడతారు, బాధ్యతలు పెరుగుతాయి. అయితే వాళ్ళిద్దరినీ ఒకటిగా పట్టి ఉంచేది వారి మధ్య ఒకప్పుడుండిన ప్రేమ కాదు, పిల్లల పట్ల బాధ్యతలే వారిని కలిపి నడుపుతుంటాయి. యేసును ఆరాధించే చర్చి యేసును ప్రేమించకుంటే ఎలా? యేసును ప్రేమించకుండానే చర్చిని నడుపుతామంటే ప్రేమ కరువైన ఆ దంపతుల కుటుంబం లాగే చర్చి నడుస్తుందేమో కానీ దేవుడందులో ఉండడు. నీ కొలాయితులను చర్చీ నుండి తరిమేయ్యడం ఎంత కష్టమో, పాత ప్రేమల్ని పునరుద్ధరించుకోవడం అంతకన్నా కష్టం. ఈ రెండూ జరగకుంటే ‘నీ దీపస్తంభాన్ని దాని చోటి నుండి తొలగించేస్తానని’ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇది చాలా తీవ్రమైన శిక్ష. దీపం ఆరిపోయిన చర్చి అంటే వైభవం, ప్రభావం కోల్పోయి విశ్వాసులైన జనం లేక శిథిలాలుగా మారడమన్న మాట. ఇప్పుడంతటా అవే కనిపిస్తున్నాయి. ఆరంభంలో పౌలు ఎఫెసు చర్చిలో మూడేళ్లు పరిచర్య చేశాడు. అయితే అది కనుమరుగయ్యింది. టర్కీ దేశంలో ఒకప్పుడా చర్చి ఉన్న ప్రదేశంలో ఇపుడు శిథిలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా చోట్ల అవి చర్చిలన్న బోర్డులు కనిపిస్తాయి, కానీ వాస్తవానికవి శిథిలాలే!! ఆ చర్చి ఎంత అందమైన పాలరాతి భవనమైనా, అందులో అపవిత్రత ఉంటే అది యేసు లేని పాలరాతి శిథిలమే!! – రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
నరేంద్ర మోదీ ‘పద క్రీడ’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కొందరు రాజకీయ నాయకులు ఉపయోగించిన పదాలు చరిత్రలో ఎల్లకాలం మిగిలిపోతాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఇచ్చిన ‘గరీబీ హఠావో (దారిద్య్రాన్ని నిర్మూలించండి)’ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన ‘అచ్చేదిన్ (మంచి రోజులు)’ అలాంటి పదాలే. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ ‘అచ్చే దిన్ ఆనా వాలే హై (మంచి రోజులు రానున్నాయి)’ అంటూ పదే పదే చెబుతూ వచ్చారు. ఆయన చెప్పిన అచ్చేదిన్ వచ్చాయా ? అంటే బాలీవుడ్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ‘కోయి లౌటా దే మెరే బీతే హుహే దిన్’ పాట గుర్తుకు వస్తుంది. గతించిన రోజులను ఎవరైన తీసుకరాగలరా ? నరేంద్ర మోదీ రాజకీయ పరిభాషలో ఉపయోగించిన ఎన్నో హిందీ, ఇంగ్లీషు పదాలు ఎన్నో ప్రాచుర్యంలోకి వచ్చాయి. 2016లో భారత వైమానిక దళాలు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి టెర్రరిస్టు స్థావరాలపై దాడులు నిర్వహించడాన్ని ఆయన తొలి ‘సర్జికల్ స్ట్రైక్స్’ అని వర్ణించారు. అదే సంవత్సరం నవంబర్‌లో నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ‘ఇది దేశంలోని నల్లడబ్బు, ఉగ్రవాదులకు అందే నిధులు, మాదకద్రవ్యాల డబ్బుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్’ అని అప్పటి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పర్రీకర్ అభివర్ణించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా విఫలం అవడంతో ప్రతిపక్ష పార్టీలు ‘పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన సర్జికల్ స్ట్రైక్స్’ అంటూ విమర్శించాయి. నరేంద్ర మోదీ ప్రజా సభల్లో ప్రసంగించినప్పుడల్లా ‘భాయియో ఔర్ బహెనో’ అని సంబోధించడం ఆయనకు అలవాటు. అయితే పాకిస్థాన్‌పై జరిపిన తొలి సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఆయన ‘మిత్రో, మేరే ప్యారీ దేశీవాసీయోం’ అంటూ ప్రజలను సంబోధించడం ప్రారంభించారు. అవి కూడా ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. స్వచ్ఛ్ (భారత్), గోరక్షక్, న్యూస్ ట్రేడర్, ప్రెస్టిట్యూట్ పదాలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇక రానున్న ఎన్నికలను దష్టిలో పెట్టుకొని మోదీ ప్రభుత్వం ‘నా మున్కిన్ అబ్ మున్కిన్ హై’ నినాదం పేరిట వాణిజ్య ప్రకటనలతో అదరగొట్టగా ‘మోడీ హైతో మున్కిన్ హై’ అంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈ పదాల పటాటోపం ఏ మేరకు ఓట్లను కురిపిస్తుందో చూడాలి!. -
27,28,29 తేదీల్లో డా. ఖాదర్‌వలి ప్రసంగాలు
సిరిధాన్యాలు–కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలు, సిరిధాన్యాలను రసాయన రహిత పద్ధతుల్లో పండించుకోవడంపై జనవరి మూడో వారంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ చోట్ల ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార, ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగించనున్నారు. ప్రవేశం ఉచితం. జనవరి 27 (ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు విజయవాడలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్ (పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు)లో సిరిధాన్యాలపై రాష్ట్రస్థాయి సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. వివరాలకు.. 98481 23050, 99632 32104, 98493 12629. జనవరి 28 (సోమవారం) ఉ. 10– మ. 1 గం. వరకు ఖమ్మంలోని ఇ.ఆర్.ఆర్. రిసార్ట్స్ (మమతా ఆసుపత్రి రోడ్డు)లో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, ఇ.ఆర్.ఆర్. రిసార్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సభలో డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 98490 01725, 70939 73999 జనవరి 28 (సోమవారం)న సా. 4 గం.– రా. 7 గం. వరకు నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్స్ (హైదరాబాద్ రోడ్డు)లో డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తున్నాయి. వివరాలకు.. 98486 99282, 70939 73999. జనవరి 29 (మంగళవారం)న ఉ. 10 గం. – మ. 1 గం. వరకు హైదరాబాద్ మెహిదీపట్నంలోని అశోక గార్డెన్స్, కొణిజేటి ఎన్క్లేవ్ (ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ 83 వద్ద)లో డాక్టర్ ఖాదర్ వలి సిరిధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీ, సిరిధాన్యాలను మిక్సీలతో శుద్ధి చేయడంపై తదితర అంశాలపై ప్రసంగిస్తారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, కొణిజేటి గార్డెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తున్నాయి. వివరాలకు.. 94419 27808, 70939 73999. 26న చెవుటూరులో ప్రకృతి సేద్యంపై శిక్షణ కృష్ణా జిల్లా జి. కొండూరు మండలం చెవుటూరులోని గోసేవా క్షేత్రంలో ఈ నెల 26 (శనివారం) ఉ. 9 గం.– సా. 4 గం. వరకు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అనంతపురం జిల్లా బసంపల్లికి చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు తాడిమర్రి నాగరాజు చేత శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గోసేవా క్షేత్రం నిర్వాహకులు పోకూరి బాలకృష్ణ, ఇందిరారాణి తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 91826 71819, 94407 46074. గోపాలనపై 4 రోజుల సర్టిఫికెట్ కోర్సు గోపాలనలో వివిధ అంశాలపై బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన ఎస్.ఎస్.ఐ.ఏ.ఎస్.