జగన్ మాటలు.. జనం చ ప్పట్లు
సాక్షి, తిరుపతి: సమైక్య శంఖారావం పర్యటనలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కర్ణాటక నుంచి జిల్లాలోకి ప్రవేశించిన ఆయన పత్తికొండలో తొలి ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే యువకులు ఉద్యోగాలకు ఎక్కడకు వెళ్లాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కాలర్ పట్టుకుని అడగాలన్నారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
రాష్ట్రం విభజించవద్దని, తెలుగువారిని చీల్చవద్దని సోని యా గాంధీకి వినబడేలా అరవాలని కోరడంతో, గట్టిగా ‘వద్దు వద్దు’ అని అరిచారు. అయితే సోనియా గాంధీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగులో చెబితే అర్థం కాదని, ఇంగ్లిషులో ‘నో’ చెప్పాలని, చేతులెత్తి అరవాలని అనడంతో ప్రజలు ‘నో’ అంటూ గట్టిగా అరిచారు. రెండు చేతులు పెకైత్తి నినాదాలు చేశారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ఎడారిలా మారిపోతుందని, దీంతో ప్రజలు ఎలా బతకాలని జననేత ప్రశ్నించినపుడు ప్రజలు హోరుమని అరిచి, ఆయన ప్రసంగానికి మద్దతు పలికారు.
మరో సభ అప్పినిపల్లిలో జరగగా, అక్కడ కూడా ఆయన ప్రసంగానికి విశేష ఆదరణ లభించింది. వైఎస్ మరణించి, నాలుగేళ్లు గడుస్తున్నా, ఆయనను గుండె ల్లో పెట్టుకుని, రాత్రి సమయంలో కూడా తన సభకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలపగా, దానికి ప్రజల నుంచి ‘వైఎస్ ఎప్పటికీ మా గుండెల్లో ఉంటాడు’ అన్నారు. రాష్ట్రాన్ని విభజించినా పర్వాలేదని, ఇప్పుడు మన పిల్లలు చెన్నైలోను, బెంగళూరులోను ఉద్యోగాలు చేయడం లేదా అని ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు లాంటి వారు మన నాయకులా అని జననేత ప్రశ్నిస్తే ‘కాదు కాదు’ అని సమాధానం చెప్పారు.
చెన్నైలో, బెంగళూరులో ఆంధ్ర రిజిస్ట్రేషన్‌తో వాహనాలు కనిపిస్తే వారి పట్ల ఏ విధం గా అక్కడి వారు ప్రవర్తిస్తారో చంద్రబాబు నాయుడుకు తెలియదా అని జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రసంగించిన ప్రతి చోటా అయనకు అపూర్వ ఆదరణ లభించింది. కొన్ని చోట్ల ఆయన ప్రసంగం లేక పోయినా, ప్రజలు కోరడంతో మాట్లాడారు. నక్కనపల్లి, కొల మాసనపల్లెలో సైతం ప్రసంగించారు.