టి. ఆధ్వర్యంలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు 4 రోజుల సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు బాధ్యులు ఉమామహేశ్వరి తెలిపారు. వివిధ దేశీ జాతులకు చెందిన వెయ్యి ఆవులతో కూడిన గోశాలను ప్రామాణికంగా నిర్వహిస్తున్న బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో శిక్షణ ఇస్తారు. దేశీ ఆవుల విశిష్టత, వాటి ఆలన – పాలన, సేంద్రియ మేత, ఎ2 పాల ఉత్పత్తి, గోమయం, గోమూత్రాలతో ఫినాయిల్, విభూది, అగర్బత్తీ, పంచగవ్య వంటి ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తారు. కోర్సు చందా: రూ. 5 వేలు. రిజిస్ట్రేషన్ ఇతర వివరాలకు.. 90004 08907, 79937 95246, 93810 25358. -
పవన్ ఓ అజ్ఞానవాసి
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో మంగళవారం జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అలవాటైన ఆవేశం తోపాటు అంతే అనాలోచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. పవన్ చేసిన విమర్శలన్నీ వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని ఎవరికైనా సులువుగానే అర్థమవుతుంది. వంగవీటి రంగాను చంద్రబాబు చంపించాడని కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం, చేగొండి హరి రామయ్య జోగయ్య గతంలో చెప్పారు. అటువంట ప్పుడు చంద్రబాబుకు పవన్‌కల్యాణ్ మద్దతు ఎలా ఇచ్చారు? నా ప్రాణాలకు ముప్పు ఉందంటూ వంగవీటి రంగ స్వయంగా నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడే కదా హత్యకు గురయ్యారు. అప్పుడు అధి కారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వమే నని పవన్ మర్చిపోయారా? ప్రజారాజ్యం యువ నేతగా 2009లో చంద్రబాబును దొంగల ముఠా నాయకుడు అని విమర్శించి 2014లో ఎలా మద్దతు ఇచ్చారు? ఇందుకు పవన్‌కు ముట్టినది ఎంత? రాజ్యసభ పదవి కట్టబెడ తానని ఇవ్వనందుకే పవన్ ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారా? వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి 1998లో చంద్రబాబు అధికారంలో వుండ గానే హత్యకు గురయ్యారు. తర్వాత వైఎస్ సీఎం అయినా ప్రత్యర్థులపై ప్రతీ కారం తీర్చుకోలేదు. రాజారెడ్డి హంతకుల వ్యవహా రాన్ని చట్టానికే వదిలేసిన వైఎస్ కుటుంబం ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తోందనడం హాస్యాస్పదం. గోదావరి జిల్లాలకు ఫ్యాక్షని జాన్ని తీసుకొస్తే ఊరుకోమనడం పవన్ అవి వేకం. వైఎస్‌కు రెండోసారి కూడా గోదావరి జిల్లాల ప్రజలు పట్టంకట్టారని తెలియకపో వడం పవన్ అజ్ఞానవాసి అనడానికి నిదర్శనం. లేక చంద్రబాబులా పవన్‌కు కూడా మెమరీలాస్ ఏమైనా వుందా అని సందేహం కలుగు తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పార్టీ పెట్టిన అన్న చిరంజీవి పైగానీ, అసెంబ్లీ బయట జగన్‌ను దారు ణంగా తిట్టిన టీడీపీ నేతలపైనగానీ దాడులు జరిగాయా? పరిటాల హత్యలో జేసీ దివా కర్‌రెడ్డి పాత్ర ఉందని ఆరోపించిన చంద్ర బాబు ఆయనకు టీడీపీ ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారు? ప్రతీకారంతోనే పరిటాల రవిని మద్దెల చెరువు సూరి హతమార్చాడని అందరికీ తెలుసు. ఒకవేళ ఎల్లో మీడియా ప్రచారమే నిజమని నమ్మేటట్లయితే, తన గురించి చేసిన ప్రచారం కూడా నిజమని పవన్ ఒప్పు కుంటారా? అయిదేళ్లుగా వైఎస్ జగన్‌పై పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నప్పటికీ కేవలం ఒక్కసారి మాత్రమే ఆయన పవన్‌పై వ్యాఖ్యలు చేశారు. దానికే పవన్ చాలా గింజుకున్నారు. గురివింద గింజ తన నలుపు తానెరుగదన్న సామెత పవన్ విష యంలో గుర్తుకు రాక తప్పదు. – సి.వి.రెడ్డి ccvr64@gmail.com -
వాజపేయి ప్రసంగం ఇప్పటికీ ఎందరినో వెంటాడుతోంది
-
వాగ్ధాటి.. లేరు సాటి!
వాజ్‌పేయి మంచి వక్త. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ప్రధానిగా ఉన్నా ఆయన ప్రసంగం మొదలు పెడితే చాలు పార్లమెంటు సభ్యులందరూ నిశ్శబ్దంగా చెవులు రిక్కించి వినేవారు. సునిశితమైన హాస్యాన్ని పండిస్తూ, కవితా పరిమళాలు వెదజల్లుతూ, విమర్శకుల నోళ్లను మూయిస్తూ, చమత్కారపూరితంగా ఒక గంగా ప్రవాహంలా ఆయన ప్రసంగాలు సాగిపోయేవి. ఆయనలోని సంభాషణాచాతుర్యానికి స్వపక్ష నేతలే కాదు ఇతర పార్టీల నాయకులు కూడా మంత్రముగ్ధులయ్యేవారు. తొలి ప్రసంగంతోనే నెహ్రూ ఫిదా 1957లో వాజ్‌పేయి పార్లమెంటేరియన్‌గా తన తొలి ప్రసంగంతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వాజపేయి విదేశాంగ విధానంపై చేసిన ప్రసంగానికి విస్తుపోయారు. అంత చిన్న వయసులో అపారమైన పరిజ్ఞానంతో మాట్లాడిన వాజ్‌పేయిని ఆకాశానికెత్తేశారు. రాజకీయాల్లో ఆ యువకుడికి ఉజ్వల భవిష్యత్ ఉందని, ఎప్పటికైనా దేశ ప్రధాని అవుతారంటూ అప్పట్లోనే జోస్యం చెప్పారు. ఆగ్రహావేశాలు ప్రదర్శించగలరు వాజ్‌పేయి మృదుస్వభావి. ఆయన ప్రసంగాలు కూడా ఎప్పుడూ సుతిమెత్తగా సాగిపోయేవి. కానీ అవసరమైతే ఆ స్వరం నిప్పులు కూడా కురిపించగలదు. 1997లో ఐకే గుజ్రాల్ ప్రధాని గా ఉన్న సమయంలో బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంపై చర్చ జరిగే సమయంలో వాజ్‌పేయి ప్రసంగంలో ఆగ్రహావేశాలు కనిపిస్తాయి. వాజ్‌పేయిలో ఆ కోణాన్ని చూసి సభ యావత్తూ విస్తుపోయింది. శాంతే ప్రధానం లేదంటే సమరమే మిత్రులను మార్చుకోవచ్చు, కానీ ఇరుగుపొరుగుని మార్చలేం. మేము శాంతినే కోరుకుంటాం కాదంటారా సమరానికైనా సిద్ధం అంటూ పాక్‌కు రిటార్ట్ ఇచ్చారు. 1998లో పోఖ్రాన్ –2 (ఆపరేషన్ శక్తి) అణు పరీక్షలపై సర్వ త్రా ఆందోళనలు వ్యక్తమైనప్పుడు వాజ్‌పేయి బాగా సమర్థించుకున్నారు. ‘ఇప్పటికే మూడు సార్లు దాడులకు బలయ్యాము. అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదు. ఒకవైపు లాహోర్ బస్సు సర్వీసు అంటూ ఈ అణుపరీక్షలేమిటని అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ రెండూ ఒకే నాణేనికి చెరోవైపులాంటివి. నీతి నిజాయితీతో స్నేహహస్తం జాపాం. తోకజాడిస్తారేమోనని రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం’అంటూ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. శ్రమయేవజయతే నినాదం ‘నేను ఓటమిని అంగీకరించను. పోరు బాట పట్టడమే నాకిష్టం. ఆకాశాన్నంటే ఆశయాలను సాధించాలంటే కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా తలవంచకూడదు‘అంటూ వాజపేయి తన ప్రసంగాల్లో శ్రమయేవ జయతే నినాదాన్నే ఎప్పుడూ వినిపించేవారు. కష్టపడి పనిచేస్తేనే బంగారు భవిష్యత్ సాధ్యపడుతుందని ఆయన యువతరానికి పదే పదే పిలుపునిచ్చేవారు. 2002 స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలోనూ మన ముందున్న లక్ష్యం చాలా పెద్దదే కావొచ్చు, కానీ చేయి చేయి కలిపితే, కష్టపడి పోరాడితే విజయం మన ముందు తలవంచుతుంది అంటూ ఎందరిలోనో ఉత్తేజాన్ని నింపారు. కొత్త సంబంధాలు 2000 సంవత్సరంలో అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి వాజ్‌పేయి చేసిన ప్రసంగం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసిందనే చెప్పాలి. ప్రపంచ దేశాల మధ్య శాంతి, సుస్థిరతలకు పాటు పడాలని, అన్ని రంగాల్లోనూ సహకరిస్తూ కొత్త అధ్యాయానికి తెరతీయాలంటూ వాజ్‌పేయి చేసిన ప్రసంగాన్ని అమెరికన్లు ఎప్పటికీ మర్చిపోలేమని అంటారు. అద్భుతమైన వాదనా పటిమ వాజ్‌పేయి ఏదైనా అంశంపై మాట్లాడితే ముందస్తుగా సుదీర్ఘమైన కసరత్తు చేసేవారు. రకరకాల గణాంకాలను ప్రస్తావిస్తూ, వాస్తవాలనే మాట్లాడుతూ తన వాదనకు బలమైన పునాదులు ఏర్పాటు చేసుకోవడం ఆయన ప్రసంగాల్లో విలక్షణంగా కనపడేది. అందుకే ఆయన ఆరెస్సెస్‌కి అనుకూలంగా మాట్లాడినా కూడా సభలో ఎలాంటి అలజడి చెలరేగేది కాదు. ఇతర పక్షాల సభ్యులు నోరు మెదపలేకపోయేవారు. పీవీ నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జెనీవాలో కశ్మీర్ అంశంపై జరిగే చర్చలకు ప్రతిపక్ష నాయకుడైన వాజ్‌పేయిని భారత్ ప్రతినిధిగా పంపించారంటే ఆయనకున్న వాదనాపటిమ ఎంతటిదో, ఇతర పక్ష నేతలూ వాజ్‌పేయి అంటే ఎంత గౌరవం ఇస్తారో అర్థమవుతుంది. నేటికీ వెంటాడే ప్రసంగం 1996లో 13 రోజుల పాటు ప్రధాని పదవిలో కొనసాగిన వాజ్‌పేయి గద్దె దిగిపోతూ మంద్రస్వరంతో నీతి నిజాయితీ ఉట్టిపడేలా చేసిన ప్రసంగం భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఒక కీలక ఘట్టం. నాటి ప్రసంగాన్ని దూరదర్శన్‌లో లైవ్ టెలికాస్ట్ అయింది. ఇలా చట్టసభల సమావేశాలను లైవ్ ఇవ్వడం అదే తొలిసారి. అప్పట్లో వాజ్‌పేయి సభ విశ్వాసాన్ని పొందలేకపోయినా తన ప్రసంగం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ‘మీకు ఎంత శాతం ఓట్లు వచ్చాయని నన్ను అడుగుతున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లు ముఖ్యమా? సీట్లు ముఖ్యమా? మన పార్లమెంటరీ వ్యవస్థలో నెగటివ్ ఓట్లను ఎవరూ లెక్కపెట్టరు. అలాంటప్పుడు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని మీరెలా అంటారు’ అంటూ వాజ్‌పేయి చేసిన ప్రసంగం ఈనాటి రాజకీయాలకు కూడా అద్దం పడుతోంది. అంతటి వక్తకి నోట మాట రాలేదు.. వాజ్‌పేయి మృదుస్వభావి. వెన్నలాంటి మనసు. ఏ అంశం మీదైనా అనర్గళంగా మాట్లా డే ఆయన నోటి వెంట మాటరాని సందర్భం ఒకసారి ఎదురైంది. 1988లో బిహార్‌లోని పరారి యా గ్రామంపై దాడి చేసిన ఖాకీలు తమ కర్కశత్వాన్ని చాటుకున్నారు. వెనుకబడిన కులాల ఇళ్లౖ పె దాడులు చేసి వారి సామాన్లను లూటీ చేశారు. మహిళల్ని పాశవికంగా సామూ హిక అత్యాచారం చేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన వాజ్‌పేయి చలించారు. చెవి కమ్మలు, ముక్కెరలు తెగిపోయి రక్తంతో దీనస్థితిలో ఉన్న వారిని చూసి విస్తుపోయారు. నోట మాట రాక మౌనంగా ఉండిపోయారు. కన్నీరు పెట్టుకు న్నారు. బుగ్గల మీద నుంచి జారిపడిన కన్నీటి చారికలతో వాజపేయి చెప్పిన మాట ఒక్కటే. ‘రేపిస్టుల్ని ఉరితీయాలి‘. ఆ ఒక్క మాటతోనే అత్యాచార బాధితులకు కొండంత ఊరట ఇచ్చారు. ఏకాభిప్రాయంతోనే 3 రాష్ట్రాల ఏర్పాటు న్యూఢిల్లీ: వాజ్‌పేయి ఏకాభిప్రాయం కోసం తీవ్రంగా శ్రమిస్తారన్నది అందరూ చెప్పేమాట అయితే, 2000 ఏడాదిలో ఆయన ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం ఇందుకు చక్కని ఉదాహరణ. ఆ ఏడాది నవంబర్ 1న మధ్యప్రదేశ్‌ను విభజించి ఛత్తీస్‌గఢ్‌ను, అదే నెల 9న ఉత్తరప్రదేశ్‌ను విభజించి ఉత్తరాఖండ్‌ను, 15న బిహార్‌ను విభజించి జార్ఖండ్‌ను వాజ్‌పేయి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. అయితే ఎక్కడా ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఈ మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇటీవల అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలోనూ ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఆ మూడు రాష్ట్రాలూ ప్రశాంతంగా ఏర్పడ్డాయి’ అన్నారు. (పెరిగిన పెట్రోలు, కిరోసిన్ ధరలకు నిరసనగా ఎడ్లబండిపై పార్లమెంటు సమావేశాలకు వెళుతున్న వాజ్‌పేయి) 12 సార్లు ఎంపీగా.. న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 47 సంవత్సరాల పాటు మాజీ ప్రధాని వాజ్‌పేయి సేవలందించారు. 12 సార్లు పనిచేసిన అతికొద్ది మందిలో ఆయన ఒకరు. 10 సార్లు లోక్‌సభకు ఎన్నిక కాగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఒక్కసారి మాత్రమే ఆయన ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. 1984లో గ్వాలియర్ నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు సింధియా చేతిలో 2 లక్షల ఓట్ల తేడాతో వాజ్‌పేయి ఓడిపోయారు. రెండు భాషల్లోనూ పట్టు ఇంగ్లిష్, హిందీ రెండు భాషల్లోనూ వాజ్‌పేయి అనర్గళంగా మాట్లాడగలరు. 1977లో ఐరాసలో హిందీలో మాట్లాడి మాతృభాషపై మమకారాన్ని చాటుకున్నారు. ఏ భాషలో మాట్లాడినా హాస్యం, వ్యంగ్యాన్ని విడిచిపెట్టలేదు వ్యంగ్యపూరిత వ్యాఖ్యలు ♦ బీజేపీలో వాజ్‌పేయి దళం ఉంది, అడ్వాణీ దళం ఉంది అని విపక్షాలు విమర్శిస్తే, వాజపేయి ‘నేను ఏ దళ్‌దళ్ (బురద)లో లేను. కానీ అవతలి వారి బురదలో కమలదళాన్ని వికసింపజేయగలను’ అంటూ ఎదురుదాడి చేశారు. ♦కశ్మీర్ లేకుండా పాకిస్తాన్ అసంపూర్ణం అని పాకిస్తాన్ మంత్రి ఒకరు అంటే దానికి వాజ్‌పేయి ఇచ్చిన సమాధానం పాకిస్తాన్ లేకుండా హిందూస్తాన్ కూడా అసంపూర్ణమే. ♦ ఒక చేత్తో ఎవరూ చప్పట్లు కొట్టలేరు కదాని పాక్ నేతలు పరోక్షంగా భారత్ కయ్యానికి కాలు దువ్వుతోందని ప్రస్తావిస్తే వాజ్‌పేయి చప్పట్లు కొట్టలేం నిజమే. కానీ చిటికెలు వెయ్యగలం కదా అంటూ పాక్ నోరు మూయించారు. ♦ విపక్షాలు రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ, తప్పుడు పార్టీలో మంచి మనిషి అని వ్యాఖ్యానిస్తే, అయితే ఈ మంచి మనిషిని ఏం చేయాలని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ♦ బిహార్‌లో ఒక సభలో ‘నేను అటల్‌ని. ఒక్క క్షణం ఆగి బిహారిని కూడా ‘అంటూ ప్రసంగాన్ని ప్రారంభించగానే చప్పట్లే చప్పట్లు. -
చాలినంత ఉన్నాయా?!
ఆయన ఓ తాత్విక గురువు. జ్ఞాని. మానవ అవసరాలకు సంబంధించి, తత్వాల గురించి ఎన్నో అమూల్యమైన విషయాలను తన ప్రసంగాల ద్వారా తెలియ చెప్పిన ఆధ్యాత్మిక వేత్త.ఓసారి ఓ ధనవంతుడొకరు ఆయనను చూడ్డానికి వచ్చాడు. వస్తూనే గురువుకు దణ్ణం పెట్టి చేతిలో ఉన్న ఓ సంచి ఆయనకు అందించాడు. గురువు ఆ సంచిని తీసుకుని దానివంక నవ్వుతూ చూశారు.‘‘ఏమిటిది’’ అని అడిగారు.‘‘మీ ఆశ్రమానికి నా వల్ల చేతనైన విరాళం ఇవ్వాలనిపించింది‘‘ అని అన్నాడు ధనవంతుడు.‘‘ఇందులో ఏముంది?’’ అన్నారు గురువు.‘‘వెయ్యి బంగారు నాణాలు’’ అన్నాడు ధనవంతుడు దర్పంగా. ‘‘సంతోషం’’ అంటూనే ధనవంతుడి వంక చూసి ‘‘మీ దగ్గర ఇంతకన్నా ఎక్కువ బంగారు నాణాలు ఉండే ఉంటాయి కదూ..’’ అని అడిగారు గురువు.‘అవునండీ.. ఉన్నాయి’’ అన్నాడు ధనవంతుడు. ‘‘అవన్నీ మీకు చాలినంతగానే ఉన్నాయా’’ అని గురువు ప్రశ్నించారు.ధనవంతుడు ఆలోచనలో పడ్డాడు.కాసేపటి తర్వాత ధనవంతుడు ‘‘లేదు స్వామీ, ఇంకా కూడా కావలసి వస్తోంది. అందుకే రాత్రీ పగలూ అని చూసుకోకుండా శ్రమిస్తున్నాను’’ అన్నాడు ధనవంతుడు.గురువు ఆ మాటలు విని తన చేతిలో ఉన్న డబ్బు సంచిని తిరిగి ఆ ధనవంతుడికే ఇచ్చేశారు.ఇచ్చి, ‘‘ఈ నాణాల అవసరం నాకన్నా మీకే ఎక్కువగా ఉంది... మీ దగ్గరే ఉంచుకోండి’’ అన్నారు.ధనవంతుడు ముందు తెల్లబోయాడు. తర్వాత తనకు ఏదో అర్థమైందన్నట్టుగా తలపంకించి, గురువుకు దణ్ణం పెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మనిషికి డబ్బు అవసరమే. అది తీరని ఆశ. ఎంతున్నా చాలదు అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్లకు ఎవరిౖకైనా డబ్బు ఇవ్వాల్సి వచ్చినా వారిలో ఇస్తున్నప్పుడు ఆనందముండదు. లోలోపల ఏదో తరిగిపోతున్నట్టే అనిపిస్తుంది. ఉన్నదానితో తృప్తి పడే మనసున్నప్పుడే ఎవరికైనా సాయం చేసినప్పుడు సంతృప్తిగా ఉంటుంది. – యామిజాల జగదీశ్ -
అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకుందాం
సాక్షి, మక్తల్ : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర పన్నిందని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.వై రత్నం, కేఎన్పీఎస్ రాష్ట్ర నాయకుడు డి.చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎస్ఎస్ పంక్షన్హాల్లో కేఎన్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా మొదటి మహసభలో వారు అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. అంటరానితనం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలను చేయాలని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్ధాలు దాటుతున్నా ఇంకా ప్రజలు తమ హక్కులను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత పీడిత కులాల మహిళలను అవమానించే రీతిలో జోగిని, బస్వినీలుగా మార్చే సంస్కృతి నుంచి బయట పడాలని సూచించారు. తెలంగాణ వచ్చిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట మార్చారని, మైనార్టీలపై దాడులు చేస్తుంటే పట్టించుకోవడంలేదన్నారు. సమాజంలో సామాజిక సమానత్వం, స్వేచ్ఛ, సౌబ్రాతృత్వం విలువలను కాపాడాటానికి అందరు తమవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కెఎన్పీఎస్ రాష్ట్ర నాయకులు భూరం అభినవ్, రాములు, బండారి నర్సప్ప, రమేష్, లింగన్న, కృష్ణ, శ్రీదేవి, రాంచందర్, మద్దిలేటి, వామన్, మున్వర్‌అలీ, బండారి లక్ష్మణ్, వెంకటేస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రసంగాలతో సరి..
మచిలీపట్నం(కోనేరుసెంటర్) : భూసమీకరణ నోటిఫికేషన్‌పై బాధిత రైతులకు అవగాహన కల్పించేందుకు టీడీపీ నాయకులు ఆదివారం నిర్వహించిన సదస్సు సర్వత్రా విమర్శలకు దారి తీసింది. సదస్సుకు రాజధాని నుంచి వచ్చిన రైతులు తమ ప్రసంగాల్లో పదేపదే చంద్రబాబునాయుడు పేరుతో పాటు తాడికొండ శాసనసభ్యుడు శ్రావణ్‌కుమార్‌తో పాటు ముఖ్యమంత్రి పేరును జపించటంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. సదస్సు రైతులకా – కమిటీలకా భూసమీకరణపై అవగాహన కలిగించేందుకు నిర్వహించిన సదస్సుకు రైతుల నుంచి స్పందన కనిపించలేదు. సుమారు 500 మంది హాజరుకాగా అందులో భూములు ఇచ్చేందుకు రైతులను ఒప్పించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులే అధికంగా ఉన్నారు. ఆగ్రహంతో వెనుదిరిగిన రైతులు.. ఈ సదస్సుకు బాధిత గ్రామాల నుంచి పదుల సంఖ్యలో హాజరైన రైతులకు చివరికి నిరాశే మిగిలింది. సదస్సులో ఒకరిద్దరు రైతులు మైకులో మాట్లాడేందుకు ప్రయత్నించగా నాయకులు మైకులు ఆపేసి దగ్గరకు పిలిపించుకుని సమా«ధానం చేప్పే ప్రయత్నం చేశారు. -
ఆ సీడీల్లో ఏముందో పరిశీలిస్తున్నాం..
న్యూఢిల్లీ: వివాదాస్పద ముస్లిం మత ప్రవక్త జాకీర్ నాయక్ ప్రసంగాలపై విచారణ చేపడుతున్నామని శుక్రవారం కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు. జకీర్ ప్రసంగాలతో కూడిన సీడీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని తెలిపారు. ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని రాజనాథ్ సింగ్ తేల్చి చెప్పారు. జకీర్ తన ప్రసంగాలతో అమాయకులను ఉగ్రవాదం వైపు మళ్లించాడనే అరోపనలున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు డాక్టర్ జాకీర్ నాయక్ కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
అరివీర భయంకర మైకాసురుడు
తిక్క లెక్క మైకు కనిపించగానే మైకం ముంచుకొచ్చినట్లు గంటల తరబడి ఉపన్యాసాలు దంచేవాళ్లను మైకాసురులని పిలుచుకుంటాం. ఇలాంటి శాల్తీలు ఎక్కువగా సాహితీ సభల్లో, రాజకీయ సభల్లో తారసపడుతూ జనాల సహనానికి పరీక్ష పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్లందరినీ తలదన్నే అరివీర భయంకర మహా మైకాసురుడు ఈ ఫొటోలో కనిపిస్తున్న పెద్దమనిషి. ఈ ముంబైవాలా పేరు అజయ్ శేష్. వృత్తిరీత్యా వైద్యుడు, ప్రవృత్తిరీత్యా మైకాసురుడు. మైకు పట్టుకుని మరీ రికార్డు బద్దలు కొట్టాలని డిసైడైపోయిన ఈ పెద్దమనిషి గత ఏడాది మే 27న ముంబైలోని ఒక హోటల్లో కార్యక్రమం ఏర్పాటు చేశాడు. జనాలు వచ్చి కూర్చున్నాక మే 27 మధ్యాహ్నం 3.44 గంటలకు మైకు పుచ్చుకుని ఉపన్యాసం మొదలుపెట్టాడు. నిరంతరాయంగా తన వాగ్ధాటిని మే 30 వేకువ జామున 4.13 గంటల వరకు కొనసాగించి గిన్నెస్ రికార్డు బద్దలు కొట్టాడు. -
జగన్ మాటలు.. జనం చ ప్పట్లు
సాక్షి, తిరుపతి: సమైక్య శంఖారావం పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కర్ణాటక నుంచి జిల్లాలోకి ప్రవేశించిన ఆయన పత్తికొండలో తొలి ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే యువకులు ఉద్యోగాలకు ఎక్కడకు వెళ్లాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కాలర్ పట్టుకుని అడగాలన్నారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రం విభజించవద్దని, తెలుగువారిని చీల్చవద్దని సోని యా గాంధీకి వినబడేలా అరవాలని కోరడంతో, గట్టిగా ‘వద్దు వద్దు’ అని అరిచారు. అయితే సోనియా గాంధీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగులో చెబితే అర్థం కాదని, ఇంగ్లిషులో ‘నో’ చెప్పాలని, చేతులెత్తి అరవాలని అనడంతో ప్రజలు ‘నో’ అంటూ గట్టిగా అరిచారు. రెండు చేతులు పెకైత్తి నినాదాలు చేశారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ఎడారిలా మారిపోతుందని, దీంతో ప్రజలు ఎలా బతకాలని జననేత ప్రశ్నించినపుడు ప్రజలు హోరుమని అరిచి, ఆయన ప్రసంగానికి మద్దతు పలికారు. మరో సభ అప్పినిపల్లిలో జరగగా, అక్కడ కూడా ఆయన ప్రసంగానికి విశేష ఆదరణ లభించింది. వైఎస్ మరణించి, నాలుగేళ్లు గడుస్తున్నా, ఆయనను గుండె ల్లో పెట్టుకుని, రాత్రి సమయంలో కూడా తన సభకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలపగా, దానికి ప్రజల నుంచి ‘వైఎస్ ఎప్పటికీ మా గుండెల్లో ఉంటాడు’ అన్నారు. రాష్ట్రాన్ని విభజించినా పర్వాలేదని, ఇప్పుడు మన పిల్లలు చెన్నైలోను, బెంగళూరులోను ఉద్యోగాలు చేయడం లేదా అని ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు లాంటి వారు మన నాయకులా అని జననేత ప్రశ్నిస్తే ‘కాదు కాదు’ అని సమాధానం చెప్పారు. చెన్నైలో, బెంగళూరులో ఆంధ్ర రిజిస్ట్రేషన్‌తో వాహనాలు కనిపిస్తే వారి పట్ల ఏ విధం గా అక్కడి వారు ప్రవర్తిస్తారో చంద్రబాబు నాయుడుకు తెలియదా అని జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ప్రసంగించిన ప్రతి చోటా అయనకు అపూర్వ ఆదరణ లభించింది. కొన్ని చోట్ల ఆయన ప్రసంగం లేక పోయినా, ప్రజలు కోరడంతో మాట్లాడారు. నక్కనపల్లి, కొల మాసనపల్లెలో సైతం ప్రసంగించారు.